Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంగళసూత్రాలు
#1
"మంగ"ళ సూత్రాలు
ఒక జంట కథ
సమయం సాయంత్రం ఆరుగంటలు కావస్తోంది. ఎప్పటిలాగే మంగ ఇల్లంతా శుభ్రం చేసి, ఇంటిముందు కల్లాపి చల్లి, ముగ్గులు పెట్టి, తాను కూడా శుభ్రంగా తయారై, తన రోజూ అలవాటు లాగే బావకోసం సముద్రం ఒడ్డుకు వెళ్లాలని సిద్ధమవుతోంది. హుషారుగా ఏదో పాట పాడుకుంటూ తలలో పూల దండ పెట్టుకుంటూ ఉండగా, "ఒలె, మంగా, ఈ సేపలబుట్ట లోపల పెట్టవే" అంటూ వీధిలో అరుగుమీద కూలబడ్డాడు మంగ భర్త రాజులు . 
                 బావా, నీకోసం నేనే సముద్రం దగ్గరకి వద్దామనుకున్నా, అంది రాజులు చేతిలో చేపల బుట్టని తీసుకొని, అందులో సరుకు చూస్తూ, "ఏటి బావా, రోజురోజుకి సేపలు తగ్గిపోతున్నాయి" అడిగింది. "ఏటి సేద్దామే, గవుర్నుమెంటోరు మోటార్ బోట్ లు తో ఎక్కడైనా సేపలు పెట్టుకోవచ్చు అన్నారుట. ఆరేమో పదేసి ఇరవయ్యేసి మోటార్ బోటులు యేసుకొచ్చేసి, ఎక్కడికక్కడ సముద్రాన్ని కెలికేసి పోతున్నారు. మనకెక్కడ దొరుకుతాయే సేపలు" నీరసంగా కూర్చుని మంగ ఇచ్చిన టీ తాగాడు. 
              "బావా,   యేడినీళ్ళెట్టినా, బేగా రా, సుబ్బరంగా స్తానం సేసి, కడుపునిండా బువ్వ తిందువు. ఇయ్యాల నీకిట్టమని పప్పుసారు కాసి, దొండకాయలు కూరొండాను" ఆప్యాయంగా భర్త కూర్చున్న చోటే, అతను వేసుకున్న చొక్కా విప్పి, స్నానం కి నీళ్లు బకెట్ తో ఇంటి ముందే పెట్టింది. రాజులూ శుభ్రంగా స్నానం చేసి, "గంగమ్మ తల్లీ, నీ బిడ్డల్ని కరుణించమ్మా", అంటూ సముద్రం కేసి తిరిగి ఒక దణ్ణం పెట్టి, ఇల్లు అని పిలిచే గుడిసెలోకి వెళ్ళాడు. ఇల్లంతా పేడతో అలికిందేమో, పేడ వాసనా, ముగ్గులు వాసనా కలిపి గుప్పున ముక్కుకి చేరింది. "ఇయ్యాలంటే స్పెసలు, ఇల్లంతా తళతళ లాడుతోంది" అడిగాడు. 
               మంగ నవ్వేసి ఊరుకుంది. భోజనం తినేసి, పట్టెమంచం వాల్చి, దానిమీదికి బొంతవేసి, పక్క సిద్ధం చేసింది. కాళ్ళు నొప్పులుపుడుతున్నాయే మంగా అంటూ మంచం మీద నడుం వాల్చాడు రాజులు. భర్తకి కాళ్ళు నొక్కుతూ, "బావా, సముద్రం మీద యేట దొరక్కపోతే ఎలా" అడిగింది. "ఏమోనే మంగా ఏమీ తోశడం లేదు" ఇంటిపైకప్పుకేసి చూసాడు రాజులు. 
              కొంతసేపు నిశ్శబ్దం. "బావా, నాకు మెళ్ళోకి సూత్రాలు కొంటానన్నావు" గుర్తుచేసింది మంగ. "మంగా, నాకు మాత్రం కొనాలని లేదే టే, డబ్బు లేదు కదే, రాజులు గొంతులో బాధ అర్థమౌతోంది. పెళ్లప్పుడు మెళ్ళో కట్టిన పసుపుతాడే మార్చిమార్చి కట్టుకుంటుంది. ఏడాదికి మూడు కొత్త చీరలు, గంగమ్మ తీర్థానికి, పెద్దపండక్కి,   సముద్రంలో ప్రతిఏడాది మొదటిసారి చేపల వేటకి వెళ్ళినప్పుడు కొంటాడు. 
