Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కధలు
#2
ఎందుకు ఆలా అనుకుంటున్నారు ?? ఆడదాన్ని, అశక్తురాలిని, అబలను అనేగా. ఆడదాని శక్తి యుక్తుల ముందు అస్సలు  మీరెంత మీ బలగమెంత?? ఒక మగువ తలుచుకుంటే రాజ్యాలేలగలదు. శ్రీకృష్ణుడంతటి వాడికే నరకాసురుని చంపడానికి సత్యభామ అవసరం అయ్యింది. శివుని విల్లుని ఆ సీతమ్మ ఎత్తి, అది ఎత్తగలిగిన రాముడిని పెళ్లాడింది. దేవదేవుళ్లే ఆడదాని ముందు మోకరిల్లారు ఇక మీరెంత?? అయినా  నా నెట్వర్క్ పక్కన పెట్టండి. మీ నెట్వర్క్ మీకుంది కదా. అదే దమ్ము మీకు ఉంటె, 24 గంటల్లో నన్ను పట్టుకోండి లేదా ఇంకెప్పుడు నన్ను పెట్టుకోలేరు” అని గట్టిగా నవ్వింది రుద్రా
“నోరుముయ్యి, యు బిచ్, నాటకాలాడుతున్నావా ?? నువ్వు చెప్పిందల్లా చెయ్యడానికి నువ్వేం నా ఉంపుడుగత్తేవ ??” అని ఫైర్ అయ్యాడు సూర్య.
రుద్రా కాల్ కట్ చేసింది.
ఈ లోపు ఆ 15 మంది ట్రాక్ రికార్డ్స్ చెక్ చేసారు సెక్యూరిటీ ఆఫీసర్లు. అందరి మీద కేసులు ఉన్నాయ్, కానీ అందులో ఉన్న కామన్ పాయింట్ ఆడది. వాళ్లంతా అమ్మాయిలపై అకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడ్డ వారే. ప్రేమించలేదని ఆసిడ్ పోసిన వాడి దగ్గర నుండి అమ్మాయిలను విదేశాలకు అమ్మేసే బ్రోకర్లు, రేప్ చేసి చంపేసిన వెదవల దాక ఉన్నారు.
ఈ 15 మందే కాదు, ఆమె ఇచ్చిన 450 మందికి ఇలాంటి నేర చరిత్రే ఉంది. కానీ వాళ్లెవరు జైళ్లలో లేరు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు కారణాలు చాలానే ఉన్నాయ్. మన రాజ్యాగంలో ఉన్న లొసుగులు, చట్టాల్లో బొక్కలను ఉపయోగించుకుని బయట తిరుగుతున్నారు.
అప్పటికి కానీ అర్ధం కాలేదు సూర్యకి ఆమె అజెండా ఏమిటో.
ఇంతలో టీవిలో న్యూస్ కిడ్నపైన పన్నెండు మంది దారుణ హత్యకు గురయ్యారని వారి శరీరాలపై ఆకాశంలో సగం - రుద్రా” ఆన్నా లేఖ ఉందన్నా” వార్త మళ్ళి రాష్టాలను కుదిపేసింది. స్వయంగా హోమ్ మినిస్టరే రుద్రతో మాట్లాడాలనుకుంది.
ఆలా ఒక గంట తరువాత రుద్రా ఫోన్ చేసింది
“సార్ ఎలా ఉంది నేనిచ్చిన బహుమతి??” అని అడిగింది రుద్రా పైశాచికంగా నవ్వుతు.
టెంపర్ లాస్ అయినా సూర్య "ఏయ్ నువ్వు అస్సలు ఆడదానివేనా?? మనుషులను పిట్టల్ని చంపినట్టు చంపుతున్నావ్?? నువ్వు నాకు దొరికిన రోజు నిన్ను నీ చావు ఇంతకన్నా గోరంగా ఉంటుంది రాసిపెట్టుకో" అని తిడ్తున్న అతని చేతిలోనుండి రిసీవర్ లాక్కుంది మందిర 
“రుద్రా నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న. మీ అజెండా నాకు అర్థమైంది. ఒక మహిళగా నువ్వు చేస్తోంది సమర్థిస్తాను కానీ ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ గా మాత్రం నేను సమర్ధించలేను. నువ్వు చేస్తోంది తప్పు, వాళ్ళని వదిలి లొంగిపో, నేను హామీ ఇస్తున్న నీ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టనివ్వను” అని అన్నది మందిర.
