06-11-2022, 06:25 PM
“ఏంలేదత్తయ్యా… నాకు వరకట్నం కింద ‘ నీ అభిరుచిని’ ధారపోయాలి. అంటే జీవితంలో ఇంకెప్పుడూ నువ్వు వంటల్లో ప్రయోగాలు చేయకూడదు’’ అత్త గురించి ఇంట్లో అందరూ చెప్పిన మీదట, తెలివిగా వ్యవహరించి ఆమెచేత ఆపని మానిపించగలననే అనుకున్నాడు కమల్. కాని, శ్యామల ససేమిరా అంది.
“ఒరేయ్… నీకు మహిమ నచ్చో…లేకపోతే ఈ అత్తమీద అభిమానం ఉండడంచేతనో ఈపెళ్లి చేసుకుంటే చేసుకో ... అంతేగాని, నా హాబీకి, నీపెళ్లికి లింకెట్టకు… నేను ఎవరికోసమూ నా హబీకి నీళ్లొదిలేది లేదు.’’’ ఖచ్చితంగా చెప్పేసింది శ్యామల.
కథ అడ్డం తిరగడంతో హతాశుడైన కమల్, ఏ ఆర్భాటమూ లేకుండా మహిమను గుళ్ళో పెళ్లి చేసుకుని అమెరికా పారిపోయాడు. కొన్నాళ్ళకి మనోజ్ కి ఖరగ్ పూర్ ఐఐటిలో సీటు రావడంతో అతను కూడా జంపైపోయాడు.
కనీసం పిల్లలైనా ఈ చిత్రహింస నుంచి తప్పించుకున్నారని ఆనందపడ్డాడు సౌమిత్రి. ఇప్పుడు అతనొక్కడే శ్యామల కి ఎరగా మారిపోయాడు. దానితో శ్యామల మరీ చెలరేగిపోయింది. ప్రాణనాధుని ప్రాణాలతో చెడుగుడాడేయడం మొదలెట్టింది. ఇలా సాగిపోతూ ఉండగా…
సౌమిత్రి రిటైరైపోయాక చుట్టాలందరూ కలిసి మొత్తం దేశాన్ని చుట్టిరావాలని సంకల్పించారు. అరవైలో పడ్డాక ఇక ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి అన్న అభిప్రాయానికొచ్చిన సౌమిత్రి సతీసమేతంగా వాళ్లతో వెళ్లడానికి సిధ్ధపడ్డాడు. వెళ్లేముందే శ్యామలని ఘాటుగా హెచ్చరించాడు.
“నువ్వక్కడ వంటలతో ప్రయోగాలు చేసి అందరి ప్రాణాలతోనూ ఆడుకుని నాపరువు తీయద్దు. బుధ్ధిగా వంటవాడు వండిపెట్టినదేదో తిని హాయిగా ఉండు…’’ అంటూ హితోపదేశం చేశాడు.
అలాగేనని తల తాటిటెంకలా ఊపినా యాత్రాసమయంలో పోకలు పోయబడి పచ్చగా కనువిందు చేస్తున్న కాయగూరలను, పెద్దమోతాదులో రాశులు పోసిన వంటదినుసులని కళ్లారాగాంచి ఉద్రేకంతో ఊగిపోయిన శ్యామల తన వెనుకటి గుణాన్ని వెలికితీసింది.
మొత్తం యాత్రాబృందంలో అందరినీ తన వంటలపిచ్చితో హడలెత్తించింది. సౌమిత్రికి మాత్రం ‘ ఆదివారం’ అన్న సడలింపు ఉందిగాని, మిగతావాళ్లకి లేదుగా. సౌమిత్రి ఎంత వారిస్తున్నా వినక వాళ్ళందరినీ దినదినమూ తన ప్రయోగాలతో హడలెత్తించింది. తమ బృందంతో తీసుకెళ్లిన వంటవాళ్ళని పక్కకినెట్టి తనే నడుం బిగించి, విల్లంబులు చేతబట్టి సమరరంగాన దూకిన సత్యభామలా…కుడిఫీ(వంటవాళ్ళు వాడే పెద్దసైజు అట్లకాడ) అందుకొని అందరి కడుపులనీ కుదిపేసింది. ఆమె చేసిపెట్టే సరికొత్త వంటకాలు తినలేక అందరికీ వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. దేశమంతా చుట్టిరావాలన్న సంకల్పంతో బయలుదేరిన కొందరు శ్యామల ధాటికి తట్టుకోలేక యాత్రను అర్ధాంతరంగా వదిలేసి ఇళ్లకి నిష్క్రమించారు.
