18-10-2022, 03:04 PM
ఫ్రెష్ అయ్యి , దాన్వి వాళ్ళ అన్నకు కాల్ చేశాను.
“శివా , ఎక్కడ ఉన్నావు ? నిన్న వచ్చావు గా అక్కడికి రా అందరం ఇక్కడే ఉన్నాము. నీకు కాల్ చేసింది దాన్వి, ఇంటి దగ్గర నా భార్య ఫోన్ ఉంది దానికి చెయ్యి” అన్నాడు.
ఎలాగు ఆటే వెళుతున్నా గా ఓ సారి వల్ల ఇంటికి వెళ్లి ఆ తరువాత బారు కు వెళదాం అనుకుంటూ రెడీ అయ్యి , దాన్వి ఇంటికి బయలు దేరాను.
దాన్వి తన వదినా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు , ఫోన్ ఎందుకు చేశావు అని అడిగాను.
“పొద్దున నుంచి నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నా అది రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అది ఏమన్నా నీతో ఉందా అని ఫోన్ చేశా” అంది
“తను నాతొ ఎందుకు ఉంటుంది”
“ఉరికే అడిగాలే” అంటూ తన వదిన చేసిన టీ తెచ్చి ఇచ్చింది.
టీ తాగి వాళ్ళ అన్నాను కలవడానికి బార్ కు వెళుతున్నా అని చెప్పాను.
“రాత్రి లాగా ఫుల్ గా తాగి రాకండి” అంది ధన్వి వదిన.
“ట్రై చేస్తాను , కానీ ఆయన కంట్రోల్ కాకా పొతే నేనేం చేయలేను” అంటూ అక్కడ నుంచి బయలు దేరి నిన్న కలిసిన బార్ కు బయలు దేరాను.
నిన్నటి సెటప్ ఏమీ మారలేదు , కాకా పొతే ఈ రోజు ఇంకో వ్యక్తి వచ్చి కుచోన్నాడు.
నేను వెళ్ళగానే నాక్కూడా ఓ బీర్ చెప్పి “శివా నిన్న ఎయిర్పోర్ట్ లో పని చేస్తూ ఉన్నాడు అని చెప్పానుగా వాడే వీడు, ఎందుకైనా మంచిది అని డ్యూటీ నుంచి ఇక్కడికే రమ్మన్నాను” అంటూ ఆ కొత్త వ్యక్తిని నాకు పరిచయం చేసి వాళ్ళు తాగుడులో మునిగి పోయారు.
తన పేరు చౌహాన్ , వాళ్ళు విషయం అంతా చెప్పినట్లు ఉన్నారు, తను అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాడు.
“మీరు పంపిన ఫొటోలోని వ్యక్తి ఈ రోజు ఉదయం వచ్చాడు, అది కనెక్టెడ్ ఫ్లైట్ డాకా నుంచి వస్తుంది, వాడు దిగ గానే మన వల్ల కారు లోనే వెళ్ళాడు. వాడు ఉరి బయట ఓ గెస్ట్ హౌస్ ఉంటుంది అందులో దిగాడు. వాడితో పాటు ఇంకో గుండు గాడు దిగాడు , కానీ వాడు చూడడానికి తెల్లోడి లాగా ఉన్నాడు.” అంటూ ఏక ధాటిగా చెప్పి తన గ్లాసు లోని ద్రవాన్ని ఒక్క సారిగా నోట్లో పోసుకొని తనకు పని ఉంది అంటూ , అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయాడు.