03-09-2022, 02:46 PM
హత్యా రచన
జి కృష్ణ
మళ్ళీమళ్ళీ చూడాలన్పించే అందం చందన సొంతం.
ఐదు అడుగుల ఎత్తు, ఎత్తుకు తగిన బరువు.
చక్కని ముఖవర్ఛస్సు.తన వయసు ముప్ఫై రేండేళ్ళు కానీ ఇరవై రెండేళ్ళ అమ్మాయిలా కనిపిస్తుంది.
ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మరు..
ఎంత అందమో అంత మంచి వ్యక్తిత్వం..
వందమందినైనా నడిపించగల చలాకీతనం, మాటలో నేర్పు కలిగింది..ఆ ఎర్రని పెదవులపై చిరునవ్వు చెదరడం ఎవరూ చూసుండరు.
తనున్నచోట వాతావరణం అంతా ఆహ్లాదంగా తోస్తుంది ఎవరికైనా.
అలాంటి అమ్మాయిని బాధించాలని కూడా ఎవరికీ అనిపించదు కాని ప్రవీణ్ కి మాత్రం ఆమెను చంపాలన్నంత కోపం, ద్వేషం కలిగింది.
పరాయి స్త్రీ గా అలాంటి అమ్మాయి ఏ తప్పు చేసినా క్షమించే వాడే.. కాని తనకు భార్యగా ఉన్న స్త్రీ ఆ తప్పు చేయడాన్ని తప్పుగా కాకుండా ద్రోహంగా భావించాడు. అందుకే సహించలేకపోయాడు..
చంపాలన్నంత కోపం కలిగింది..
చావాలన్నంత విరక్తి తనపై ,తన జీవితం పై కలిగింది.
తనని చంపి, తానూ చావాలని కూడా అనుకున్నాడు.
కానీ తన ఇద్దరు పిల్లల నవ్వులు చూసి, తను గానీ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ పసి పిల్లల మొహంలో ప్రవేశించే విషాదాన్ని తలుచుకొని ఆ ప్రయత్నాలు వదిలేశాడు..
చందనచేయాలనుకున్న తప్పును వాయిదా వేయించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసంకష్టమైనా తన బార్యా పిల్లల్ని కొంతకాలం వాళ్ళ అమ్మగారింటికి పంపాడు. రిటైర్మెంట్ తీసుకుని ఇంట‌్లో ఉండే తన బార్య తల్లిదండ్రులే సరైన కాపాలాదారులు అనుకున్నాడు.కూతుర్ని ఎంత ప్రేమించినా పెళ్ళయ్యాక తప్పు చేస్తుందంటే ఏ తల్లిదండ్రులూ సహించరు..
అందుకే లేని మద్యం అలవాటు తెచ్చిపెట్టుకుని తాగుబోతులా నటిస్తూ చందనను చిత్ర హింసలు పెట‌్టి, తనంతట తాను వాళ్ళమ్మ గారింటికి వెళ్ళేలా చేశాడు.
అప్పటినుంచీ తాగుడే లోకం అయింది తనకు.
బయటకు చెప్పుకోలేని బాధను మందు కొట‌్టి మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మద్యానికి ఒక మహాత్మ్యం ఉంది.
అదేంటంటే తాగితే మర్చిపోవాలన్న విషయాన్ని తప్ప అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది.
ప్రవీణ్ విషయంలో కూడా అదే జరిగింది..
బార్యా పిల్లల సోయీ, ఇంటి సోయితో పాటు ఓంటి సోయి కూడా మర్చిపోయాడు.
మూడు నెలలుగా కటింగ్ షేవింగ్ లేదు..
ఏ రెండు రోజులకో ఒకసారి స్నానం చేయడం.
ఎప్పుడూ మాసిపోయిన డ్రెస్ లతో ఊరంతా తిరుగుతూ ఉండడమే..
