11-12-2022, 08:57 PM
ప్రసాద్ అర్ధం కానట్టు వందన వైపు చూస్తూ, “ట్రైసోడిమెసిటేట్….అంటే ఏంటి,” అనడిగాడు.
వందన తన చేతిలో ఫైల్ మూసేస్తూ, “బ్లడ్ మామూలుగా అయితే వెంటనే క్లాట్ అవుతుంది…అది జరక్కుండా యాడ్ చేసే ఈ ట్రైసోడిమెసిటేట్ చేస్తుంది…బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చెసే ఒక కెమికల్,” అన్నది.
వందన చెప్పింది విన్న ప్రసాద్, “అబ్బా….ఏం ఇరగదీసావే…ఈ విషయం నీకు ఎలా తెలుసు,” అనడిగాడు.
వందన : నేను ఒక నవల చదివాను….అందులో ఒక క్రిమినల్ ఇలాగే చెస్తాడు….
ప్రసాద్ : ఏవోవో చదివి…మమ్మల్ని ఎందుకిలా కన్ఫ్యూజ్ చేస్తావు….
వందన : ఈ హత్య చేసిన వాడు ఖచ్చితంగా కెమికల్స్ గురించి, ఫార్మసీ గురించి బాగా తెలిసిన వాడు అయి ఉండాలి సార్….
రాము అవునన్నట్టు తల ఊపుతూ వేలాడుతున్న డెడ్‌బాడి దగ్గర నిలబడి….
రాము : ఆ డెడ్‌బాడీ మొహానికి ఉన్న దున్నపోతు మాస్క్ తీసేయండి….
ఒక కానిస్టేబుల్ పైకి ఎక్కి డెడ్బాడికి ఉన్న మాస్క్ తీసేయడంతో చనిపోయింది సామాజికవేత్త శివానంద్‌గా గుర్తు పట్టారు.
దాంతో అక్కడ క్లూస్ టీం నుండి రాము వాళ్ళు వివరాలు తెలుసుకుని బయటకు వచ్చి అక్కడ మట్టిలో ఉన్న కారు టైర్ల ప్రింట్లు తీసుకోమని అక్కడ క్లూస్ టీం వాళ్ళకు చెప్పారు.
తరువాత శివానంద్ బాడీని ఫోరెన్సిక్ లాబ్‌కి తీసుకెళ్ళి టెస్ట్‌లు చేయడం మొదలుపెట్టారు.
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తరువాత రాము వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ అప్పుడే శివారెడ్డి బాడీకి పోస్ట్‌మార్టం చేసి ఒక ఐడియాకి వచ్చాడు.
అంతలో రాము వాళ్ళు రావడంతో వాళ్ళకు విష్ చేసి కేసు వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు.
డాక్టర్ : హాయ్ రాము…
రాము : హాయ్ డాక్టర్….హత్య ఎలా జరిగింది…ఎన్నింటికి జరిగిందో తెలిసిందా….
డాక్టర్ : ఇప్పుడే రిపోర్ట్ లు పూర్తి చేసాను….ఈ శివానంద్ హత్య విషయంలో….ముందుగా శివానంద్‌కి మత్తుమందు ఇచ్చారు….ఆ మత్తు మందు దాదాపు గంట సేపు వరకు పనిచేస్తుంది…కాని ఆయన సృహ కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్ధం కావడం లేదు.....
రాము : అంటే….
డాక్టర్ : ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకు…ఈయనకు ఇచ్చిన మత్తుమందు ఒక గంటే పనిచేస్తుందనుకుంటాను…ఈ బాడీ మీద ఉన్న గాయాలు చూడండి…ఇతన్ని చంపడానికి ముందు బాగా టార్చర్ పెట్టారు…ఈయన చనిపోయింది….రాత్రి దాదాపు రెండు గంటలకు చంపారు…
రాము : అలా అయితే మీరు చెప్పిన దాని ప్రకారం రాత్రి హంతకుడు ఈయనతో ఏదైనా మాట్లాడటానికి ట్రై చేసి ఉంటాడు…
డాక్టర్ : అయి ఉండొచ్చు….దానికి కూడా అవకాశాలు ఉన్నాయి…..