            ఇంట్లో అవసరం కి కావలసిన డబ్బు ఉంచి, చేపలమ్మిన డబ్బులు పెద్దమ్మ   దగ్గర దాస్తారు ఇద్దరూ. అది ఇల్లుకట్టుకోవడానికి అని  నాలుగేళ్లక్రితం పెళ్లయ్యే సమయంలోనే చెప్పుకున్నారు భార్యాభర్తలు. మంగ కాళ్ళు నొక్కుటూ ఉంటే   కాళ్ళు నొప్పులు  లేవే మంగా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. మంగ మౌనంగా లేచి వెళ్ళి, దీపం చిన్నది చేసి, వచ్చి భర్తపక్కన పడుకుంది.    రాజులు మంగని ఎక్కడెక్కడో తడిమేస్తూ, కౌగిట బంధించాడు.   ఆమె మెడలో పసుపుతాడు అడ్డుగా ఉందని పక్కకి తీస్తూ ఉంటె,   అబ్బా, అది ఉండనీ, ఎలాగూ సూత్రాలు కూడా కొనలేదు" అంది మంగ. 
 
               రాజులు ముఖంలో భావాలు మారిపోయాయి, చటుక్కున ఆమెను వదిలేసి, పక్కకి తిరిగిపోయి, "మంగా, నేనేమైనా డబ్బులు పాడుసేత్తన్నానా? మాటికీ సూత్రాలు అంటావు" చిరాగ్గా లేచి కూర్చున్నాడు. చివాల్న మంచం మీంచి లేచి, పక్కన ఉన్న నులకమంచం లాక్కుని పడుకుంది అటువైపు తిరిగి. ఆమె మౌనంగా వెక్కుతూ ఏడుస్తూ ఉంటే, రాజులు మౌనంగా ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. 
            రెండురోజులు గడిచిపోయాయి. ఇద్దరి మధ్యా మాటల్లేవు, కలిసి తినడం, పడుకోవడం ఏమీ లేదు. ఉదయాన్నే లేచి ఇంత గంజి అన్నం తానే డబ్బాలో పెట్టుకొని, పచ్చిమిరపకాయో, ఉల్లిపాయో తీసుకొని వెళ్ళిపోతున్నాడు చేపలవేటకు. ఇయ్యాల యేట మానెయ్యకూడదూ ఏదో గోడకి చెప్పినట్లు చెప్పింది మంగ. ఎందుకే అడిగాడు రాజులు. పెళ్ళాం తనతో మాట్లాడినందుకు సంబరంగా ఉన్నాడు. పైగా మూడు రాత్రులు అయ్యింది పెళ్ళాన్ని ముట్టుకొని. ఇయ్యాల మన పెళ్లిరోజు బావా" చెప్పింది సిగ్గుపడుతూ. 
              చేతిలో పట్టుకున్న అన్నం డబ్బాని కింద పెట్టాడు. "ఏటి బావా అడిగింది పక్కకి తప్పుకుంటూ. మంగ చెయ్యి పట్టుకొని గట్టిగా తనవైపు లాక్కుని కౌగిట్లో బంధించాడు రాజులు. ఇప్పడు నీకు టైం అయిపోతోంది అంది మంగ. ఇద్దరి మధ్యా మాటల్లేవు. "ఒరేయ్ రాజులూ,  బేగా రారా, టైం అయిపోతోంది. లేట్ అయిపోతే యేట దొరకదు"   అరుగు దగ్గర నిలబడి గట్టిగా అరిచాడు సుందరం. 
