Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కధలు
#10
" బ్రదర్ ఒక క్వార్టర్ ఇప్పించు సరిపోతది.. నీకు రేపే తిరిగి ఇచ్చేస్తాను "
" వద్దు బ్రదర్.. మనీ కాదు నువ్వు ఓవర్ అయితే ఆ కళావతితో కలిసి రచ్చ చేస్తవ్. "
" చేయను అన్న.. ఇంకో క్వార్టర్ తాగి రిలాక్స్ గా బజ్జుంటా..నీ మీద ఒట‌్టు" పిల్లాడిలా బతిలాడుకున్నాడు..
"నేన్నమ్మను బ్రో..నీకు దక్కాల్సిన ఆస్తినంతా కొట‌్టేసింది..నీ ప్లేస్ లో ఎవరున్నా చేసే పని అదే"
వద్దని చెప్పినట‌్లు లేదు. రెచ్చగొడుతన్నట‌్టుగా ఉంది.. ప్రవీణ్ కి కావాల్సింది కూడా అదే..
"మరి కాదా... పది ఎకరాల మెట‌్ట‌పొలం బ్రదర్.మొత్తం నాకేసింది..ఆ టక్కులాడి మీద కోపం ఉండదా..నా బాధ అర్థం చేసుకునే మనసున్న మనిషే లేడు బ్రదర్.. హ .హ...." అని ఏడుపు రాగం అందుకున్నాడు ప్రవీణ్..
శశిధర్ అనునయిస్తున్నట్టు నటిస్తూ "నాకు తెలుసు ప్రవీణ్.. అందుకే నీవు ఎంత గొడవ పడినా నేను పట‌్ట‌్టించుకోనిది.. ఇంకెంతైనా చెయ్.. నా సపోర్టు నీకే ఉంటుంది.. ఇప్పుడైతే రవి గానికి చెప్తున్నాను వెళ్ళి క్వార్టర్ తెచ్చుకో...క్వార్టర్ చాలా హఫ్ కావాలా?" అన్నాడు.
 
"హఫ్ అయితే అన్నీ మరిచిపోయి హాపీగా నిద్ర పోతాను అన్నయ్యా.. హఫ్ చెప్పు.." అన్నాడు ఉత్సాహంగా..
 
"సరే... షాపుకు వెళ్ళు. నేను రవికి చెప్తాను "
అంటూ ఫోన్ కట‌్ చేశాడు..
 
ప్రవీణ్ కు శశిధర్ తన దారిలోనే ఉన్నాడు అనిపించింది.
'నాకు కళావతి మీద చంపాలన్నంత పగ,ద్వేషం ఉన్నాయి అని శశిధర్ నమ్మేలా చేశాను. అతనికి కొత్తగా చేయగలిగే బిజినెస్ ఐడియాలు ఇచ్చి డబ్బు అవసరాన్ని సృష్టించగలిగాను. నాకు లిక్కర్ ఇప్పించి పరోక్షంగా కళావతి పైకి రెచ్చగొడుతున్నాడంటే నేను అనుకునే పని త్వరలోనే చేసేలా ఉన్నాడు'అని ఆలోచిస్తూ, పారబోయగా బాటిల్లో మిగిలిన లిక్కర్ను షర్ట్ మీద ప్యాంటు మీద కొంచెం కొంచెం పోసుకున్నాడు.మిగిలిన మొత్తాన్ని వాష్ బేసిన్ లో వంచాడు.
 
గ్లాసులో పోసుకొని పక్కకు పెట్టిన లిక్కర్ కి కొన్ని నీళ్ళు కలిపి ఒకేసారి మొత్తం లేపేశాడు..
 
ఖాళీ బాటిళ్ తీసుకొని తూలుతూ ఇంట‌్లోనుండి బయటకు వచ్చాడు, బాగా తాగిన వాడిలా....
 