రాము : చనిపోవడానికి కారణం ఏంటి…అంటే కత్తితో పొడిచాడా….ఎలా….
డాక్టర్ : ఉరితీయడం వలన చనిపోయాడు…గొంతు కింద ఉండే ట్రాకియా అనే లంగ్స్ కి కనెక్ట్ అయ్యే వింగ్ పైప్ నలిగిపోయింది…మెడ కండరాలు రప్చర్ అయ్యాయి…గొంతులో ఉండే మెడ ఎముకలు విరిగిపోయాయి…ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు….
రాము : అప్పుడు ఈ షూట్ చేసినట్టు ఈ బుల్లెట్ గుర్తులు ఏంటి….
డాక్టర్ : షూట్ చేసాడు….కాని శివానంద్ చనిపోయిన తరువాత….నాలుగు సార్లు కాల్చాడు…బుల్లెట్లు అన్నీ ఒకే ఏరియాలో దిగిపోయాయి…(అంటూ శివానంద్ ఛాతీ మిద బుల్లెట్లు దిగిన గుర్తులు చూపిస్తూ) గన్ పౌడర్ డిపాజిట్ బట్టి చూస్తే చాలా దగ్గరగా షూట్ చేసాడనిపిస్తున్నది…..0.9mm క్యాలిబర్ బుల్లెట్లు…
రాము : చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది….
డాక్టర్ : సుమారు ఉదయం రెండు…రెండున్నర మధ్యలో చనిపోయి ఉంటాడు…
రాము : టార్చర్ చేసి….ఉరి తీసి…తుపాకీతో షూట్ చేసి…ఇంతలా….
డాక్టర్ : చంపిన ఫార్మాట్ చూస్తుంటే హంతకుడిలో చాలా కోపం కనిపిస్తుంది రామూ గారు….శివానంద్ వల్ల బాగా దెబ్బ తిన్న వాడు అయిఉండాలి…
రాము ఆలోచిస్తూ అక్కడ నుండి తన ఆఫీస్‌కి వచ్చాడు.
రాము కేబిన్‌లో ముగ్గురూ కూర్చుని కేసు తాలుకు ఫైల్ చూస్తుంటారు.
రాము : క్రైమ్ సీన్లో ఏమైనా క్లూస్ దొరికాయా…
ప్రసాద్ : లేదు సార్…ఫింగర్ ప్రింట్లు, సిగిరెట్ పీకలు, DNA ఏమీ దొరకలేదు….
రాము : చాలా క్రిటికల్‌గా ఉన్నది….చివరగా మనం చూసిన టైర్ ప్రింట్ మాత్రమే….
వందన : ఆ టైర్ ప్రింట్ ఒక మహేంద్రా స్కార్పియో….లేదా టాటా సుమో లాంటి బండి….టైర్ ప్రింట్ కూడా అనాలసిస్ కోసం పంపించాను….
ప్రసాద్ : శివానంద్ చివరగా జీప్ లాంటి పెద్ద వెహికల్లో చూసామని అక్కడ కొంతమంది ఐవిట్నెస్లు చెబుతున్నారు… ఇప్పుడు వందన చెప్పినట్టు మహేంద్ర స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు….
వందన : మహేంద్ర స్కార్పియో….ఊళ్ళో చాలా ఉంటాయి….ఎలా కనిపెట్టాలి….
ప్రసాద్ : మరి లేకపోతే హంతకుడు వచ్చి నాదే ఆ స్కార్పియో అంటాడా ఏంటి….మనమే కనిపెట్టాలి….
రాము : మర్డర్‌కి రీజన్ ఏమయి ఉంటుంది…
వందన : సార్….మీకు తెలిసిందే కదా….శివానంద్‌కి ఈ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళతో తగాదాలు ఉన్నాయి…వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు….వీళ్ళల్లో ఎవరో ఒకరు చంపి ఉండొచ్చు….
ప్రసాద్ : ఇంతవరకు 345 rta పిటిషన్స్….అందులో చాలా వరకు కేసుల్లో దోషులకు శిక్ష కూడా పడింది సార్….
రాము : అయితే కన్విక్ట్ అయిన కేసులను షార్ట్ లిస్ట్ చేయండి…
ప్రసాద్ : అలాగే సార్….