29-08-2022, 07:36 PM
పరిణీత
నాన్న ని నేనెప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు ఫోటోలలో తప్ప. నాది మా నాన్న పోలికే అంటారు అమ్మ. ఆయనది రాజుల వంశమట. అమ్మని ఓ గుడిలో చూసి ప్రేమించి, ఇంట్లో నుండి పారిపోయి వచ్చేశారు.
పరువు పోయిందని, కన్న కొడుకునీ చూడకుండా ఆయన్ని కొట్టి చంపేశారట. అప్పటికే అమ్మ బొజ్జలో నేనున్నాను. తను చనిపోతానని తెలిసికూడా అమ్మని వదిలిపెట్టలేని వీర ప్రేమికుడు మా నాన్న. అలాంటి నాన్నకి పుట్టిన ఈ కూతురు ఎంత గొప్ప ప్రేమికురాలు అయ్యి ఉంటుంది.
అమ్మా నాన్న ప్రేమ నా నరనరాల్లో ఉందేమో. ఇంటర్చదువుతున్నప్పుడే అంటే ఇంకా తొలి యవ్వనపు ఛాయలు పోకుండానే ప్రేమలో పడిపోయాను. ప్రేమంటే ఏమిటో కూడా తెలియని వయస్సది. నాకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడిపోయాను.
అతను... అతను మరెవరో కాదు అక్షయ్. నాకు ఫిజిక్స్ చెప్పడానికి అమ్మ అతన్ని టూషన్ టీచరుగా పెట్టింది. నాకు తను చెప్పే ఫిజిక్స్ కన్నా మా మధ్య ఉన్న కెమిస్ట్రీ నాకు బాగా నచ్చింది.
తను పెద్ద అందగాడేమి కాదు .ఇంకా చెప్పాలంటే నాకన్నా పదేళ్లు పెద్ద. అయితేనేం అతనిలో నాకు నచ్చేది మరేదో ఉన్నట్టు అనిపించింది. ఏమై ఉంటుంది అనేది నాక్కూడా తెలియదు. ఎంత కోపం, చిరాకు వచ్చినా చెదరని చిరునవ్వు తన సొంతం. ఆ చిరునవ్వు, మొహమాటం , నెమ్మది తనం నన్ను ఆకర్షించాయేమో.
స్వతహాగా అల్లరి పిల్లని అయిన నేను అతని రాకతో ఇంకా అల్లరి చేయసాగాను. అమ్మ గారాలపట్టిని కదా అమ్మ నా చిలిపి చేష్టలను చూసి చూడనట్టు ఉండేది. ఆమెకూడా ఈ వయస్సును దాటే వచ్చిందిగా అందుకేనేమో మరి. అక్షయ్ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా.. మా ఎదురిల్లే. పాపం తనకి నాలాగే నాన్న లేరు. టుషన్ చెబుతూ అమ్మకు సాయంగా ఉంటున్నాడని తెలిసి ఇంకా దగ్గరయ్యాను.
బుద్ధావతారం అని కాలని ఆడపిల్లలు అతన్ని ఆటపట్టిస్తున్నా పట్టనట్టు పోతాడు.మా కాలని తల్లదండ్రులకు మాత్రం తనో ఇన్స్పిరేషన్. ఎంసెట్లోఅతనికి వచ్చినన్ని మార్కులు జిల్లాలో ఎవ్వరికీ రాలేదట. అతనిలా తమ బిడ్డలు రాంకు తెచ్చుకోవాలని ఆ పిచ్చి తల్లుల ఆలోచన.
మా అమ్మ మాత్రం అలా పిచ్చిది కాదు. నేను పాస్ అయితే చాలు అని పూజలు చేస్తుంది. మరి నేను కూడా అంతేగా ప్రేమను ఎక్కించుకున్న సులువుగా చదువును ఎక్కించుకొలేక పోతున్నాను.
మా అమ్మ కనిపెట్టక పోయినా అక్షయ్ వాళ్ళ అమ్మ కనిపెట్టేసింది నేను ఆమె కొడుక్కి బీటు వేస్తున్నాను అని. ముసల్ది కొడుకుని ఒక పెట్టెలో పెట్టీ తాళం వెయ్యమను. ఎప్పుడు వాళ్లింటికి వెళ్ళినా గుమ్మానికి అడ్డంగా నిల్చొని ఏం కావాలి అంటూ రాగాలు తీస్తుంది. అసలు మా పెళ్ళైయ్యాక ఈముసల్డాన్ని బయటకి తరిమేయ్యాలి. అయినా ఆలు లేదు సూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఎవడో. మా బుద్దవతారం ముందు నన్ను పెళ్ళి చేసుకోవాలి కదా.
