Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సన్(డే) స్ట్రోక్
#2
మీ అమ్మాయికీ పిచ్చుందని నాకు ముందే ఎందుకు చెప్పలేదత్తయ్యా?’’ కడివెడు కన్నీళ్ళను ఆపకుండా కారుస్తూ వాపోయాడు సౌమిత్రి అత్తగారి సమక్షంలో.
నేను చెబుదామనే అనుకున్నా నాయనాఏదీమీ మామగారు నోరు తెరవనిస్తేనా! పెళ్లైన తరువాత నయానో, భయానో నువ్వే నచ్చ చెప్పుకుంటావని నోరుమూసుకుని ఊరుకున్నా. ‘’ చావుకబురు చల్లగా చెవినేసింది అత్తగారు.
ఏం నచ్చచెప్పడమో ఏంటో! మీ అమ్మాయి చేసిపెట్టే అడ్దమైన గడ్డీ తినలేక కడుపు కకావికలైపోతోదంటే నమ్మండి. నాలుకమీద బ్రహ్మజెముడు ముళ్లు మొలిచాయి. ఇంకా కొన్నాళ్ళిదే కంటిన్యూ అయితే నేను కైలాసానికి పోవడం ఖాయంమీరు నామీద ఇంత కక్ష కడతారనుకోలేదు. అమ్మాయి కుందనపుబొమ్మలా ఉందనుకుని మురిసిపోయానే కాని, ఇలాంటి పాడుహాబీలు ఉన్నాయని కనుక్కోలేకపోయాను…’’ ఉసూరుమని ఏడ్చాడు అంతమగాడూ కూడా.
అత్తగారు కదిలిపోయింది. ఎంతైనా నలుగురు పిల్లల్ని కన్నతల్లి. పరాయమ్మ బిడ్డడైనాఅలా చిన్నపిల్లాడిలా పొగిలిపొగిలి ఏడుస్తూ ఉంటే కన్నపేగు కదలదూ!
ఏంటయ్యా సౌమిత్రీ ఏడుపు! కొత్తవంటలైతే బాగా చేయలేదు గానీ, రోజూ మనం ఇంట్లో చేసుకునే పప్పులు, పచ్చళ్ళు, కూరలు బాగానే వండుతుందిఎటొచ్చీదాన్ని నువ్వు కొత్తవంటల జోలికి పోకుండా చేయగలిచావనుకో! నీ బతుక్కేం ఢోకా లేదు…’’ అంటూ ఊరడించింది అతడిని.
బతికించారుఅవే నాపాలిట పంచభక్ష్య పరమాన్నాలనుకుని సరిపెట్టుకుంటాను. ఇంతకీ వంటల్లో ప్రయోగాల పిచ్చి ఎలా మానిపించాలో కాస్త దారి చూపించండి.’’ వేడుకున్నాడు ఆకొత్తల్లుడు.
రౌతు కొద్దీ గుర్రం అన్నారు పెద్దలు. కొత్తపెళ్లాం కదాని నెత్తికెక్కించుకోకుండా కాస్త భయభక్తులలవాటు చేయి. దెబ్బకి దెయ్యం వదులుతుందంతారు. నువ్వు అమ్మాయి పట్ల కాస్త కఠినంగా ఉన్నావనుకోఅదే దారిలోకి వస్తుంది…’’ తారకమంత్రం ఉపదేశించింది అత్తగారు.
ఎవరైనా అల్లుడిని కొంగున ముడేసుకోమని కూతురికి సుద్దులు చెబుతారు. కాని, అందుకు విరుధ్ధంగా అత్తగారు కూతురిని దారిలో పెట్టమని చెబుతోందంటే శ్యామలలో ఈపిచ్చి వాళ్లనెంతగా బాధించిందో అర్ధమైంది సౌమిత్రికి.
అత్తగారు చెప్పినట్లే శ్యామల అలా కొత్త ప్రయోగాలు చేయబోయినప్పుడల్లా కళ్లెర్రచేసి రుద్రతాండవం ఆడబోయాడు. కాని, కట్టలు తెంచుకున్న శ్యామల కన్నీటి ప్రవాహం అతడి తాండవాన్ని క్షణాలమీద ఆపుచేసింది.
నేనేమంత తప్పుపని చేశానని అలా రంకెలేస్తున్నారూ! రకరకాల వంటలు తయారుచేసి మొగుడి కడుపు నింపాలనుకోవడం తప్పా! ఎవరైనా భార్యకి వంటచేయదం రాదని ఏడుస్తారుమీరేంటో నాకు వంటొచ్చని గోలపెడుతున్నారు…’’ జిర్రున ముక్కుచీదింది శ్యామల.
అర్ధాంగి కళ్లలో గంగాయమునలు ఉప్పొంగడంతో కుదేలైపోయాడు సౌమిత్రి. ఏరికోరి పెళ్లిచేసుకున్న అన్నులమిన్నను అలా తల్లడిల్లేలా చేయడం మగనిగా తనకు తగనిపని అని నలిగిపోయాడు లోలోనే.
అంతేఅతడి పిలక శ్యామలచేతికి చిక్కింది. ఆమె ప్రయోగాలదాడికి అతడి జిహ్వ, తద్వారా కుక్షి బలైపోసాగాయి. ఏదో సినిమాలో చూపించినట్లుగా హిప్నాటిస్ట్ దగ్గరకి తీసుకెళ్లి ఆమెకున్న వెర్రిని వదల్చాలని కూడా ప్రయత్నించాడు సౌమిత్రి.
