Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము మాటలు వినగానే వాళ్ళకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు…మనసులో మాత్రం రాము చెప్పింది నిజమే అనిపించింది.

కాని పైకి మాత్రం ఆఫీసర్ గాంభిర్యాన్ని ప్రదర్శిస్తూ, “ఈ సారికి మిమ్మల్ని వదిలేస్తున్నాం రాము గారు…..ఇక నుండైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మానేయండి….,” అన్నాడు.
వాళ్ళు చెప్పింది విన్న తరువాత రాము తనలో తాను నవ్వుకుంటూ అక్కడ నుండి వచ్చేసాడు.
ప్రసాద్, వందన కూడా వాళ్ళ వైపు చూసి నవ్వుతూ విష్ చేసి రాము వెనకాలే అతని క్యాబిన్ కి వచ్చేసారు.
క్రైం బ్రాంచ్ పోలిస్ స్టేషన్ లో అంతా హడావిడిగా ఉన్నది.
అక్కడ ఒక చోట కానిస్టేబుల్ ఆ రోజు వచ్చిన వాళ్ళ దగ్గర నుండి కంప్లైంట్లు తీసుకుంటున్నాడు.
అక్కడకు వచ్చిన యస్సై వాళ్లతో, “కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి….ఇక్కడ ఉండకూడదు,” అంటూ అక్కడ ఒక చైర్ లో ఉన్న బ్యాగ్ చూసి దాని పక్కనే కూర్చున్న అతనితో, “ఆ బ్యాగ్ నీదేనా,” అనడిగాడు.
దానికి అతను, “నాది కాదు సార్….నేను రాక ముందు నుండీ ఇక్కడే ఉన్నది,” అన్నాడు.
దాంతో ఆ యస్సై అక్కడ ఉన్న అందరిని అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళెవరూ నాది కాదు అని చెప్పారు.
యస్సై : ఈ బ్యాగ్ ఎవరు తీసుకొచ్చారో చూసావా…..(అని కానిస్టేబుల్ ని అడిగాడు.)
కానిస్టేబుల్ : చూడలేదు సార్….
దాంతో యస్సై ఆ బ్యాగ్ దగ్గరకు వెళ్ళి ఓపెన్ చేసి చూసాడు….అందులో ఒక పార్సిల్ ఉండటం చూసి దాని మీద, “Ram Prasad, IPS….Deputy Commissioner of security officer,” అని ఉండటం చూసి ఆ బ్యాగ్ ని చెక్ చేసిన తరువాత ఏం ప్రమాదం లేదని నిర్ధారించుకుని పక్కనే ఉన్న కానిస్టేబుల్ ని పిలిచి రాము సార్ కి ఇవ్వమని పంపించాడు.
**********
పార్సిల్ వచ్చిన తరువాత ప్రసాద్ దాన్ని తీసుకుని రాము కేబిన్ లోకి వెళ్ళి సెల్యూట్ చేసి, “సార్….మీకు పార్సిల్ వచ్చింది….కాని దీని మీద ఫ్రమ్ అడ్రస్ లేదు…సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వదిలేసి వెళ్ళాడు,” అంటూ తన చేతిలో ఉన్న పార్సిల్ తీసుకుని టేబుల్ మీద పెట్టాడు.
రాము పార్సిల్ వైపు చూస్తూ, “ఎవరు ఇచ్చారో స్టేషన్ లో కెమేరాలు ఉన్నాయి కదా….చెక్ చేయలేదా,” అనడిగాడు.
వందన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ పక్కన పెట్టి…లోపల ఒక చిన్న బొమ్మకి మేక తల బొమ్మది తగిలించి ఉండటం చూసి దాని మెడకు ఉన్న తాడు పట్టుకుని బయటకు తీసి దాని వైపు పరీక్షగా చూస్తూ, “ఈ బ్యాగ్ పెట్టిన స్టేషన్ లో కెమేరాలు పని చేయడం లేదు సార్…” అంటూ తన చేతిలో ఉన్న బొమ్మని రాము చేతికి ఇచ్చింది.
రాము ఆ బొమ్మని తీసుకుని చూస్తూ, “మేక తల తగిలించిన ఎర్ర చొక్కా ఉన్న బొమ్మ….ఏంటిది…” అంటూ ఆలోచిస్తున్నాడు.
ప్రసాద్ : ఆ బొమ్మ మీద షర్ట్ తీసి చూస్తే…ఛాతీ మీద ఏదో మేకులతో గుచ్చినట్టు నాలుగు హోల్స్ ఉన్నాయి…
వందన : ఆ బొమ్మ వీపు మీద కూడా ఫోర్ డిజిట్ నెంబర్ ఉన్నది సార్…ఆ కోడ్ ఏంటో తెలియడం లేదు….