ఏం తక్కువ నాకు. ముట్టుకుంటే మాసిపోయే తెల్లని మెనిచాయ. ఒకసారి చూస్తే తలతిప్పలేని సొగసు. ఎంతమంది ఇప్పటికీ నన్ను ప్రేమించానని చెప్పారో నాకే లెక్కలేదు. అలాంటిది ఈ బక్క పలచని ప్రాణి నన్ను చిన్నపిల్లలా భావిస్తాడు. నాకు వయసుంది. వయసుకు మించిన అందాలున్నాయని అర్ధం చేసుకోడే. ఎప్పుడూ చూసినా పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు... ఇవితప్పా వేరే ప్రపంచమే లేదే అతనికి.
నా అల్లరిని భరించే అతని గుణమే నన్ను ఆకర్షించేది ఏమో. అతనిలో నాకు దూరం అయిన మా నాన్న కనిపిస్తున్నాడేమో. తనికి నా మనసులో మాట చెప్పెయ్యాలి. ఒకవేళ తను నా ప్రేమను కాదంటే. నేనూరుకుంటానా... నేను మొండిదాన్ని. అతన్ని అంత సులువుగా వదిలి పెడతానా. అందుకే ఓ పథకం వేసాను.
అది హోలీ పండుగ రోజు. అతను తప్పక నాతో ఆడుకుంటాడు. నేను తనకి చిన్నపిల్లనే కదా. అందుకే ఓ మంచి ప్లాన్ వేసాను. అది సక్సెస్ అయితే మేము భార్య భర్తల మవుతాం. అవును నేను అదే చేశాను . హోలీ రంగుల్లో కుంకుమ కలిపాను. కాముడ్ని దహిస్తున్న అగ్ని సాక్షిగా అతను నా నుదుట కుంకుమ పులిమాడు. అతనిప్పుడు నా భర్త. అతను అనకూడదేమో ఆయన అనాలా.. పేరుపెట్టి పిలవకూడడు.. ఏమండీ అని పిలవాలా.. నా మీద నాకే నవ్వొస్తుంది.
మేడమీద ఒంటరిగా నిల్చుని నాలో నేనే మాపెళ్ళిని తల్చుకుని మురిసిపోతూ ఉంటుంటే ఆయన వచ్చారు.
"పరీ నీకో విషయం చెప్పాలి" అన్నారు.
నామనసు ఎక్కడికో ఎగిరిపోయింది. నేను ఊహించిందే చెప్తారా. బహుశా తన మనసులో కూడా నేను ఉన్నానా అని మురిసిపోతూ.. "చెప్పండి" అని అన్నాను.
"పరీ నువ్వు నాకు చాలా దగ్గిర దానివి. నీ అల్లరి నీ ఆలోచన, ధైర్యం నిన్ను నాకు దగ్గర చేశాయి అందుకే ఎవ్వరికీ చెప్పని విషయం నీకొకటి చెప్పాలి" అని ఆయనఆగినప్పుడు ఆయనేం చెబుతారో అని నా గుండె చప్పుడు నాకే వినబడింది.
"పరీ నీకొకరిని పరిచయం చెయ్యాలి." అని "సంధ్యా" అని కేక వేశారు. ఎవరో ఒక పడుచుపిల్ల వచ్చింది. బాగానే ఉంది కానీ నాకన్నా కాదు.
మళ్లీ ఆయనే "ఈమె నా ప్రేయసి... సంధ్య... మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. అమ్మకి ఇంకా చెప్పలేదు. నా స్నేహితురాలిగా నీకే మొదట చెపుతున్నాను. ఎలా ఉంది నా గర్ల్ ఫ్రెండ్. నేను బుద్ధవతారం కాదోయ్" అని నవ్వుతూ ఆయన చెప్పేసరికి నా ప్రపంచం నా కలలు తలకిందులయ్యాయి.
"మీరు నా భర్త" అని అరిచి చెప్పాలని ఉంది కానీ బరితెగించిదనుకుంటారని ఊరుకున్నా. ఎప్పుడూ వర్షించని నా కళ్ళు వర్శిస్తుంటే ప్రకృతికి కూడా జాలి వేసిందో ఏమో ఉన్నపాటున వర్షం కురిపించింది. వర్షంలో ఆయనగారి ప్రేయసి ఎక్కడ తడిచిపోతుందేమో అని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను తీసుకు వెళ్తుంటే నేను కుప్ప కూలిపోయాను. ఎందుకో ఏడ్చే ఓపిక కూడా లేక అలా వర్షంలో తడుస్తూ ఉండిపోయాను.