జనాల్లో మద్యం కోసం ఎంత పనైనా చేసే ఒక తాగుబోతు లా తయారయ్యాడు.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ టైంపాస్ కు పనికొచ్చే జోకరతను..
అవారా గాడు, సంసారం యావ లేనోడు..
పనికి మాలిన వెధవ. అబద్దాల కోరు.
చులకన చూపులు, హేళనలు నిత్యకృత్యం అయ్యాయి రోజువారి జీవితంలో..
తోటివారి పలకరింపులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి..
ఇప్పుడు తను ఒంటరివాడు..
ఇలాంటి ఒంటరి తనంలో కూడా శశిధర్ రూపంలో ఒక ఫ్రెండ్ ను నిలుపుకున్నాడు. ఇద్దరు కలిసి నిలుపుకున్నారు అంటే బాగుంటుందేమో.. అలా నిలిపి ఉంచుకోవడానికి ఎవరి స్వార్థం వారిది..
ప్రవీణ్ పూటుగా తాగి పడిపోయినప్పుడు శశిధర్ తనని ఇంటికి తీసుకెళ్తాడు. తాగినమైకంలో ప్రవీణ్ఏదైనా తప్పు చేస్తే అందరికీ సర్ది చెప్తాడు.
శశిధర్ చెప్తే ఊర్లో తిరుగుండదు.
ఊర్లో అందరికి మంచిచెడులకు అందుబాటులో ఉంటాడు.దుందుడుకు స్వభావం కలవాడిగా పేరు..
ల్యాండ్ సెటిల్మెంట‌్ లు చేయడం లో దిట‌్ట..
తన్నడానికైనా, తన్నించుకోవడానికైనా సిద్దంగా ఉంటాడు.
ఇలాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు అతన్ని లోకల్ పొలిటిషియన్ గా మార్చేశాయి..
అలాగని శశి మొరటుగా ఉంటాడు అనుకోకండి..
ఆరడుగుల పొడుగు, తగిన బరువుతో ఆజానుబాహుడిలా ఉంటాడు.. చంద్రుడి వంటి మొఖంతో అచ్చం హీరోలా పదిమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు..
అతని నవ్వుకు పడిపోని యవతి లేదు ఆ ఊర్లో..
కాని తను మాత్రం తనకు నచ్చిన అమ్మాయినే దగ్గరకు రానిస్తాడు.
ఒక స్త్రీ నచ్చిందంటే ఆమె పొందుకోసం ఎంతవరకైనా వెళతాడు..
అతని పొందుకోసం అమ్మాయిల ను ఎంత దూరం అయినా రప్పించగలిగే చతురత అతని మాటల్లో ఉంటుంది..
ఆ చతురతకే....
ఆ అందానికే...
ప్రవీణ్ బార్య చందన కూడా పడిపోయింది..
అతనికోసమే హైదరాబాదులో ఉన్న కాపురాన్ని ప్రవీణ్ తో పోరి ఊర్లోకి మార్పించింది..
ఆ విషయం తెలిసిన మరుక్షణం అతనికి ఆవేశం కట్టలు తెంచుకుంది. నేను మోసపోతున్నాననే బాధ అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. ఇన్నాళ్ళూ జాబ్ మీద ప్యాషన్ తో బార్యాపిల్లలను పట‌్టించుకోలేదు.
ప్రొఫెషన్లో ఉండే కిక్ వెనుక పడి అందమైన బార్యను నిర్లక్ష్యం చేశానని కుమిలి పోయాడు.
ముందు చందనను మునుపటి లా ప్రేమించి, తనను ప్రేమించేలా చేసుకోవాలి...
అందుకు కొంత టైమ్ కావాలి..
అప్పటివరకూ ఇద్దర్నీ ఇంకా దగ్గర కాకుండా దూరంగా ఉంచాలి...
అందుకే చందనను తల్లి గారింటికి పంపి తాను తాగుడుకి బానిసలా మారాడు..