ప్రసాద్ : ఆ బొమ్మ వీపు మీద ఉన్న నెంబర్ 4840 తో ఎండ్ అయ్యే కొన్ని నెంబర్లు ట్రై చేసాను….
రాము : మరి ఏదైనా క్లూ దొరికిందా….
ప్రసాద్ : ఏం దొరకలేదు…కాని వాటిల్లో ఒక మసాజ్ పార్లర్ నెంబర్ దొరికింది…మనకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని సేవ్ చేసి పెట్టుకున్నాను….(అంటూ నవ్వుతూ వందన వైపు చూసాడు.)
అప్పటికే వందన అతని వైపు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్టు చూస్తున్నది.
కాని రాము మాత్రం ప్రసాద్ మాటలను పట్టించుకోకుండా ఆ బొమ్మని పరీక్షగా చూస్తూ….
రాము : కాని….ఈ బొమ్మని ఎందుకు ఉరి తీసాడు…మనకు ఏదైనా మెసేజ్ ఇస్తున్నాడా….
ప్రసాద్ : ఆ బ్యాగ్ మొత్తం చెక్ చేసాను సార్….అటువంటి threatening message లాంటిది ఏమీ లేదు….
వందన : లేకపోతే ఎవరినైనా హత్య చేస్తాడని మెసేజ్ ఏమైనా పంపించి ఉండొచ్చా…..(అంటూ రాము చేతిలో నుండి బొమ్మను తీసుకుని చెక్ చేస్తున్నది.)
ప్రసాద్ : ఎవరిని చంపడానికి….
వందన : ఎవరినో బాగా డబ్బున్న వ్యక్తిని కావొచ్చు….(అంటూ రాము వైపు చూస్తూ) మనకు క్లూస్ ఇచ్చి తన పని చేసుకుపోతున్నాడేమో అనిపిస్తున్నది…
ప్రసాద్ : ఎవరో పనీ పాట లేని వాడు జోక్ చేస్తున్నాడు సార్….ఎవడైనా బొమ్మతో ఇలాంటి మెసేజ్ లు ఏమైనా ఇస్తారా….(అంటూ వందన మాటలను తేలిగ్గా కొట్టిపారేసి….గుమ్మం వైపు చూస్తూ…) ప్రస్తుతానికి దీన్ని ఎక్కడైనా తగిలించి పెడదాం….ఈ బొమ్మ చూస్తుంటే అదో టైప్ లో వెరైటీగా దిష్టి బొమ్మలా కనిపిస్తున్నది…
రాము : మన ఆఫీస్ కి దిష్టి బొమ్మ అవసరం ఉన్నదా….(అంటూ ప్రసాద్ వైపు నువ్వు ఉన్నావుగా అన్నట్టు నవ్వుతూ చూసాడు.)
కాని ప్రసాద్ కి రాము తననే అంటున్నాడని అర్ధం కాక అతను వందన వైపు చుస్తూ….
ప్రసాద్ : మీరు చెప్పింది నిజమే సార్….ఒకటి సరిపోతుంది…ఇంక ఇది ఎందుకు…..
దానికి వందన కోపంగా ప్రసాద్ వైపు చూస్తూ అతని చేతిలో బొమ్మని లాక్కుంటూ…
వందన : ఇక చాల్లే….నోరు మూసుకో….
రాము : (వందన వైపు చూస్తూ) నేను నిన్ను అనలేదు….(అంటూ ప్రసాద్ చూపించి అతన్ని అన్నానన్నట్టు సైగ చేస్తూ వందన వైపు చూసి నవ్వాడు.)
కాని ప్రసాద్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా వందన మీద జోక్ చేసినట్టు నవ్వుతున్నాడు.
తరువాత కొద్దిసేపు వాళ్ళు ముగ్గురూ చూడాల్సిన కేస్ ఫైల్స్ చూసి సాయంత్రానికి ఇళ్లకు వెళ్ళిపోయారు.
మధ్యాహ్నానికల్లా వాళ్ళు ముగ్గురూ ఆ బొమ్మ గురించి పూర్తిగా మర్చిపోయారు.
కాని తరువాత వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న బొమ్మలో పెద్ద క్లూ దాగుందని తెలుసుకోలేకపోతున్నారు.
********
సాయంత్రం ప్రసాద్ ఇంటికి వచ్చాడు.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-11-2022, 02:00 PM



Users browsing this thread: 4 Guest(s)