“నా ప్రాణానికి హామీ మీరే కాదు మేడం, ఆ దేవుడు కూడా హామీ ఇవ్వలేడు?? అయినా సరే, మీరడిగినట్టే చేస్తా కానీ ఇప్పుడు కాదు, నేను చెప్పింది మీరు చేసాక” అని అన్నది రుద్రా స్థిరంగా.
“ఆలా అమాయకులను చంపడం, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం??” అని అడిగింది మందిర తీవ్ర స్వరంతో
“అమాయకుల? ఎవడు మేడం?? నేను చంపినా 12 మందిలో ఏ ఒక్కడు కూడా మనిషి కాదు, జనారణ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నా మానవమృగలు. అభం, శుభం తెలియని ఆడపిల్లల్ని, మేకపిల్లల్ని అమ్మినట్టుగా అమ్ముతుంటాడు ఒకడు. ఆ ఆడపిల్లలకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చి, 9 ఏళ్ల పిల్లని కూడా పెద్దమనిషిని చేసి, ప్రాస్టిట్యూటుగా మార్చి డబ్బులు దండుకుంటాడు, మరొక్కడు. వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి, వాడు పాడుచేసేదే కాకా ఫ్రెండ్లకి ప్రసాదం పంచినట్టు పంచి, అమ్మాయిని 6 నెలలుగా అత్యాచారం చేసేవాడు మరొక్కడు” అని అంటున్న రుద్రా గొంతు జీరా పోయింది.తిరిగి ఆమె “ఈ12 మందే కాదు 450 మందికి కూడా ఇలాంటి చరిత్రే ఉంది. మీరు వదిలిపెట్టిన, వాళ్ళను నేనొదిలిపెట్టను. ఒక్కొక్కడిని వెతికి, వేటాడి, వేంటాడి చంపుతాను. ఆడదాని ప్రాణంతో, మానంతో ఆటలాడే ప్రతి ఒక్కడిని, వంతుల వారీగా లెక్కలేసి మరి చంపుతాను” అని గట్టిగా పళ్ళు కొరుకుతూ చెప్పింది రుద్రా.
“రుద్రా నేను అర్ధం చేసుకోగలను. కానీ మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం, కొన్ని చట్టాలు చేసుకున్నాం. వాటిని మనం మన చేతుల్లోకి తీసుకోలేము. నా మాట విను, కచ్చితంగా ఆ క్రిమినల్స్ అందరికి శిక్ష పడేలా నేను చూస్తాను” అని అంటున్న మందిర మాటను పూర్తికాకుండానే
రుద్రా "శిక్ష..... శిక్ష?? ఒక అమ్మాయిని సాక్షాత్తు రాజధానిలో నగరమంతా తిప్పుతూ అత్యాచారం చెయ్యడమే కాకా ఆమె ప్రాణాలుపోడానికి కారణమైన వాడిని, వయస్సు తక్కువని 3 సంవత్సరాల జైలు శిక్ష వేసి, బయటకి పంపడమా మీరు వేసే శిక్ష. 17 సంవత్సరాల అడ్డగాడిద అత్యాచారం చేస్తే, వాడు బాలుడా?? ఇదేనా మీరు చెయ్యబోయే న్యాయం. ప్రేమించలేదని అమ్మాయి మొహం మీద ఆసిడ్ పోస్తే, ఈవ్ టీసింగ్ కేసు కింద FIR రాసి, వాడిని మూడు నేల్లకే వదిలేయడమా, మీరు చేసే చట్టం?? మీరు చెప్పిన అదే సమాజంలో తప్పుచేసిన వాడు తలెగరేసి తిరుగుతుంటే, ఆ తప్పుకు బలైపోయిన ఆ అమ్మాయి మాత్రం, మొహానికి ముసుగేసుకుని, అవమానాలను భరిస్తూ, ఆ మచ్చను జీవితాంతం మొయ్యాలి. అలంటి