కాని, శ్యామల దగ్గర ఆపప్పులేమీ ఉడకలేదు. పైగా ఆమె వంటలపిచ్చికి ఆహిప్నాటిస్ట్ బెదిరిపోయి, ఇంకాసేపు ఆమెనక్కడే ఉంచితే ఆవంటలన్నీ చేసి తనచేత తినిపిస్తుందేమోనని భయపడి అక్కడనుంచి వెళ్లగొట్టినంత పనిచేసి ఊపిరి పీల్చుకున్నాడు.
ప్రయత్నం కూడా బెడిసికొట్టాక శ్యామల ఏకఛత్రాధిపత్యానికి అడ్డూ ఆపూ లేకుండాపోయింది. సొరకాయతో స్వీటు, కాకరకాయతో కూటు, పుచ్చకాయ పులుసు,బెండకాయ బండపచ్చడి, బీరకాయతో బూరెలు, నువ్వులతో నూడిల్స్, కొరివికారంతో కుల్ఫీఇలా కావేవీ వంటకనర్హం అన్నట్లుగా రోజుకో వెరైటీ చేసి పతిదేముడికి నైవేద్యంగా సమర్పిస్తోంది శ్యామల.
ఎంత దేముడైనా ఇలాంటి పిచ్చిపిచ్చి వంటలన్నీ అరిగించుకునేందుకు జీర్ణశక్తికావద్దూ! ఖాండవదహనం చేయడానికి అతడేమీ అగ్నిదేముడు కాదుకదా! సౌమిత్రి కడుపు ఖరాబై, కకావికలై అతడు ఆసుపత్రి పాలయ్యాడు. భర్తకా స్థితి కలగడానికి తానే అని తెలిసినా తన అభిరుచిని విడిచిపెట్టేందుకు ఎంతమాత్రం సిధ్ధంగా లేదు శ్యామల.
సౌమిత్రి నానా ప్రయత్నాలూ చేసి , చివరికి అర్ధాంగిని నుండి ఆదివారవరాన్నిపొందాడు. ఆదివారవరవిశేషం ఏంటయ్యా అంటేశ్యామల వారం లోఆరురోజులపాటు ఏప్రయోగాల జోలికీ పోకుండా కేవలం సాదాసీదా వంటకాలు మాత్రమే చేసి అతడి అరోగ్యం చెదిరి, చెడిపోకుండా చూసుకోవాలనీ, తన పాకశాస్త్ర ప్రయోగాలని కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితం చేసుకోవాలనీ పోరాడి పోరాడి విజయం సాధించాడు సౌమిత్రి.
ఇప్పుడింకో కొత్తబెడద మొదలైంది. ఆదివారంనాడు సౌమిత్రి మాత్రమే కాక, ఇంటికొచ్చే చుట్టాలు- స్నేహితులు కూడ శ్యామల ప్రయోగాల బారిన పడసాగారు. దానితో ఇంటికొచ్చే చుట్టపక్కాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ‘ అమ్మో! సౌమిత్రి ఇంటికా! మేం చచ్చినా రాం బాబూ!’’ అనే వాళ్లు ఎక్కువైపోయారు.
ఒకవిధంగా ఇది తనమంచికే అనుకున్నా, అర్ధాంగి చేతిమహాత్మ్యం అతడిని అల్లకల్లోలానికి గురిచేసింది.
పిల్లలు పుట్టనంతవరకూ సౌమిత్రికి మాత్రమే మహద్భాగ్యం దక్కింది. ఆతరువాత అతడి అదృష్టంలో పాలుపంచుకునేందుకు మహిమ, మనోజ్ లు పుట్టారు. శ్యామల లోని విశిష్టప్రతిభ కారణంగా వాళ్లకి పరిమితమైన స్నేహితులు మాత్రమే ఏర్పడ్డారు. వాళ్లు పొరబాటున కూడా ఆదివారంనాడు వీళ్లఇంటి వైపుకి తొంగిచూడరు.
మండువేసవిలో అంతకన్నా తీవ్రంగా మండే ఆదిత్యుడి తీవ్రతకి వడదెబ్బ తగిలి ఎవరన్నా ఠారుమనడం సహజం. కాని, ప్రతి భానువారం ఇలా భా(ర్యా)మామణి దెబ్బకి డస్సిపోవడం ఆతండ్రీ పిల్లలకే చెల్లింది.
సన్ డే స్ట్రోక్’’ ని తప్పించుకునే మార్గమేలేదా?’’ ఎన్నోసార్లు వాపోయినా వీళ్ళకి సమాధానం దొరకలేదు.
మరికొన్ని రోజులకి మహిమకి పెళ్లికుదిరింది. శ్యామల గురించి ఎంత చెప్పినా వినకుండా మహిమను చేసుకునేందుకు శ్యామల అన్నకొడుకుకమల్ముందుకొచ్చాడు.
నాకు వరకట్నాలు గట్రా ఏమీ వద్దుకాని, నీ కూతురిని చేసుకోవాలంటే నాదో కండిషన్ అత్తా!’’ కమల్ చెప్పాడు ముహూర్తాలు పెట్టుకునే ముందు.
కట్నం వద్దనే అల్లుడు దొరికినందుకు పొంగిపోతూనే ‘’చెప్పరా’’ అందు శ్యామల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: సన్(డే) స్ట్రోక్ - by k3vv3 - 06-11-2022, 06:24 PM



Users browsing this thread: 1 Guest(s)