           రాజులు గభాల్న లుంగీ చుట్టుకొని, బయటికి వచ్చి, "ఒరేయ్ సుందరం పది నిమిసాలురా, కొంచెం పనుంది" చెప్పాడు. ఇవన్నీ వాళ్ళకి మామూలే. ఎప్పుడు ఇంటికి వస్తారో, ఎప్పుడు వేటకి వెళతారో తెలియదు. సుందరం చిలిపిగా నవ్వుతూ, ఒరే రాజులా, నింపాదిగా పని సూసుకొని రా. మేము సముద్రం దగ్గర ఉంటాం" గంగన్న తో నవ్వుతూ వెళ్ళిపోయాడు. 
           "సీ...సీ ..నీకు బొత్తిగా సిగ్గునేదు" అంటూ భర్తవైపు మురిపెంగా చూస్తూ అతని కోరిక తీర్చి వేటకి పంపింది. రాజులు బట్టలు మార్చుకొని, "ఒలె మంగా, పెద్దమ్మ దగ్గర డబ్బుంది కదా, దాన్ని తీసుకెళ్లి టౌన్ లో సూత్రాలు, గొలుసు కూడా కొనుక్కో" చెప్పాడు. ఇల్లుకోసం దాచాం కదా బావా అడిగింది. పరవాలేదులే మంగా, నేను తొందరగా వస్తాను" అంటూ గబగబా పెద్దమ్మకి ఒక మాట చెప్పేసి, సముద్రం వైపు బయల్దేరాడు. 
                 సాయంత్రం ఎప్పటిలా తన డ్యూటీ ముగించుకుని సూర్యుడు మరలిపోతున్నాడు. బావ ఇంకా రాలేదనుకుంటూ గబగబా తయారై, భర్తకు ఇష్టమైన తెల్లకోక కట్టుకొని, తల్లో జాజిపూల చెండు తురుముకొని సముద్రం వైపు బయల్దేరింది. చల్లని గాలి, పున్నమి కావడం వలన సముద్రం మంచి ఊపుమీద ఉంది. అప్పుడే పడవ ఒడ్డుకు చేరుస్తున్న సింహాచలాన్ని చూసింది మంగ. ఉత్సాహంగా "ఓ, సిన్నాన్నా, మా బావ అగుపడినాడా!" అంటూ అడిగింది. 
         "లేదు మంగమ్మా, ఆల్లు ఇంకో దిక్కుకు ఎల్లారు అనుకుంటా" తన పనిలో నిమగ్నమయ్యాడు. మంగ సముద్రం ఒడ్డున ఒకచోటున కూర్చుని, భర్త రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది. దూరంగా ఎక్కడో చిన్నచుక్కల్లా కొన్ని పడవలు కనిపిస్తున్నాయి. సముద్రం ఒడ్డున ముగ్గురు మనుషులు దూరంగా కూర్చుని కనిపించారు. ఒంటరిగా కూర్చుని ఉన్న మంగ మీద వాళ్ళ ద్రుష్టి పడింది. పడవలు సముద్రం మీదనుండి ఒడ్డుకు రాగానే, చేపలు మొత్తంగా కొనుక్కొని పోయే దళారీలు వాళ్ళు. 
            "అమ్మాయ్, నీ పేరేంటే" అడిగాడు ఒకడు. వాళ్ళ మాటల్ని బట్టీ, వాళ్ళు తాగేసి ఉన్నారని అర్థమైంది మంగకి. నీకెందుకురా నా పేరు అంటూ కసురుకుంది వాణ్ణి. ఇంకొకడు ఆమె పక్కకి వచ్చి కూర్చొని, అది కాదే, మేము నలుగురం ఉన్నాం. మా కోరిక తీర్చావంటే తలా రెండేసి వేలు ఇస్తాము అన్నాడు ఆమె భుజంమీద చెయ్యి వేస్తూ. "తియ్యరా చెయ్యి అంటూ విదిలించి కొట్టి, అక్కడినుండి లేవబోయింది. నలుగురూ ఆమెను అరవకుండా పట్టుకొని దగ్గరలో తోటలోనికి తీసుకెళ్లారు. 