కళ్ళు తెరిచి చూస్తే నా గదిలో ఉన్నాను. ఎదురుగా కంట తడి పెట్టుకుంటూ అమ్మ. ఎప్పుడూ దేనికి భయపడని నేను మొదటిసారి అమ్మ కళ్ళలోకి సూటిగా చూడలేక పోయాను. అమ్మ... మా అమ్మ కదా.. నన్ను అర్థం చేసుకుంది. దగ్గరకు తీసుకుని గుండెల్లో పొదివి పెట్టుకుంది. ఎందుకో అమ్మ దగ్గర ఏమి దాయలేక పోయాను. జరిగిందంతా చెప్పేశాను. వెక్కి వెక్కి ఏడ్చాను. అమ్మ పల్లెత్తు మాట కూడా అనలేదు. మౌనంగా వెళ్ళిపోయింది.
ఆ రోజునుండి నేను పూర్తిగా మారిపోయాను. నాకోసమే బతుకుతున్న అమ్మ కోసం నేను బతకాలనుకున్నాను. నా ఇల్లు నా గదే ప్రపంచంగా పగలు రాత్రి కష్టపడి చదివాను. మధ్య మధ్యలో మా ఆయన అదే అక్షయ్ నన్ను కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ని నేను సున్నితంగా తప్పించుకున్నాను.
నా చివరి పరీక్ష రాసి వస్తుండగా ఆయన మళ్లీ కలిశారు. బలవంతంగా నా చేతిలో ఒక ఉత్తరం పెట్టీ వెళ్లిపోయారు. నాకు ఉత్తరం చదవాలని ఏమాత్రం ఇష్టం లేదు. అలా అని చించి పారెయ్యలేను. మా ఆయన నాకు రాసిన మొదటి ఉత్తరం. అందుకే తర్వాత చదవవచ్చు అని పుస్తకాల్లో పెట్టీ ఇంటికి బయలుదేరాను.
ఎందుకో తలపోటుగా ఉంటే వస్తూ వస్తూనే మంచం మీద వాలిపోయాను.
ఎవరివో ఏడుపులు పెడబొబ్బలు విని మెలుకువ వచ్చింది. లేచి చూస్తే మా అత్తగారు అదే అక్షయ్ అమ్మ గారు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంటి నిండా జనం. నాకు తెలియకుండానే కళ్ళు నిండుకున్నాయి. మనసు కీడు శంకించింది. పాదాలు గుర్రం కన్నా వేగంగా పరుగు పెట్టాయి. అడ్డంగా నిల్చొని ఉన్నవారిని తోసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉన్న మా ఆయన శవాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లు దించుతున్నారు. నాకు నోట మాట పెగల్లేదు. గట్టిగా అరుస్తూ ఆయన మీద పడిపోయాను.
నన్ను ఒంటరిని చేసి వెళ్ళిన ఆయన్ని తలుచుకుంటూ ఏడ్వని రాత్రి లేదు. నా దిండు నా కన్నీళ్ళతో తడిచిపోయి మొహం అంతా ఉబ్బిపోయేది. నా అల్లరి నా చిలిపితనం మా ఆయన చితిలోనే కలసి పోయాయి.
పాపం అమ్మ నాకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో. నిద్రలోనే ఒక్కోసారి నాకు ఫిట్స్ వచ్చి గిల గిల గింజు కుంటుంటే అమ్మ ఓదార్పు నన్ను బతికించేది. ఆ చల్లని ఒడిలో తలదాచుకుని ఎంత ఏడ్చానో నాకే తెలుసు.
అలా ఆయన బాధ లో గడిపిన నేను ఎంసెట్ పరీక్ష లో ఆయన కన్నా గొప్ప రాంకు తెచ్చుకున్నాను. కసిగా చదివి సింఘానియా కంపెనీలో ఆరంకెల జీతం తెచ్చుకున్నాను. పాపం ఉన్న ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకుని కుమిలి పోతున్న మా అత్తగారిని కూడా మా ఇంటికి తెచ్చుకుని ఆమె బాగోగులు చూసుకుంటూ కాలం గడుపుతూ ఉన్న నాకు ఇదిగో ఇలా ఈ పరిస్తితి వస్తుందని అస్సలు ఊహించలేదు.