అమ్మాయిలకు జరిగిందా మీరు చెప్పిన న్యాయం?? సగటున ప్రతి పదిమంది అమ్మాయిల్లో, ఇద్దరమ్మాయిలు ఇలాంటి అకృత్యాలకు, అఘాయిత్యాలకు బలవుతున్నారంటే మీరు పుట్టించాల్సింది 'చట్టాలు' కాదు, తప్పు చెయ్యాలనే ఆలోచన వచ్చిన ప్రతి మగవాడి ఒంట్లో 'భయాన్ని', చంపాల్సింది ఈ 'మృగాల'నే కాదు, ఆడపిల్లలకు న్యాయం జరగదనే 'అభిప్రాయా'న్ని” అని అంటున్న రుద్రా మాటల్లో నిజాన్ని గ్రహించింది హోమ్ మినిస్టర్ మందిర
“సరే నువ్వు అంటోంది నిజం కానీ నువ్వు అడుగుతోంది మా చేతుల్లో లేనిది?? ఎన్కౌంటర్ 450 మందిని ఒకేసారి చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలియంది కాదు. హ్యూమన్ రైట్స్ అని, కోర్ట్స్ అని మా నెత్తి మీద ఉన్నాయి కదా” అని అడిగింది మందిర.
“మీరేం భయపడకండి.  దీనికి కూడా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తానంటే వాళ్ళందరిది నాచురల్ డెత్ లాగా క్రెయేట్ చేయొచ్చు” అని అన్నది రుద్రాచెవిలో ఉన్న బ్లూ టూత్ ని సరిచేసుకుంటూ
“ఎలా?” అని అడుగుతున్న మందిర వైపు చూస్తూ సైగ చేసాడు సూర్య.
“నో మేడం ఇది చెయ్యడానికి మీరు ఒప్పుకుంటున్నారా ?? “ అని అడిగాడు
“ విందాం ఎం చెప్తుందో" అన్నట్టుగా సైగ చేసింది మందిరపక్కనే ఉన్న గ్లాస్ లోని నీళ్లు రెండు గుటకలు వేసి
రుద్రా “సింపుల్ మేడం వాళ్ళను షూట్ చెయ్యడమో లేక కత్తితో చంపడమొ కాకుండా నేను చెప్పే ఒక డ్రగ్ కంపొజిషన్ మెడ వెనక భాగంలో ఇంజెక్ట్ చెయ్యండి అంతే హార్ట్ ఎటాకనో, లేక కార్డియాక్ అరెస్టనో అంటారు. పోస్ట్ మార్టంలో కూడా కనిపెట్టలేరు” అని అన్నది చైర్లో వెనక్కి వాలి కూర్చుంటూ
“బ్రిలియెంట్, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకుని చెప్తాను. ఒక అరగంట తరువాత ఫోన్ చెయ్యి” అని మందిర పెట్టేసింది
“మేడం ఏంటిది ?? ఆమె చెప్తోంది మనం చెయ్యలేం. అది మీకు కూడా తెలుసు” అని అన్నాడు సూర్య
“ఐనో ఎవరిథింగ్ సూర్య. నేను వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చెక్ చేయించాను. ప్రతి వాడు క్రిమినలే. అలంటి వాళ్ళు చచ్చిన దేశానికి వచ్చిన నష్టంమేమి లేదు. పైగా అలంటి వాళ్ళని చంపితే అలంటి మృగాళ్లకు కూడా బుద్దొస్తుంది, ఆలోచించండి. మనకు ఆమె చెప్పినట్టు, చెయ్యడం తప్ప మరొ మార్గం లేదు. అవసరమైతే నేను సీఎంతో మాట్లాడతాను మీరు ఆ పనిలో ఉండండి.” అని అంటూ "అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, ఫైల్ నా టేబుల్ మీదకి పంపించామ"ని ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోయింది.
