Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
ప్రసాద్ : వాడు అడిగిన దానికి చాలా కొపం వచ్చింది…వెంటనే గన్ తీసి ముందు వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలని అనుకున్నా…కాని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ…ఈ ఆరోపణ నిరాధారం…నేను దీన్ని ఖండిస్తున్నాను…అని కూల్ గా స్టేట్ మెంట్ ఇచ్చి వచ్చాను….

రాము : పర్లేదు ప్రసాద్….చాలా మెచ్యూర్ అయ్యావు….ఇలాగే ఉంటే నువ్వు తొందరగా DSP అయిపోతావు…(అంటూ వందన వైపు చూసి చిన్నగా నవ్వాడు.)
రాము వెటకారంగా అన్నది అర్ధం చేసుకోకుండా తనను పొగిడాడనుకుని ప్రసాద్ ఆనందంగా, “చాలా థాంక్స్ సార్…మీ సబార్డ్‍నేట్‍గా ఉన్న దగ్గర నుండి నాకు చాలా హ్యాపీగా ఉన్నది,” అంటూ నవ్వాడు.
ప్రసాద్ మాటలకు రాము చిన్నగా నవ్వుతూ వందన వైపు చూసి, “ఆయనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా,” అనడిగాడు.
“భార్య లేదు….కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు….అమ్మ, నాన్న వాళ్ళ ఊర్లో ఉంటారు….ఫ్రండ్స్ అంటూ ఎవరూ లేరు… స్లమ్ ఏరియాలో ఇల్లు….ఊరంతా శత్రువులు,” అన్నది వందన.
వందన అలా అనగానే రాము చిన్నగా తలాడిస్తూ, “సరె….ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ద్వారా సిగ్నల్ ఎక్కడ ఉన్నదో కనుక్కున్నారా,” అనడిగాడు.
అంతలో రాము టేబుల్ మీద ఫోన్ మోగేసరికి వందన ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో….” అంటూ ఫోన్‍లో చెప్పేది వింటూ రాము, ప్రసాద్ వైపు చూస్తుంది.
దాంతో వందన ఫోన్‍లో ఏం వింటుందా అని ఆలోచిస్తూ ఆమె వైపు చూస్తున్నారు.
వందన ఫోన్ రిసీవర్ పెట్టేస్తూ రాము వైపు చూసి, “సార్….కాప్రా కార్ గోడౌన్‍లో దగ్గర డెడ్ బాడి ఒకటి దొరికిందంట,” అన్నది.
ఆ మాట వినగానే రాము వాళ్ళిద్దరి వైపు చూసి, “పదండి వెళ్దాం….” అంటూ అక్కడ నుండి బయలుదేరారు.
స్టేషన్ నుండి బయటకు రాగానే ప్రసాద్ కార్ స్టార్ట్ చేయగానే రాము, వందన కారు ఎక్కి కూర్చున్నారు.
ముగ్గురూ కాప్రా కార్ గోడౌన్ దగ్గరకు వెళ్ళారు.
అప్పటికే అక్కడ చాలా మంది జనం ఉన్నారు.
జర్నలిస్ట్‍లు అక్కడ ఉన్న SIతో మర్డర్ ఎలా జరిగింది అని వివరాలు అడుగుతున్నారు.
రాము వాళ్ళు కారు దిగగానే అక్కడ ఉన్న SI పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేసాడు.
రాము : స్పాట్‍లోకి జర్నలిస్ట్‍లను ఎవరు రమ్మన్నారు…
SI : నేను రమ్మనలేదు సార్….వాళ్ళకు తెలిసి…వాళ్ళే వచ్చారు…
ప్రసాద్, వందన కూడా కారు దిగి రాము వెనకాలే నడుస్తున్నారు.
రాము : మనకన్నా ముందుగా వాళ్ళకే తెలుస్తున్నాయి….ఇంతకు విషయం ఏంటి….
SI : సీజ్ చేసి పాత కారు గోడౌన్ సార్…
రాము : సరె….పద స్పాట్‍లోకి వెళ్దాం….
అంటూ నలుగురూ లోపల కార్ గోడౌన్ లోకి వెళ్ళారు.