ఇంటి గుమ్మానికి ఎదురుగా వున్న విధ్యుత్ స్థంభానికి చేతిలో ఉన్న బాటిల్ని కసిగా విసిరికొడుతూ "దీనమ్మ....మందు పాడుగాను... ఎంత తాగినా ఎక్కి చావట్లే " అని అందరికి వినిపించేలా అరిచాడు.. ఆ బాటిల్ వేగంగా వెళ్ళి పగిలి ముక్కలు ముక్కలుగా అయింది. అయినా, చూస్తేఫుల్ బాటిల్ అని ఇట్టే తెలిసిపోతుంది.
 
అందరూ చూస్తుండగా, తూలుతూనే తన టూ వీలర్ తీసి ఒక్కసారిగా స్పీడ్ పెంచి రోడ్లమీద దూసుకుపోయాడు.
చూసినవాళ్ళు 'ఈ రోజు కళావతికి గొడవ తప్పదేమో'అనుకున్నారు.
 
అప్పుడు సమయం రాత్రి ఎనిమిది అయింది..
 
వైన్స్ కి వెళ్ళి రవిని అడిగితె హఫ్ ఇచ్చాడు.
వాట‌ర్, గ్లాసు తీసుకుంటున్న ప్రవీణ్ కి రవి, శశిధర్ కు ఫోన్ చేయడం తెలిసి పోతుంది.
 
వాళ్ళ సంభాషణ వింటున్న ప్రవీణ్ 'ఇదేదో ఈ రోజే కొలిక్కి వచ్చేలా ఉంది. ఇవ్వాళ కాకపోతే పోతే రేపు. కాకుంటే తర్వాత రోజు. ఒక రోజు లేటైనా మిషన్ పక్క సక్సెస్..' అనుకుని లోలోపలే విజయ గర్వంతో నవ్వుకున్నాడు.
 
అందరి ముందే తీసుకున్న లిక్కర్ మొత్తం తాగేసి,రెండు గంటల తర్వాత తన బండి అక్కడే వదిలి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి పదినుండి నడిరేయి వరకు ఎప్పటిలాగే కళావతితో కయ్యానికి కాలు దువ్వాడు కానీ కళావతి ఇంట‌్లో నుండి బయటకు రాలేదు..
అరిచి అరిచి ఈ రోజుకు చాలని తన ఇంట్లోకి వెళ్ళి ముసుగు కప్పుకుని పడుకుంటాడు...
 
************
 
ఉదయమే ఎవరో తలుపులు తడుతున్నట్టు బయట‌ నుండి అలజడి వినబడింది. బద్దకంగా లేచి కాలకృత్యాలు ముగించుకొని, అద్దం ముందు నిల్చుని శుభ్రంగా షేవింగ్ చేసుకుంటూంటే, బయట అలజడి ఇంకా ఎక్కువైంది.
 
కళావతి ఇంట‌్లో నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి.
"అత్తయ్యో...అత్తయ్యా..." అని..
ఆ దుఃఖంలో నిజాయితీ ఉంది.ఆ గొంతు శశిధర్ బార్యది. ఆమె దుఃఖానికి కారణం తన భర్తే అని తెలిస్తే ఏం చేయగలదు పాపం‌.
"అరేయ్ ప్రవీణ్ గా, డోర్ ఓపెన్ చెయ్యరా.. ఈ రోజు నీ చావు కళ్ళ చూడందే వదలన్రా.."
 
" ఏయ్ ఎవరైనా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు ఫోన్ చేశారా"
శశిధర్ గొంతు స్పష్ట‌ంగా వినిపించింది. తప్పు చేసిన వాడే ఎగిరి పడుతున్నాడు.
 
కాలం గడుస్తూ ఉంటే జనాలు ఎక్కువ అవుతూ ఉన్నారు.తలుపులకు లోపల వైపు ఇంటి లోపల బ్రష్ చేసుకుంటూ ప్రవీణ్ అంతా వింటూనే ఉన్నాడు.
గుంపులో నుండి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.' హైదరాబాద్ నుంచి ఆమె గండానికే వచ్చాడేమో' అని ఒకరు,'పాపం కళావతి' అంటూ కళావతి మీద సానుభూతి మరొకరు చూపిస్తున్నారు.
'తల్లి కి చేసిన ద్రోహానికి పగతో ఇది చేసి ఉంటాడు' అని కొంతమంది అనుకుంటున్నారు ఇంటి బయట‌...
 