                 వదలండిరా అంటూ గింజుకుంటూ, వాళ్ళని బతిమాలుతూ, తిడుతూ, ఎదురుతిరుగుతోంది. కానీ వాళ్ళ పశుబలం ముందు ఆమె ఓడిపోక తప్పలేదు. వాళ్ళ మాటల్లో వాళ్ళు చేపలు కొనడానికి వచ్చిన దళారులని అర్థమైంది. మంగ గింజుకుంటూ ఉన్న కొద్దీ వాళ్ళు   పట్టు బిగించారు. ఒళ్ళంతా నొప్పులతో, రక్తం కారుతూ ఉంటే మంగ ఏడుస్తూ, లేవలేక లేవలేక పైకి లేచింది. వాళ్ళు ఆమెను అక్కడ వదిలేసి పారిపోయారు. 
           ఆకాశంలో చంద్రుడు మౌనంగా సాక్షిలాగా నిలబడ్డాడు. కుంటుతూ ఏడుస్తూ నడుస్తున్న మంగను వెనకాల నుండి వచ్చిన రాజులు చూసి "మంగా, ఏటైనాదే అలా నడుతున్నావ్" అడిగాడు. రాజులు మాట వినపడగానే భోరున ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది మంగ. "ఏటైనాది సెల్లీ" అడిగాడు గంగన్న. మంగా, సెప్పే    ఏటైనాదే , భయం భయంగా అడిగాడు రాజులు. నా జీవితం బుగ్గి సేసేసినారు బావా" అంటూ కుమిలికుమిలి ఏడుస్తోంది. 
               "సెప్పు సెల్లీ ఏమైనాది" ఓదార్పుగా అడిగాడు సుందరం. అన్నా, ఆళ్ళెవరో సేపలు కొనేటోళ్లు, నేను బావకోసం కూకొని ఉంటే నన్ను అదిగో ఆ తోటకాడికి ఈడుసుకు పోయి....మొహం రెండు చేతుల్తో మూసుకొని నేను సచ్చిపోతాను అంటూ సముద్రం వైపు నడవసాగింది. "ఒలె,మంగా ఆగే, నేను వత్తన్నా. ఇద్దరం కలిసి సద్దామె" ఏడుస్తూ అన్నాడు రాజులు. "ఎహె, ముయ్యండి ఇద్దరూ. ఊరికే ఊరంతా టముకు ఏసి మరీ సెప్పెలాగున్నారు. నేను సెప్పేది ఇనండి. ఇప్పుడు జరిగిపోయిన గోరం గురించి సచ్చిపోతే పగ ఎలా తీరుతుంది అంట. అందుకే మంగమ్మ బతకాల. ఆళ్ళని సూపెయ్యల. మనం మేకపోతుని బలిచ్చినట్లు ఆళ్ళని గంగమ్మకి బలియ్యాల".   తలపాగా తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు సుందరం. 
            ఒరే రాజులూ, మన మంగమ్మ నిప్పురా. అది తెలిసి ఇసుమంటి తప్పు సెయ్యదురా, దాన్నేలుకోరా ఒదిలెయ్యమాక" అన్నాడు గంగన్న. "మీరింటికి ఎల్లండి. మేము సరుకు తెస్తాము"చెప్పాడు గంగన్న. గుమ్మంలోకి రాను బావా, అంటూ బయట కుండలో ఉన్న నీళ్లు తలమీంచి పోసుకుంది మంగ.   ఒలె, మంగా ఆ బట్టలు అక్కడ ఇడిసెయ్యి, రేపు తగలబెడదాం. నువ్వు నిజంగా అగ్గివేనే. నీది తప్పుకాదు. నేనేమీ అనుకోను. ఆ సూత్రాలూ గొలుసు తెచ్చావా? అడిగాడు. తెచ్చాను బావా. అంటూ తీసి చూపించింది. రాజులూ స్నానం చేసొచ్చి, "గంగమ్మ తల్లీ, నా మంగమ్మకి ఏమీ తెలియదు. తప్పుసేసినోడుని నువ్వే శిక్షించాల,   అంటూ మంగళసూత్రాలు మంగ మెడలో వేసాడు. మంగను దగ్గరకి తీసుకొని నుదిటిమీద ముద్దుపెట్టు కున్నాడు .  రాజులు సంస్కారానికి గంగమ్మ అబ్బురపడి ఆశీర్వదించింది. 
 
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
మంగళసూత్రాలు - by k3vv3 - 29-10-2022, 11:31 AM



Users browsing this thread: 1 Guest(s)