సూర్య మెల్లిగా లేచి నిలబడ్డాడు. "చెప్పండి టీం, ఏంచేద్దాం. మీ అభిప్రాయాలూ చెప్పండి"  అని అడిగాడు.
"సర్, రాజకీయ వత్తిళ్లకు లొంగి, పై అధికారుల మాటలకూ దడిచి మా డ్యూటీ మేము చెయ్యలేదు. కానీ ఇప్పుడు మనల్ని ఆపె వాళ్లే లేరు." అని అన్నది ఒక లేడీ SI
"లేదు సర్ దీనివల్ల మనం చాలా సమస్యలు ఎదురుకోవాలి. ఈ నిజం బయటకి వస్తే  మన తప్పు లేకున్నా ట్రాన్స్ఫర్లు చేస్తారు, సస్పెండ్ చేస్తారు ఒక్కోసారి ఉద్యోగమే పోవచ్చు. అప్పుడు మనం మన ఫామిలీస్ తో రోడ్డుపైకి వస్తాం" అని అన్నాడు మరో SI
"అమ్మాయిల పై అఘాయిత్యాలకు పాల్పడే వారిని మనం ఎం చేయగలిగాము సర్? నాకు 13 ఏళ్ల  అమ్మాయి ఉంది. అది రోజు స్కూల్కి సిటీ బస్సులో వెళ్లివస్తోంది. ఒకడు ఆమె చెప్పుకోలేని చోట గోర్లు దిగేలా గాయం చేస్తే, వచ్చి చెప్పుకుని ఏడ్చింది. కానిస్టేబుల్ ఐన నేనే కేసు పెడితే, వాడు ఒక 'రౌడి'.  కేసు వాపసు తీసుకోకపొతే మా ఇంట్లో ఆడవాళ్ళని బజారులో చూసుకుంటానని బెదిరించాడు. ఏమి చెయ్యలేని నిస్సహాయత కేసు వాపసు తీసుకున్నను. సెక్యూరిటీ ఆఫీసర్ కూతురుకే న్యాయం జరగకపోతే ఇక సామాన్య జనానికి ఎలా జరుగుతుంది ?? అప్పుడు నా బిడ్డ పడ్డ కష్టం చిన్నదయుండొచ్చు కానీ ఆమె మనసుకు తాకిన గాయం ఎప్పటికి మానదు. ఇప్పుడు అలంటి కుక్కలని వీధిలో నిలబెట్టి కాల్చే అవకాశం వచ్చింది" అన్నాడు ఆవేశంగా ఏడుస్తూ. అక్కడ అందరి కళ్ళు చెమ్మర్చాయి.
"ఈ ఆపరేషనులో ఎంతమంది నాతో ఎస్ అంటున్నారు" అని అడిగాడు సూర్య
అందరు చేతులు లేపారు.   
“టీంని అలెర్ట్ చెయ్యండి, అందరిని మనం చంపేస్తున్నాం. అండర్గ్రౌండ్ కాప్స్ కూడా ఇవాళ ఆన్ డ్యూటీలో ఉండమనండి. గంటకు 30 మంది చొప్పున 15 గంటల్లో పని పూర్తవ్వాలి. అప్పటిదాకా నో రిలాక్సేషన్” అని చప్పట్లు చరుస్తూ పని పురమాయించాడు సూర్య.
15 గంటలు గడిచేసరికి మొత్తం 450 మంది వివిధ ప్రాంతాలలో ఒకే విధంగా చచ్చారు. ఈ విషయం ఎక్కడ మీడియాలో రాలేదు. కారణం లేకపోలేదు. ఒక్క చిన్న క్లూ కూడా వాళ్లకు దొరకలేదు, దొరికిన చెప్పే ధైర్యం చెయ్యలేదు.
రుద్రా ఫోన్ చేసే సమయానికి పని పూర్తయింది. “చాలా థాంక్స్, సూర్యగారు. నాకు తెలుసు మీరు ఈ పని చేస్తారని” అని అన్నది.