ప్రవీణ్ స్నానం ముగించుకొని వచ్చి, డ్రెస్ అప్ అయ్యేసరికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేశారు.
 
శశీధర్ వాళ్ళను ముందుగా రీసీవ్ చేసుకొని ఎస్.ఐ. కి కంప్లయింట్స్ స్టార్ట్ చేశాడు.
"తాగుబోతు సార్ వాడు. ఊరందరికీ తెలుసు...అడగండి ఎవరైనా చెప్తారు. చంపుతానని రోజూ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. చివరికి వాడు అనుకున్న పని చేసి చూపించాడు.ఇప్పుడు ఇంట‌్లో నుండి బయటకు రావట‌్లే.. ఖచ్చితంగా వీడే చంపాడు.. " అనిచెప్పుకుంటూ పోతున్న శశిధర్ ని ఆపమన్నట్టు సైగ చేసి డోర్ దగ్గరకు వెళ్ళి " ప్రవీణూ.. నేను యస్.ఐ విక్రమ్ ని.. డోర్ తీసి బయట‌కు రా.. లేకపోతే ఈ హత్య నువ్వే చేశావు అనుకోవాల్సి ఉంటుంది.... వింట‌న్నవా ప్రవీణ్.. " అని గట‌్టిగా చెప్పాడు.
 
డోర్ దగ్గరే నిలబడి ఉన్న ప్రవీణ్, " సార్ నాకూ ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు.. మీరు ఒక్కరే లోపలికి వస్తే వివరంగా చెప్తాను. "అన్నాడు.
 
'సరే అయితే డోర్ ఓపెన్ చెయ్' అన్నాడు యస్.ఐ..
 
" మీ పై నమ్మకంతో తీస్తున్న సార్" అని మెల్లగా, కొంచెం ఓపెన్ చేయగానే యస్.ఐ. తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుల్స్ ఫోర్స్ గా లోపలికి వెళ్ళారు.
 
వెళ్తూనే ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు చెరో చేయి పట్టుకుని వెనక్కి మడిచారు. మూడోవాడు వెనుక వైపు కాలర్ పట్టుకున్నాడు.
యస్.ఐ కంప్లీట‌్ గా డోర్ తెరవబోతుంటే "సర్ సర్ సర్.. ఈ హత్య చేసింది ఎవరో నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్.. టూ మినిట్స్ టైమ్ ఇస్తే మీకిస్తాను" అన్నాడు రిక్వెస్ట్ గా..
ఏంట‌వి? ఎక్కడున్నాయని అడిగాడు యస్.ఐ. డోర్ క్లోజ్ చేస్తూ..
 
"నా కంప్యూటర్ లో సార్.. అది అక్కడ ఉంది "అని కంప్యూటరు వైపు చూపించాడు.
'పద చూపించు. వదలండి వాన్ని. ఇంతమందిలో తప్పించుకోలేడు' అని ఆర్డర్ వేశాడు.
 
ప్రవీణ్ కంప్యూటర్ ముందు చెయిర్ లో కూర్చునిసీసీ కెమెరాల వీడియోలు తీసి చెక్ చేస్తుంటే " ఏం చేస్తుంటావ్ నువ్వు.. సీసీ కెమెరాల అవసరం ఏమిటి నీకు"అని యస్.ఐ. అడుగుతాడు.
 
ప్రవీణ్ ఆ టేబుల్ డ్రాయర్ లోనుండి తన ఐడీ కార్డు తీసి యస్సై కి ఇస్తూ
"సార్ నా పేరు ప్రవీణ్ పగడాల. నేను eye detective and private investigation లో ఏజెంటుగా చేసేవాడిని. కరోనా వల్ల పని లేక ఊర్లోనే ఉంటున్నా" అని చెప్పి కూర్చోడానికి తన పక్కనే చెయిర్ చూపించాడు..
 
