28-05-2019, 09:25 PM
"నీకు అసలు విషయం తెలిసినట్లు లేదు , తెలిస్తే పెళ్లి గురించి మాట్లాడే దానికి కాదు " అన్నాడు రాజు
"అసలు విషయం ఏంటి రాజు , మేము ఇద్దరం ప్రేమించు కొన్నాము "
"అచ్చు తప్పు రాధా , నువ్వు ప్రేమించావు , వాడు నిన్ను ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడాడు, 9 నెలల క్రితం మేము వేసుకున్న బెట్ లో బాగమే వాడి ప్రేమ"
"ఏంటి మీరు ముగ్గురు నా మీద బెట్ కాసార , దానిలో బాగమే కృష్ణా నన్ను ప్రేమిస్తున్నట్లు నటించాడా ?" అంటూ ఆశ్చర్య పో సాగింది. కృష్ణా ఇది నిజమా అన్నట్లు తన వైపు చూసింది.
"వాళ్ళు చెప్పింది నిజం రాధా , అయినా నాలాంటి కోటీశ్వరుడు నీలాంటి దాన్ని ఎలా ప్రేమిస్తాడు అను కొన్నావు , నీకు అందం ఉంటె ఉండవచ్చు కానీ మా అంతస్తు ఎక్కడ నీ అంతస్తు ఎక్కడ , ఈ విషయం ఇక్కడితో మరిచిపో. దీన్ని పొడిగించకు కావాలంటే నీతో పడుకున్నందుకు ఎంత కావాలో కోరుకో అంతా పడేస్తా , కామ్ గా నా దారికి అడ్డు రాకుండా నీ దారి నువ్వు చూసుకో."
"క్రష్ణా తప్పు చేస్తున్నావు , ఇదంతా అబద్దం అని చెప్పు, నన్ను ఇలా వదిలేయక , కాలేజీ లో మన గురించి అందరికి తెలుసు మనం విడిపోతే నేను తల ఎత్తుకు తిరగ లేను"
"ఇదే కాలేజీ లో అందరికి నా గురించి కూడా తెలుసు నువ్వు పరిచయం కాకా ముందు నేను ఎంత మందితో తిరిగానే అందరికి తెలుసు వాళ్లలో నువ్వు ఒకరు అనుకోని మర్చి పోతారు."
"అలా అనక కృష్ణా , నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను , అందుకే గా నన్ను నీకు సమర్పించు కొన్నాను. నాకు అన్యాయం చేయికు కృష్ణా " అంటూ ప్రాధేయపడ సాగింది.
"నా జీవితం అనే పుస్తకం లో నీ అధ్యాయం ముగిసింది . ఇంక నువ్వు వెళ్ళవచ్చు , నీ పేరు ఇంకో మారు నా బుక్ లో ఎంటర్ కాకుండా చూసుకో రాధా బై "అంటూ అక్కడ నుంచి లేశాడు. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తనతో పాటు బయలు దే రారు.
"కృష్ణా , ఇంత వరకూ నా ప్రేమనే చూసావు , ఇప్పటి నుంచి నా ద్వేషాన్ని చూస్తావు , ఈ పుస్తకం లో నా పేరు మల్లి ఎంటర్ కావద్దు అన్నా వో అదే పేరు తో నీ పుస్తకం నిండు కొంటుంది చూడు ,ఎ సంపదను చూసుకొని విర్రవీగు తున్నావో దాన్నే లేకుండా చేస్తా . నీ దృష్టిలో ఇది ముగింపు అనుకుంటున్నావు నా దృష్టిలో ఇది మెదలు మాత్రమే, నేను నిన్ను ఏవిధంగా బ్రతిమ లాడానో అంత కంటే రెండు రెట్లు ఎక్కువ బ్రతిమ లాడేలా చేస్తాను, ఇది గుర్తు పెట్టుకో " అంటూ అక్కడ నుంచి విస విసా వెళ్లి పోయింది.
"సినిమా డైలాగులు బాగానే ఉన్నాయి హైదరా బాదు వెళ్లి ఏదైనా సినిమాలో ట్రై చెయ్యి రాధా , నీ అందం చూసినా నీ మాటలు సినిమాలో వేసుకుం టారు " అన్నాడు తనకు వినబడేట్లు.
"ఒరే ఆ అమ్మాయిని కెలికి తప్పు చేసావేమో " అన్నాడు చంద్రం
"రేయ్ , అది గతం , గతాన్ని నెమరు వేసుకోవడం ఈ కృష్ణకు అలవాటు లేదు , లెట్స్ మూవ్ " అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయారు.