Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
వందన : ఇప్పుడు అతనితో ప్రాబ్లమ్ ఏంటి…శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాడు కదా….

రాము : గొడవలేం లేవు….కాకపోతే ఇతను చేసే ధర్నాల వలన ప్రభుత్వానికి తలనొప్పి వస్తుంది….ఏదో ఒకటి చేయమని మన మీద ఒత్తిడి తెస్తున్నారు…..
వందన : ఏ గొడవ చేయకుండా ధర్నా చేస్తున్నప్పుడు మనం ఎలా ఆపుతాము….ఏదైనా క్రైం జరిగితే మన పని మనం చేస్తాం……
రాము : అవన్నీ మనకెందుకు….(అంటూ ప్రసాద్ వైపు చూస్తూ) ప్రసాద్…ఇద్దరు కానిస్టేబుల్స్ ని శివానంద్ ని వాచ్ చేయమను….ఏమైనా గొడవ జరిగేటట్టుంటే….అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు…..
ప్రసాద్ అలాగే అన్నట్టు తల ఊపాడు.
*******
వీళ్ళు ఇక్కడ శివానంద్ గురించి మాట్లాడుకుంటుంటే….
ఊరి చివర ఒక పాత కాలం నాటి గ్యారేజీలో ఒకతను టీవి చూస్తూ తన ముందు ఉన్న చిన్న బొమ్మ మీద అక్కడ గ్లాసులో ఉన్న ఎర్రటి ద్రవాన్ని ఒక టూత్ పిక్ లాంటిది తీసుకుని పూస్తున్నాడు.
అతని ఎదురుగా ఉన్న టీవి లో న్యూస్ వస్తున్నది.
టీవి న్యూస్ : నగరంలో పట్టపగలు ఇవ్వాళ నలుగురు కరడు కట్టిన నేరస్తులను ముంబై క్రైం బ్రాంచ్ కి చెందిన సెక్యూరిటీ ఆఫీసర్లు ఎన్ కౌంటర్ చేసారు….ఈ ఘటన జరుగుతున్నప్పుడు నేరస్తులు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఆ ప్రదేశంలో జరిగిన పెనుగులాటలో ప్రజలు కొద్దిసేపు భయభ్రాంతులు అయ్యారు…రాంలాల్ సేఠ్ హత్య కేసులొ అప్రూవర్ గా మారిన శంకర్ ని హత్య చేయడానికి నలుగురు నేరస్తులు ప్రయత్నించారని క్రైం బ్రాంచ్ అధికారులు తెలియచేస్తున్నారు…
ఆ న్యూస్ విన్న తరువాత అతను తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు.
బొమ్మ మీద ఎర్రటి ద్రవం పూయడం పూర్తి అయిన తరువాత అతను టీవి ఆఫ్ చేసి పక్కనె ఉన్న చిన్న బాక్స్ తీసుకుని వాటిలో కొన్ని వస్తువులు పెట్టిన తరువాత ఇందాక తాను చేసిన బొమ్మను కూడా పెట్టేసి ప్యాకింగ్ చేసి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న కొరియర్ లో ఇచ్చాడు….
********
తరువాత రోజు రాము చేసిన ఎన్ కౌంటర్ మీద Human Rights వాళ్ళు కంప్లైంట్ చేసారు.
ఆ మీటింగ్ లో రాముతో పాటు ప్రసాద్, వందన కూడా పాల్గొన్నారు.
హ్యూమన రైట్ అధికారులు రాము వాళ్ళ టీం చేసిన ఎన్ కౌంటర్ గురించి చాలా కోపంగా ఉన్నారు.
ఆఫీసర్ : రాము గారు….మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా…..
రాము : నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు సార్…..మీరే అనవసరం అయిన విషయాలు పట్టుకుని వేలాడుతున్నారు…..
ఆఫీసర్ : మర్యాదగా మాట్లాడండి….మేము కనుక మీ మీద వ్యతిరేకంగా రిపోర్ట్ రాసామంటే….మీ ఉద్యోగం పోతుంది…
ఆ మాట వినగానే ప్రసాద్, వందన ఒక్కసారిగా నవ్వుకున్నారు.