ఎంత తాగినా శశిని అనుదినం గమనిస్తూ ఉండడానికి అతనితో ప్రవీణ్ అంటిపెట‌్టుకుంటూ ఉన్నాడు..
చందనను ప్రవీణ్ మల్లీ తీసుకొని వస్తే ఉపయోగంగా ఉంటుందని ప్రవీణ్తో స్నేహం నటిస్తున్నాడు శశీధర్.
అందుకే తన బాబాయ్ బార్య కళావతితో ప్రవీణ్ ఎంత గొడవ పడినా పట‌్టించుకోనట‌్టు ఉంటున్నాడు..
నిజానికి కళావతి మీద తన పిన్నీ అనే ఆపేక్ష ఏం లేదు శశిధర్కీ. కళావతికి పిల్లలు లేరు. భర్త ఎప్పుడో మరణించాడు.ఆమే చస్తే తనకున్న ఆస్తి మొత్తం శశిధర్ వశమవుతుంది..
అంతకంటే గొప్ప అనుబంధం ఏం లేదు ఆమెతో..
ఆ ఆస్తి కళావతికి హక్కు గా వచ్చిందేం కాదు. ప్రవీణ్ వాళ్ళ నాన్నను తన అందచందాలతో బుట‌్టలో వేసుకొని, వారికున్న ఆస్తినంతా అప్పనంగా తన పేరు మీద రాయించుకుంది..
దాని ప్రభావం ప్రవీణ్ కుటుంబ ఆర్ధిక పరిస్థితి మీదకంటే ప్రవీణ్ ఆమ్మగారి మీద ఎక్కువ చూపించింది..
' భర్త తనను ప్రమించేలా, ఆకర్షించేంతగా లేనే' అనీ, కనీసం సాదింపు పనులతోనైనాఅదుపు చేయలేక పోతున్నాననే బాధతో తనలో తానే కమిలిపోయి మంచం పట‌్టి చనిపోయింది..
ఆ తర్వాత రెండో ఏటనే వాళ్ళ నాన్నగారు కూడా మరణించారు.
ఇదంతా పది సంవత్సరాల క్రితం జరిగింది.
అందరూ మర్చిపోలేదు గాని మరుగున పడిపోయింది.
ఇన్ని సంవత్సరాల తర్వాతపూటుగా తాగిన మైకంలో మళ్ళీ తిరగతోడుతున్నాడు ప్రవీణ్..
"నా ఆస్తి అంతా దొబ్బి తింటున్నవ్ కదే తిరుగుబోతు దాన" అంటూ ప్రతీ రాత్రి కళావతి తో గొడవకు దిగుతున్నాడు.
కొంత కాలం అందరూ విననట‌్టు ఉన్నా ,ప్రవీణ్ ప్రవర్తన మితిమీరుతుంటే ఒక్కొక్కరూ అడ్డు చెప్పడం మొదలైంది..
తాగిన మైకంలో కళావతి ని చంపడానికి కత్తితో రాత్రంతా ఇంటి మీదకు పోయిన రోజులు ఉన్నాయి.
పక్క పక్కనే ఇళ్ళు అవడంతో ఏ రాత్రి ఏం చేస్తాడోఅని నలుగురు మనుషుల్ని కాపలా పెట‌్టుకొని కంటిమీద కునుకు లేని రాత్రిళ్ళు ఎన్నో గడిపింది కళావతి..
రాత్రంతా తాగి కళావతి మీద తైతక్కలాడ్డం ఉదయమే పెద్దలలో ఆమెకు క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారింది.ఆడదాన్ని క్షమాపణలు అడిగే అసమర్దుడిగా, రోషం లేని మగాడిగా ముద్రవేయించుకున్నాడు.
ఊరు ఊరంతా ఒకటే ఫిక్స్ అయిపోయారు,
ఎప్పటికైనా కళావతి ప్రాణాలు ప్రవీణ్ గాడి చేతిలోనే పోతాయని.....