'రుద్రా..... ఆ నలభై ఐదు మందిని విడిచి పెట్టి, ఇప్పటికైనా నువ్వు కూడా లొంగిపో" అని అన్నాడు సూర్య.
"సారీ సర్ 44 మందే ఉన్నారు, ఒక్కడిని ఆల్రెడీ చంపేసాను" అని అంటు రుద్రా లాప్టాప్ మూసింది
"ఎక్సపెక్ట్ చేశాను రుద్రా..... అస్సలు నువ్వు ఆ 45 మందిని ఎందుకు కిడ్నప్ చేసావో నాకు తెలుసు" అని అన్నాడు సూర్య
" మీరు ఉహించగలరని, అతడి సమర్థులని కూడా నాకు తెలుసు. వీళ్లంతా నేరాలు చేసినవాళ్ళే కానీ ప్రముఖులు, వారి పిల్లలు, బంధువులు వీళ్ళలో మీ డిపార్టుమెంటుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళను అడ్డంపెట్టుకుంటే నాకు రెండు పనులు జరుగుతాయి. ఒకటి వీళ్లకోసమైన నేను చెప్పింది మీరు చేస్తారు. రెండోది, నేను ఇచ్చిన లిస్టులో ఇలాంటి బిగ్ షాట్స్ ఉంటె మీరు వాళ్ళకి మినహాయింపు ఇస్తారు. అందుకే అలాంటోళ్ళనే ఏరి కోరి కిడ్నప్ చేశాను" అని అంది నవ్వుతు
"మరి వాళ్ళనేం చెయ్యబోతున్నావ్??" అని అడిగాడు సూర్య
రుద్రా ఏమి మాట్లాడకుండా మిన్నకుండిపోయింది.
"సరే చెప్పొద్దూ..... ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు, వీళ్లందరి డేటా నీ  దగ్గరకు ఎలా వచ్చింది?? నువ్వు ఎలా సంపాదించావు ?? నీకు ఎవరు సహాయం చేస్తున్నారు ?? ప్లీజ్ చెప్పు ??" అని అడిగాడు సూర్య
"తప్పు చేసిన వాడు చట్టం నుండి, న్యాయం నుండి తప్పించుకోవచ్చు కానీ వాడి 'కర్మ' నుండి తప్పించుకోలేడు. ఆ కర్మ 'నేనే'" అని చెప్పి ఫోన్ పెట్టేసింది రుద్రా.
ఆలా పెట్టేసిన గంట తర్వాత న్యూస్లో 45 మందిని కిరాతకంగా హత్య చేసారని న్యూస్ వచ్చింది. సూర్య బాధ్యత తీసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి, పదవికి రాజీనామా చేసాడు. "ఈ హత్యలు జరగడానికి కారణాలు ఏవైనా, ఈ కేసు సాల్వ్ చేయనందుకు నేనేమి బాధపడట్లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను" అని అన్నాడు సూర్య. 
 కేరళలో ఆకాసత్ పక్కుతి - రుద్రా అన్న లేఖతో పాటు 45 మంది కిడ్నప్ అయ్యారని వార్త చదివిన సూర్య, వెంటనే లేచి ఆకాశంవైపు చూస్తూ సెల్యూట్ చేసాడు.
రుద్రా ఒక పాడుబడ్డ బంగ్లా టెర్రస్ పై నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకుని, చీకటిలో వెలిగిపోతున్న నగరన్నీ చూస్తూ చిరునవ్వు నవ్వింది. 
 
సమాప్తం

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 10 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 29-08-2022, 07:46 PM
RE: ఆకాశంలో సగం - by Tammu - 02-09-2022, 08:39 PM
RE: ఆకాశంలో సగం - by Manoj1 - 02-09-2022, 11:36 PM
RE: ఆకాశంలో సగం - by Chutki - 03-09-2022, 07:20 AM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:32 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:46 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:47 PM



Users browsing this thread: 1 Guest(s)