ఈ పాతిక సంవత్సరాలు కంటికి రెప్పలా చూసుకున్న అమ్మకు నేను ఇచ్చింది ఏంటి? ప్రేమ కోసం ఇలా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చి పడ్డాను. అమ్మకు చెడ్డ పేరు తెచ్చాను. అత్యాచారం చేసినవారికన్నా, చేయబడ్డ భాదితుల్నే దోషులుగా చూసే సమాజంలో పరువు అని ముసుగీసుకుని బతికే సమాజంలో నన్ను రేప్ చేశారు అని ధైర్యంగా ముందుకు వచ్చాను.
మనోజ్ కుమార్ సింఘానియా.. రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త. ఆయన పెర్సనల్ సెక్రెటరీగా నెలకు ఆరంకెల జీతం వస్తోంది అని చెప్పగానే అమ్మ ఎంత సంతోషించిందో. ఇప్పుడు అదే మనోజ్ నన్ను రేప్ చెయ్యబోయాడని చెప్తే అమ్మ ఏమంటుందో. ఇవే ఆలోచనలతో సతమతమవుతున్న నాకు ఓదార్పుగా ఎవరిదో చల్లని చెయ్యి భుజం పై పడింది. అమ్మ... అమ్మ నన్ను చూసి నవ్వుతోంది. మొత్తానికి అనుకున్నది సాధించాం అనే గర్వం నాలోనూ తొణికిసలాడుతూ ఉంటే గర్వంగా ఉంది.
నేనూ గర్వం గా నవ్వి ఇంటికి బయలుదేరాను. మొత్తానికి అనుకున్నది సాధించాం. నా భర్త చావుకి ప్రతీకారం తీర్చుకున్నాము.
ఆ రోజు అక్షయ్ రాసిన ఉత్తరం ఆయన చితికి ఆహుతి అయ్యాక గాని గుర్తు రాలేదు. మనసులో బాధ పెళ్లుబుకుతుంటే.. నా కనురెప్పలు భారంగా తెరుస్తూ ఆయన రాసిన ఉత్తరం చదివాను...
"డియర్ పరిణీత...
నువ్వు నన్నెందుకు దూరం పెడుతున్నావురా? నేను ఏమైనా తప్పుగా ప్రవర్తించానా. ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించరా. నాకు తెలియకుండానే ఎన్నో తప్పులకి నన్ను బాధ్యున్ని చేస్తున్నారు. నాకు చచ్చిపోవాలని ఉందిరా. ఇది ఎవరికి చెప్పాలో తెలియదు. అమ్మకి చెప్పి ఆమెను బాధ పెట్టలేను. నాకు ఉన్నది ఒకే ఒక్క మార్గం చావు. నేను చనిపోయాక అమ్మను నువ్వు చూసుకుంటావని ధైర్యం. అందుకే ఈ పాడు సమాజంలో బతకలేక ఓడిపోయి పోతున్నారా. నన్ను నువ్వో బుద్ధావతారం అనుకో, పిరికి వాడిని అనుకో. పర్లేదు కానీ లోకం నన్ను రేపిస్టును చేసిందిరా. నేను సంద్యను రేప్ చేసానట. నేను ప్రాణంగా ప్రేమించిన సంధ్య నన్ను ఈ తప్పుడు కేసులో ఇరికించింది.
నేను చేసిన నేరం ఏంటో తెలుసా? మా బాస్ అదే మనోజ్ సింఘానియా తో సంధ్యకు ఉన్న అక్రమ సంబంధాన్ని నిలదీయడం. ఆఫీస్ అని కూడా లేకుండా సంధ్య ,మనోజ్ లు ఒకరిపై ఒకరు అర్ధ నగ్నంగా రొమాన్స్ చేస్తుంటే తట్టుకోలేక ఆమె చెంప చెళ్లుమనిపించి, వాడ్ని కూడా కొట్టి ఇంటికి వచ్చేసరికి సెక్యూరిటీ ఆఫీసర్లు నన్ను పట్టుకుపోయార్రా. నన్ను... నన్ను... కుల్లబొడిచారు. నేను ఆమెను రేప్ చేసానంట. వాడు కాపాడబోతే నేను వాడ్ని రక్తం కారెలా కొట్టానంట. ఆ నంగనాచి సెక్యూరిటీ ఆఫీసర్లకి చెప్పింది. ఆమెను ఎంతగా ప్రేమించాను. ఆమె నా కళ్ళ ముందే వాడ్ని కౌగలించుకుని నామీద పచ్చి అబద్ధాలు చెబుతుంటే ఒళ్ళు మండి పోయింది. ఎంతో గౌరవంగా బతికిన నేను ఈ నింద భరించలేను రా... అందుకే అందర్నీ వదిలి వెళ్లి పోతున్నా.