యస్సై కంప్యూటర్లో చూస్తూ కూర్చున్నాడు.
 
ప్రవీణ్తాను కళావతి ఇంటి ముందు అరవడం ఆపి ఇంటికి వెళ్ళిన పన్నెండు గంటల తర్వాత నుండి రికార్డ్ అయిన వీడియో చెక్ చేస్తాడు. ట‌ైమ్ మూడున్నర కావస్తూండగా ఒక పెద్ద ఆకారం చుట్టూ పరికిస్తూనేరుగా కళావతి ఇంట‌్లోకి వెళ్తుంటే ముఖం క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ వీడియోను ఫ్యూజ్ చేస్తాడు..
యస్సై విక్రమ్ ఆ వ్యక్తిని బాగా పరీక్షించి చూసి "ఇతను బయట ఉన్నాడు కదా"అని అడిగాడు కానిస్టేబుల్స్ ని.
 
వాళ్ళు కూడా బాగా చూసి 'అవును సర్' అన్నారు.
 
యస్సై కానీయ్ అన్నట్టు సైగ చేయగానేప్లే బటన్ నొక్కాడు ప్రవీణ్..
వీడియోలో శశిధర్ కళావతి ఇంట‌్లో కి వెళ్ళి ఆరు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. కుడివైపు తిరిగి ప్రవీణ్ఇంటి గేటుదాటి లోపలకు వచ్చాడు.
గేటు దాట‌గానే కుడివైపునున్నతులసి మొక్క కుండీలో ఏదో పెట‌్టి, బయటకు నడిచాడు.
 
తిరిగి కళావతి ఇంట‌్లో కి వెళ్ళి, ఒక నిముషం తరువాత బయటకు వచ్చి ఎడమ వైపు తిరిగి నేరుగా వెళ్ళి పోయాడు..
 
ఇదంతా రెండు కెమెరాలలో రికార్డ్ అయింది.
 
యస్సై "నువ్వు డిటెక్టివ్ వి కదా. ఏం జరిగింది అనుకుంటున్నావు చెప్పు" అన్నాడు ప్రవీణ్తో.
 
ప్రవీణ్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి,
"సార్ శశిధర్ కళావతి ఇంట‌్లో కి వెళ్ళి గాఢనిద్రలో, ప్రతిఘటించలేని స్థితిలో వున్న ఆమెను హత్య చేశాడు. అందుకోసం వాడిన ఆయుధాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో దాచాడు.. నేరం నా పైకి రావడానికి. మళ్ళీ కళావతి ఇంట‌్లో కి వెళ్ళి డెత్ కన్ఫర్మ్ చేసుకొని బయటకు వచ్చి అతని ఇంటికి వెళ్ళాడు.."
అనిఆగి యస్సై వైపు చూసి
"అంతే కదా సర్" అన్నాడు.
 
యస్సై దీర్ఘంగా ఆలోచిస్తూ ' కరెక్టే.. కానీ నువ్వు పెట్టిన సీసీ కెమెరాలు బయట ఎక్కడా కనిపించలేదు. ఎందుకలా కనిపించకుండా పెట‌్టావ్' అని అడిగాడు.
"మన టౌన్లో రెండు మూడు చోట‌్లోనే ఉన్నాయి సర్. అవి కూడా పబ్లిక్ ప్లేసుల్లో.. అలాంట‌ది నా ఇంటి ముందు పర్సనల్గా నేనే ఏర్పాటు చేసుకున్న అంటే జనాలు నవ్వి పోతారని... అది ఇంకా మనవాళ్ళకి అలవాటు కాలేదు కదా సర్ అందుకే ఎవరికి తెలియకుండా ఉంచాను" అంటూ నసిగాడు ప్రవీణ్.
 