అప్పటికే లోపల ఫోరెన్సిక్ డిపార్ట్‍మెంట్, ఫింగర్ ప్రింట్ experts వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
రాము వస్తూనే అక్కడ పరిసరాలు మొత్తం అబ్సర్వ్ చేస్తూ లోపలికి వచ్చాడు.
లోపల గోడౌన్ మధ్యలో స్లాబ్‍కి ఒక రాడ్‍కి తాడు కట్టి డెడ్ బాడిని వేలాడదీసి ఉన్నది.
ఆ డెడ్ బాడీ తలకు దున్నపోతు తలకాయ లాంటిది తగిలించి ఉన్నది.
వాళ్ళ ముగ్గురూ డెడ్ బాడి వైపు చూస్తున్నారు.
ప్రసాద్ : బాడీ మొత్తం గాయాలు….బుల్లెట్లతో కాల్చి చంపేసినట్టు బాడీ మీద బుల్లెట్ల గుర్తులు…హారిబుల్‍గా ఉన్నది సార్….ఇది ఒక్కడి పనేనా….లేక గ్రూప్‍గా చేసి ఉంటారా….
రాము : (తల అడ్డంగా ఊపుతూ) లేదు….ప్రసాద్….ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్నీ ఒక్కళ్ళే చేస్తారు…
వందన : కాని బాడీకి డాక్టర్ డ్రస్ వేసాడేంటి….
ఫోరెన్సిక్ ఆఫీసర్ : సార్….అలా చూడండి…(అంటూ రాముని పిలిచాడు.)
రాము అతని దగ్గరకు వెళ్ళి ఏంటి అన్నట్టు చూసాడు.
ఫోరెన్సిక్ ఆఫీసర్ పైన వేలాడుతున్న డెడ్‍బాడీ వెనకాల ఒక నెంబర్ “4864” అని రాసి ఉన్నది రాముకి చూపించాడు.
రాము : కోట్‍కి బుల్లెట్ హోల్స్ లేవు….కాని బాడీ మీద గన్‍షాట్లు ఉన్నాయి...షూట్ చేసిన తరువాత డాక్టర్ కోట్ వేసినట్టు ఉన్నాడు….
ఫోరెన్సిక్ ఆఫీసర్ : కరెక్ట్ గా చెప్పారు సార్….(అని తన పని చేసుకుంటున్నాడు.)
రాము అక్కడ గోడౌన్‍లో పాతవి, చెడిపోయిన కార్లు చూస్తూ….డెడ్‍బాడీ వేలాడదీసిన చోట రక్తం మరకలు అన్నీ చూస్తున్నాడు.
ప్రసాద్ ఏదో ఆలోచిస్తూ రాము వైపు చూసి, “సార్….మీకు ఒక పార్సిల్‍లో బొమ్మ వచ్చింది…గుర్తుందా మీకు,” అన్నాడు.
రాము కూడా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గుర్తు చేసుకుంటూ, “ఎర్రచొక్కా వేసుకున్న బొమ్మ కదా,” అన్నాడు.
అంతలో వందన, “ఎర్రచొక్కా కాదు సార్….రక్తంతో తడిచిన వైట్ షర్ట్,” అంటూ అక్కడ ఒకతను ఇచ్చిన కేసు ఫైల్ చూస్తున్నది.
ప్రసాద్ వెనక్కి తిరిగి వందన వైపు చూస్తూ, “రక్తమా….” అనడిగాడు.
“ఫోరెన్సిక్ ల్యాబ్‍లో చెక్ చేయించాను సార్….అది మనిషి రక్తం కాదు…మేక రక్తం,” అంటూ వందన మళ్ళీ కేస్ ఫైల్ చూడటంలో మునిగిపోయింది.
రాము ఆమెను మెచ్చుకుంటున్నట్టు చూస్తూ, “గుడ్ జాబ్,” అన్నాడు.
ప్రసాద్ మెల్లగా వందన దగ్గరకు వచ్చి, “సందు దొరికితే….సార్ దగ్గర నీ పాండిత్యం ప్రదర్శించేస్తున్నావే,” అన్నాడు.
వందన ఫైల్‍లో నుండి తల ఎత్తి ప్రసాద్ వైపు చూసి, “ఏయ్…పోరా…అది ట్రైసోడి మెసిటేట్ కలిపిన మేక రక్తం,” అంటూ నవ్వింది.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 11-12-2022, 08:53 PM



Users browsing this thread: 3 Guest(s)