ఇవన్నీ తెలుసుకుంటున్న చందనలో ఏ చలనం లేదు.. అల్లుడి తీరు అర్థం కాని ప్రవీణ్ మామగారు ఎన్నోసార్లు స్వయంగా వచ్చి, కూతురిని తెచ్చుకో, లేదా మాతో పాటు ఉండడానికి రమ్మని అడిగి చూశాడు. ఊరి వాళ్ళతో అడిగించాడు కూడా..
వారిలో శశిధర్ ఒకడు.
ప్రవీణ్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోయే సరికి వెనుదిరిగి పోవడం తప్ప మరేమీ చేయలేక పోయాడు.....
కానీ ఈ సారీ వాళ్ళ మామగారు ఒక స్థిరమైన నిర్ణయంతోనే వచ్చారులా అనిపించింది..
"అయ్యా ప్రవీణూ.. పది నెలలుగా ఒంటరిగానే ఉంటున్నావు. నీ పిల్లల్ని అయినా చూడాలి అనిపించట‌్లేదా.. ఇన్నాళ్ళూ హైదరాబాదులో ఉండి సంపాదించుకున్న పేరును, ఈ పది నెలల్లో రోజు రోజుకూ దిగజార్చుకున్నావు.. మగాడు ఉన్నతంగా జీవిస్తేనే స్త్రీలు చెప్పు చేతుల్లో ఉండరు బాబూ.. అలాంటది నువ్వు ఇలా పది మందిలో పలుచన అయితే ఎలా చెప్పు..
అంతా ఆలోచిస్తే నా గుండెలో రాయి పడ్డట‌్టు అనిపిస్తుంది..
నా కూతురు తప్పు చేస్తే నువ్వు ఇలా అయ్యావా?
నువ్వు ఇలా తయారయ్యావని నా కూతురు తప్పు చేస్తుందా? వాస్తవం తెలుసుకొని తట‌్టుకునే శక్తి మా ముసలి గుండెలకు లేదయ్యా.." అంటూ భోరున ఏడ్చాడు చిన్నపిల్లాడిలా..
మామయ్యకి అంతా అర్థం అయ్యిందనిపించింది.
అతని పక్కన కూర్చుని ఊరుకోమన్నట‌్లుగా భుజం తడుతూ " శశిధర్ తరుచూ వస్తున్నాడా మామయ్య" అని అడిగాడు..
ఆందోళన పడిపోతూ "తరుచూ కాదు బాబూ..
మొన్ననే మొదటిసారి చూశాను. అదే చివరి సారీ...
నేనూ మీ అత్తయ్య ఎప్పుడూ బయటకు వెళ్ళం..
ఆ రోజు చందన
'ఎంతకాలం ఇలా ఇంట్లోనే ఉంటారు నాన్నా..
మన చుట‌్టాల ఇంట్లో శుభకార్యం ఉందిగా...
రెండు రోజులు వెళ్ళి రండి..
కొంచెం రిలీఫ్ గా ఉంటుంది' అని బలవంతం చేస్తే బయలుదేరాం. ఆటో ఎక్కి ముందుకు కొద్ది దూరం పోగానే శశిధర్ బండి పై ఎదురయ్యాడు...
అతనా కాదా అని ఆటో ఆపి దిగి చూస్తే బండి నేరుగా మన ఇంట‌్లోకే వెళ్ళింది..
వెనుకకు తిరిగి ఇంటికివెళ్ళి చూస్తే ఇద్దరూ అభ్యంతరకర రీతి లో మాట‌్లాడుకుంటున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేక పోయా..
అంతే...
ఈ చావుదలకు వచ్చిన వయసులో ఒక్కగానొక్క కూతురి వివాహ జీవితం నాశనం అయితే చూసి తట‌్టుకోగలమా? "
కంటిలో నుండి ఏకధాటిగా కారుతున్న నీళ్ళను తుడ్చుకుని మళ్ళీ చెప్పాడు.