“ఒరేయ్ అబ్బాయ్! ఎలా వేగుతున్నావురా దీనితో… నాకే గనుక ఇలాంటిపెళ్ళాం దొరికితే ఏనాడో విడాకులిచ్చి పారేద్దును…’’ మామయ్య వరసయ్యే ఓ పెద్దాయన గోడుగోడున విలపించాడు .
ఆయన మాటలతో సౌమిత్రి మెరుపులాంటి ఆలోచన ఒకటొచ్చింది. ఇన్నిరోజులుగా శ్యామల ఆవేశాన్ని తగ్గించడానికి ఎన్నో పధకాలు రచించాడు. కాని, ఏఒక్కటీ ఫలించలేదు.విరక్తితో జీవితాన్నీడుస్తున్న అతడికి కనీసం ఈ ప్లానైనా వర్కౌట్ అవుతుందేమోనన్న చిన్ని ఆశ అతడికి బతుకుమీద తీపి కలిగేలా చేసింది.
యాత్రాబృందమంతా కాశీ చేరింది.అందరూ గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆకాశీవిశ్వేశ్వరుని దర్శించునే సంరభంలో తలమునకలై ఉన్నారు.
భార్యాసహితంగా గంగలో మునిగిన సౌమిత్రి మూడు మునకలు వేసి పైకి లేచాక “చూడు శ్యామూ… కాశీకొచ్చి, ఇలా గంగానదిలో స్నానం చేసిన తరువాత మనకిష్టమైన వాటిని గంగలో వదిలేయాలట…నీవు నాకోసం నీకిష్టమైన దానిని వదిలేయాలి మరి!’’ అన్నాడు సౌమ్యంగా.
“నాకిష్టమైనదా?’’ అనుమానంగా చూసింది శ్యామల.
“అవును…కొత్తకొత్త పదార్ధాలను తయారుచేసి వంటల్లో ప్రయోగాలు చేయడమంటే నీకిష్టం కదా! అందుకే… ఆహాబీని నువ్వు ఇక్కడ విడిచిపెట్టాలి.’’ అన్నాడు నెమ్మదిగా.
“ఇంపాజిబుల్… అయినా ఇష్టమైనదాన్ని విడిచిపెట్టడమంటే…మనకిష్టమైన కూరనో, లేకపోతే మనలో ఉన్న అరిషడ్వర్గాలనో కాని, ఇలాంటి అభిరుచులని కాదు. అయినా సాక్షాత్తూ ‘కాశీ అన్నపూర్ణే’ కొలువైఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ‘అన్నపూర్ణ’లా వండివార్చే నా అభిరుచిని వదిలేయమంటారా! ఎంతమాత్రం వీలుకాదు.’’ భీష్మించింది శ్యామల.
“వీలుకాదూ!’’ హుంకరించాడు సౌమిత్రి ఈ అవకాశం చేజారిపోతే ముందెన్నడూ కుదరదేమోనన్న భయంతో.
“ముమ్మాటికీ కాదు…’’ తగ్గకుండా బదులిచ్చింది శ్యామల.
“అయితే విను…నువ్వు నీ హాబీని విడిచిపెట్టకపోతే… నాకెంతో ప్రీతిపాత్రమైన నిన్ను నేను పరిత్యజించాల్సి వస్తుంది.’’ గంభీరంగా చెప్పాడు సౌమిత్రి.
ఖంగుతింది శ్యామల. భర్త అంతమాట అంతాడని ఆమె ఊహించలేదు. ఇన్నేళ్లపాటు పూవుల్లో పెట్టుకుని చూసుకున్న తనను అక్కడ వదిలేయడానికి సిధ్ధమయ్యాడంటే తాను తన ప్రయోగాల పిచ్చితో ఇన్నాళ్లుగా అతడినెంతగా వేధించిందో ఆమెకి బోధపడింది. ఆమెకు ఆపవిత్రగంగానదీ జలాల్లో జ్ఞానోదయం అయింది.
“అయ్యో! అంతమాట అనకండీ… మీరులేకపోతే నేనెలా ఉండగలను చెప్పండి! మీరు చెప్పినట్లుగానే నా హాబీని ఈ గంగానదీ జలాల్లో కలిపేస్తున్నాను. ఇకముందు ఎవరినీ కూడా నా ప్రయోగాలతో బాధపెట్టను.’’ కన్నీళ్లతో అంది శ్యామల.
ఇప్పుడు సౌమిత్రి ముఖం చింకి చాటంత అయ్యింది.ఇన్నాళ్లూ ఈ ఆలోచన రానందుకు తనని తానే తిట్టుకుంటూ, కనీసం ఇప్పటికైనా వచ్చిందిలే… అని తనలో తానే సంతోషిస్తూ… ‘కలనిజమాయెగా…కోరిక తీరెగా’ అని కులాసాగా పాడుకుంటూ బోర విరుచుకున్నాడు.
------------------------------------- సమాప్తం -----------------------------------

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