వందన : (చిన్నగా ప్రసాద్ కి మాత్రమే వినబడేలా) వీళ్ళకు రాము సార్ గురించి తెలియదట్టున్నది….ఆయనకు ఉన్న ఆస్తులు గురించి తెలిస్తే ఇలా మాట్లాడరు….ఆయన ఈ ఉద్యోగం మీదే బ్రతుకుతున్నారనుకుంటున్నారు…..
వీళ్ళీద్దరూ నవ్వుకోవడం చూసి హ్యూమన్ రైట్ ఆఫీసర్ కోపంతో…..
ఆఫీసర్ : ఏంటి….మేము ఇంత సీరియస్ గా ఉంటే….మీకు నవ్వొస్తున్నది….మీమీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది….జాగ్రత్త……
రాము : వాళ్ళ గురించి వదిలేయండి సార్…టీం లీడ్ చేసింది నేను…వాళ్ళిద్దరూ నేను చెప్పినట్టు చేసారు…మధ్యలో వాళ్ళను లాగుతారెందుకు…మీరే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు…..
ఆఫీసర్ : మీరు నాలుగు ప్రాణాలు తీసి….వాటి గురించి మాట్లాడటం టైం వేస్ట్ అనిపిస్తున్నదా…..
రాము : వాళ్లను ఎన్ కౌంటర్ చేసినందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు….మరి వాళ్ళ చేతుల్లో చనిపోయిన వాళ్ళకు ఏ విలువ లేదా…..
ఆఫీసర్ : అందుకని వాళ్ళను చంపేస్తారా…..అందుకు చట్టం….కోర్టులు ఉన్నాయి కదా…..
రాము : అవన్నీ ఎపుడు న్యాయం చేస్తాయి….ఇప్పటికే కేసులు చాలా పెండింగ్ లో ఉన్నాయి….జనాలకు పనలు మానుకుని కోర్టుల చుట్టూ తిరిగేంత ఓపికలు ఉండవు సార్……
ఆఫీసర్ : అందుకని వాళ్ళను చంపేస్తారా…..వాళ్ళవు మాత్రం ప్రాణాలు కావా…..
అలా పావుగంట సేపు డిస్కషన్ జరిగిన తరువాత వాళ్ళు రాముని సస్పెండ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.
ఆఫీసర్ : మేము మిమ్మల్ని సస్పెండ్ చేయమని డిపార్ట్ మెంట్ కి రికమండ్ చేస్తాం…..
రాము : సరె….మీ పని మీరు చేయండి….ఒక్క విషయం మీ నలుగురు హ్యూమన్ రైట్ ఆఫీసర్స్ ని అడగమంటారా….
ఆఫీసర్ : అడగండి….
రాము : ఆన్సర్ మాత్రం మీ మనస్సాక్షికి తగ్గట్టు….నిజాయితీగా ఉండాలి…అది చెప్పిన తరువాత నా మీద రిపోర్ట్ చేయండి…..
ఆఫీసర్ : సరె….అడగండి…..
రాము : మీరందరూ మీ ఇళ్ళల్లో ఉన్నప్పుడు మీ ఇంటి ముందు ఒక వ్యక్తి గన్ పట్టుకుని నిల్చున్నాడు….ఆ వ్యక్తి ఎవరైతే బాగుంటుందని మీకు అనిపిస్తుంది……
ఆఫీసర్ : మీరు ఏమడగదలుచుకున్నారో మాకు అర్ధం కాలేదు…..
రాము : అదే ఆ గన్ పట్టుకున్న వ్యక్తి…మేము ఎన్ కౌంటర్ చేసిన నలుగురిలో ఒకరు ఉంటే బాగుండు అనిపిస్తుందా…. లేక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ ప్రసాద్ ఉంటే బాగుండనిపిస్తుందా……
రాము అలా అనగానే వాళ్ళు నలుగురూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
రాము : అదే మీరు మాలాంటి వాళ్ళను సస్పెండ్ చేసుకుంటూ పోతే….తరువాత రౌడీలు మాత్రమే మీ ఇంటి ముందు ఉంటారు…వాళ్ళు మీరు హ్యూమన్ రైట్ వాళ్ళా…లేదా అని చూడరు…వాళ్ళకు ఎదుటి మనిషిని చంపడమే వాళ్ళ పని….అది ఆలోచించుకుని మీరు రిపోర్ట్ చేయండి……
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-11-2022, 01:58 PM



Users browsing this thread: sree2022, 3 Guest(s)