పెళ్ళయిన దంపతుల్లో ఒకరు, పరాయి వాళ్ళ నుంచి సుఖం ఆశిస్తున్నారంటే... ఇంకొకరు జీవిత భాగస్వామిగా నిర్వర్తించవలసిన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించనట‌్టే..తప్పు ఎవరిదున్నా సరిదిద్దుకొని మళ్ళీ కలిసి జీవించాలి.
మా ముసలి వాళ్ళ కోసం కాకపోయినా అభంశుభం తెలియని మీ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఒక్కటి కండి..
కావాలంటే నీ కాళ్ళు పట్టుకునిమొక్కుతా" అంటూ కాళ్ళమీద పడబోతున్న మామయ్యను ఆపి
"నేను అనుకుంది జరిగే సమయం వచ్చింది మామయ్యా.. త్వరలోనే నేను చందనను, పిల్లల్ని ఇంటికి తెచ్చుకోవడానికి అక్కడికి వస్తాను.. మీరు నిశ్చింతగా వెళ్ళండి" అని చెప్పి బస్స్టాండ్ దాక దిగబెట్టాడు..
అక్కడి నుండి నేరుగా వైన్స్ కు వెళ్ళి అందరూ చూస్తుంటే ఫుల్ బాటిల్ మందు తీసుకుని ఇంటికి వచ్చాడు..
బాటిల్ ఓపెన్ చేసి ఒక గ్లాస్ లో కొద్దిగా వంపుకొని
దానిని పైకెత్తి స్మెల్ చూశాడు..
"ఛీ ఛీ.. కంపుకొడుతుంది..సీసాలు సీసాలు ఎట‌్లా తాగుతున్నారు రా బాబూ " అంటూ కింద పెట‌్టేశాడు.
బాటిల్ తీసుకొని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి అందులోంచి సగం పైగా లిక్కర్ ని బేసిన్ లో వంపేశాడు. మిగిలిన దాన్ని పక్కన పెట్టి సిస్టమ్ ముందు చెయిర్ లో కూర్చున్నాడు..
అందులో సీసీ కెమెరాల లైవ్ వీడియోలు చూసి, నైట‌్ టైమ్ లో క్యాప్చర్ చేసిన వీడియోలను కూడాఒకసారి చెక్ చేసి సంతృప్తిగా టేబుల్ పై రెండు చేతులతో దరువేశాడు..
"అమావాస్య నడిరేయి దీపాలు లేని వేళ కూడా కళావతి ఇంటికి వచ్చేదెవరో ఈజీ గా తెలిసి పోతుంది" అనుకున్నాడు..
ఈ అంతటికీ గంటన్నర సమయం పట‌్టింది..
మరో గంట ఆగి శశికి ఫోన్ చేశాడు..
ఎప్పటిలా ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదు..
పది నిమిషాల తరువాత మళ్లి చేసినా జవాబు లేదు..ఐదు నిమిషాల తరువాత మళ్లి ట‌్రై చేసినా అవతలి నుంచి ఫోన్ సమాధానం లేదు.
అరగంటలో మొత్తం పది కాల్స్ చేస్తే అప్పుడు లిఫ్ట్చేశాడు శశిధర్.
"ఏంటన్న బిజీగా ఉన్నప్పుడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తే ఎలా చెప్పు" కొద్దిగా అసహనాన్ని కనబరుస్తూ మెల్లగా, మెత్తగా మందలించాడు..
ప్రవీణ్ నోట్లో పెన్ క్యాప్ ఉంచుకుని
" అన్నయ్యా.. ఒక క్వార్టర్ ఇప్పించవా ప్లీజ్..." అని ధీర్ఘం తీస్తూ రిక్వెస్ట్ గా అడిగాడు..
మాటల్లో తేడా గమనించి "ఆల్రెడీ తాగినవ్ కదరా..
ఇంకేం చాలు గాని ఆపు..." అన్నాడు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