ఎవ్వరూ నన్ను నమ్మక పోయినా నువ్వు నన్ను నమ్ముతావు కదూ...
ఇట్లు
నీ అక్షయ్
***
ఇది చదివిన మొదట్లో నా మీద నాకే అసహ్యం వేసింది. ఆయన లెటర్ ఇచ్చిన వెంటనే ఇది చదివుంటే ఈ అనర్థం జరిగేది కాదేమో. కానీ కాలం గడిచే కొద్ది నాలో పగ పెరిగిపోయింది. ఎలాగైనా నా భర్తను ఇరికించిన వాళ్ళ అంతు చూడాలి.
ఆయన పోయాక నిర్జీవంగా బతుకుతున్న నేను మనోజ్ ఆఫీసులో చేరాను. సంధ్య అప్పుడప్పుడు కలిసేది. ఆమె ఇప్పుడు మనోజ్ భార్య. నేను కావాలనే ఆమెకు దగ్గర అయ్యాను. ఆమె కంపెనీ లో చేస్తున్న అవకతవకలు అన్ని ఆమెకు దగ్గరగా ఉండి సాక్ష్యాలు సంపాదించాను.
మొదట్లో మనోజ్ నన్ను పట్టించుకోలేదు. కానీ ట్రెండీ గా మారి అతన్ని నా వలలో వేసుకున్నాను.
ఆ రాత్రి స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. మనోజ్ నేను మాత్రమే మిగిలాం. బయట జోరున వర్షం. బయటకు వెళ్ళే ఛాన్సు లేక ఆఫీసు లో ఉండిపోయాను. అక్కడే ఉన్న మనోజ్ నాకు విస్కీ కలిపి ఇచ్చాడు. తాగుతున్నట్టు నటించి అతని పై వాలిపోయాను. అదంతా కెమెరాల్లో రికార్డ్ అయ్యేటట్లు జాగ్రత్త పడ్డాను. మత్తులో ఉన్నట్టు నటించి అతన్ని ప్రేరేపించిన నేను అతను శ్రుతి మించుతుంటే వెనక్కి తోసాను. అతను నా వెంట పడ్డాడు. నన్ను చెరచబోయాడు. నా చెరలో పడ్డాడు.
సీసీ కెమెరా లో చిక్కిందంతా నా స్నేహితుడి సహాయంతో టీవీ వాళ్ళకి అందించాను. మనోజ్ ఎంతటి రాక్షసుడు అనేది ప్రపంచానికి తెలియజెప్పి, అక్షయ్ రాసిన ఉత్తరం ఆయన అమ్మగారితో బయట పెట్టించాను. సంధ్య మనోజ్ ల భాగోతం లోకానికి తెలిసింది. నా భర్త నిర్దోషన్న నిజాన్ని ప్రతి టీవీలో చెప్తుంటే నా మనసు తేలిక పడింది. నా భర్త ఆత్మకు శాంతి చేకూరింది.
నా బుద్ధావతారానికి నేను తప్ప ఎవ్వరూ లేరు. చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని ప్రాణం. నేను ఆయన భార్యను అని కూడా తెలియదు. కానీ తను నా భర్త. అది నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు. ఎప్పుడూ చిన్నపిల్ల , అల్లరిపిల్ల గా భావించే ఆయన ఇప్పుడు నన్ను చూసి ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే చిన్న చిరుజల్లులు నన్ను వెచ్చగా తాకాయి. ఆయన కౌగిలిలో ఉండే వేడి నా నునుపైన శరీరాన్ని తాకింది.
(అయిపోయింది)
ఇలా రేప్ చేశారు అని కల్పిత కథ చెప్పి నిజంగా రేప్ అయిన బాధితుల మనోవేదనకు అర్ధం లేకుండా చెయ్యడం తప్పు. కానీ ముల్లుని ముల్లుతోనే తీయాలి. నా భర్తకు పట్టిన గతే వారికి పట్టాలి. అందుకే ఇలా చేశాను. తప్పయితే మన్నించండి.
ఇది నా ఫ్రెండ్ చెప్పిన కథ. ఒక బెంగాలీ సినిమా అంట. నేను ఆ సినిమా చూడలేదు. ఆ అమ్మాయి చెప్పిన కథ నచ్చడంతో నా శైలిలో రాశాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