'అవునా? సరే.' అని కానిస్టేబుల్స్ వైపు తిరిగి 'మీరెళ్ళి శశిధర్ ని జీపెక్కించండి. అలాగే ఆ ఎవిడెన్స్ ను కూడా. అదే తులసి కోట‌లోని కత్తిని. నేను ఈ వీడియోను నా మెమరీ కార్డ్ లోకి ఎక్కించుకునివస్తా' నన్నాడు మెమరీ కార్డ్ ప్రవీణ్ కు ఇస్తూ.
ప్రవీణ్ కార్డ్ రీడర్లో మెమరీ కార్డ్ ఉంచి, కంప్యూటర్ కి కనెక్ట్ చేసి వీడియోను కావాల్సినంత సెలక్ట్ చేసే పనిలో పడ్డాడు ఉత్సాహంగా.
 
యస్సై, ప్రవీణ్ ను తీక్షణంగా చూస్తూ "ప్రవీణ్.. నేరం చేసిన వాడికంటే, నేరానికి ఉసిగొల్పిన వాడికే శిక్ష ఎక్కువ ఉంటుంది. ఆ విషయం తెలుసా?"అన్నాడు.
"తెలుసు సార్. నాకెందుకు చెబుతున్నారు" కంప్యూటర్ లో పని చూస్తూనే బదులిచ్చాడు ప్రవీణ్.
"ఏం లేదు... ఈ హత్య మోటివేట‌్ చేయడం వల్ల జరిగిందని నా అనుమానం"
ప్రవీణ్ సన్నగా నవ్వాడు.
ఎడిట‌్ చేసిన వీడియోను మెమరీ కార్డ్ లోకి సెండ్ చేసి, కార్డ్ తీసి యస్సై కి ఇస్తూ
"మీరు మీ సెక్యూరిటీ అధికారి బ్రేయిన్ తో అతిగా ఆలోచిస్తున్నారు సర్. మీరు ఊహించినట‌్టు ఏం జరగలేదు ఇక్కడ" అన్నాడు ప్రవీణ్.
"నేనేం ఊహిస్తున్నానో నువ్వెలా చెప్పగలుగుతున్నావ్....
ఇక్కడ జరిగిందే నేను ఊహిస్తున్నా. కానీ ఊహలను సాక్ష్యాధారాలు గా న్యాయస్థానం అంగీకరించదు. ఇక్కడ నేరానికి ప్రేరేపించారని , ప్రేరేపించిన వాడికి మాత్రమే తెలుసు. వాడే సాక్షి. వాడంతట‌ వాడు నేరాన్ని అంగీకరిస్తేనే శిక్ష పడుతుంది. కానీ వాడు అంగీకరించడం జరగదు. కాబట‌్టి అసలు నేరస్థుడికి కాకుండా అమాయకుడికిశిక్ష పడుతుంది. నేరస్తులు చట‌్ట‌ం, సెక్యూరిటీ ఆఫీసర్ల బారినుండి తప్పించుకోవచ్చు. కానీ తన అంతరాత్మ నుండి తాను ఎప్పుడూ తప్పించుకోలేడు.. ఎప్పుడో ఒకప్పుడు అదితప్పకుండా శిక్షిస్తుంది. బీ కేర్ ఫుల్.."అంటూ ఇంట్లో నుండి గుమ్మం వైపు నడిచాడు.
 
ప్రవీణ్ కు అంతరాత్మ గురించో, ఆకుకూర గురించో ఆలోచించే టైం లేదిప్పుడు.
మునుపటిలా చందనను ప్రేమించాలి. చందన తనను ప్రమించేలా చేసుకోవాలి. అదే ఇప్పుడు తన లక్ష్యం..
.
 
హత్యారచన ముగిసింది.
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 29-08-2022, 07:46 PM
RE: ఆకాశంలో సగం - by Tammu - 02-09-2022, 08:39 PM
RE: ఆకాశంలో సగం - by Manoj1 - 02-09-2022, 11:36 PM
RE: ఆకాశంలో సగం - by Chutki - 03-09-2022, 07:20 AM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:32 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:46 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:47 PM



Users browsing this thread: 2 Guest(s)