Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
ఆపరేషన్ సక్సెస్ అవడంతో రెజీనా కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నది.

నిహారిక : ఇంకేంటి రామూ….సంగతులు…..
రాము : చాలా థాంక్స్ నిహారిక…..సమయానికి చాలా హెల్ప్ చేసావు…..
నిహారిక : ఇందులో నేను చేసింది ఏమున్నది రామూ….టైంకి నువ్వు ఫోన్ చేసావు….డాక్టర్ గా నేను చేయాల్సింది చేసాను….అంతే….
రెజీనా : అవును డాక్టర్ గారు….ఈ రోజు కనుక రాము నా పక్కన లేకపోతే….నా కొడుక్కి ఆపరేషన్ జరిగేది కాదు…. (అంటూ రాము వైపు చూసి) నీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు రామూ….నాకు చాలా పెద్ద సహాయం చేసావు….అది మాటల్లో చెప్పలేను….అయిన వాళ్ళు అందరూ నన్ను వదిలేసిన టైంలో నువ్వు ఆపధ్బాంధవుడిలా నన్ను ఆదుకున్నావు……
రాము : మరీ అంత ఎమోషనల్ అవకు….నేను చేసింది చాలా చిన్న సహాయం…..(అంటూ నిహారిక వైపు చూసి) అవునూ….ఇందాక టిఫిన్ చేసేప్పుడు నేను నీకు రిలేటివ్ అవుతానని చెప్పావు….ఎలా….
నిహారిక : ఓహ్….అదా….నీకు మీనా అని అత్తయ్య ఉన్నది కదా….
రాము : అవును….ఆమె నాకు సొంత మేనత్త అవుతుంది….
నిహారిక : ఆమె…నాకు తోడి కోడలు అవుతుంది….మా ఆయన రాఘవ, మీ అత్తయ్య వాళ్ళ ఆయన ప్రకాష్ ఇద్దరూ అన్నతమ్ముళ్ళు……
రాము : అవునా….మరి ఎప్పుడూ మీనా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వచ్చినట్టు కూడా కనిపించలేదు….
నిహారిక : ఎక్కడ బాబూ….మా ఆయన ఎపుడు చూసినా కాన్ఫరెన్స్ లు అని ఊర్లు పట్టుకుని తిరుగుతుంటాడు… అందుకనే నేను ఎక్కువగా ఫంక్షన్స్ కి రావడం కుదరదు…..నాక్కూడా ఆపరేషన్స్ అని ఎక్కువ టైం దొరకదు….
రాము : (ఆనందంగా) అవునా….అయితే నాక్కూడా నువ్వు అత్తవే అవుతావు…..
నిహారిక : ఓయ్….మరి నన్ను అంటీలా చూడకు….నీకన్నా నేను మూడేళ్ళు పెద్దదాన్ని అంతే…..(అంటూ ఉడుక్కున్నది.)
రాము : (చిన్నగా నవ్వుతూ) అలా ఉడుక్కుంటుంటే నువ్వు ఇంకా అందంగా ఉన్నావు నిహారికా…..
నిహారిక : చాలా థాంక్స్ రామూ…..
రాము : అయితే….మీనా అత్త కూడా ఇప్పుడు నాతోనే ఉన్నది…ఇప్పుడు నీకు అపాయింట్ మెంట్లు ఏమైనా ఉన్నాయా…..
నిహారిక : హా కొద్దిగా ఉన్నాయి….నువ్వు ఇంటికి వెళ్ళు నేను మధ్యాహ్నం ఇంటికి వస్తాను…..
రాము : అలాగే….తప్పకుండా రావాలి….ఈలోపు నేను కూడా కొంచెం పని చూసుకుని ఇంటికి వెళ్తాను…..(అని తన ఇంటి అడ్రస్ నిహారికకి మెసేజ్ పెట్టి) అడ్రస్ మెసేజ్ పెట్టాను….మధ్యాహ్నం తప్పకుండా రావాలి….
నిహారిక : తప్పకుండా వస్తాను…..
రాము : సరె….మేము ఇక బయలుదేరుతాం….(అని చైర్ లోనుండి లేచి) బై….(అని బయటకు వచ్చేసాడు.)
రెజీనా కూడా లేచి నిహారికకి మళ్ళీ ఇంకో సారి ధాంక్స్ చెప్పి రాము వెనకాలే బయటకు వచ్చింది.
తరువాత ఇద్దరూ రూమ్ కి వచ్చి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చారు.
రాము రిసెప్షన్ దగ్గరకు వచ్చి హాస్పిటల్ లో బిల్ సెటిల్ మెంట్ చేసి పేపర్స్ అన్నీ తీసుకుని ఒకసారి icu లోకి వెళ్ళి పిల్లాడిని చూసి బయటకు వచ్చారు.
ఆపరేషన్ అయిపోయిన తరువాత తన పిల్లాడిని చూసిన రెజీనా కి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.
ఆ ఆనందంలో కన్నీళ్ళు కళ్ళు మొత్తం నిండిపోయేసరికి రెజీనా కి కళ్ళు మసకబారాయి.
రెజీనా చేత్తో తన కళ్ళను తుడుచుకుంటూ రాము వైపు చూసి, “చాలా థాంక్స్ రామూ,” అన్నది.
రాము ఆమె చెక్కిళ్ళ మీదకు జారుతున్న కన్నీళ్ళను తుడిస్తూ, “ఇప్పటికి ఎన్ని సార్లు చెబుతావు….ఇక చాలు… నువ్వు సంతోషంగా ఉన్నావు కదా….” అన్నాడు.
రెజీనా అవునన్నట్టు ఆనందంగా తల ఊపింది.
రాము : పద…నీతో చాలా పని ఉన్నది…(అంటూ బయటకు వచ్చి కారు పార్కింగ్ లో నుండి బయటకు తెచ్చాడు.)
రెజీనా కారులో కూర్చున తరువాత ఇద్దరూ బయటకు వచ్చి రెస్టారెంట్ కి వెళ్ళి కొద్దిగా తిన్న తరువాత రాము అక్కడ ఉన్న బ్యాంక్ లోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చి మళ్ళి కారులో కూర్చుని రెజీనా వాళ్ల ఇంటి వైపు పోనిచ్చాడు.
అక్కడ నుండి నేరుగా రెజీనా వాళ్ళ ఇంటికి పోనిచ్చాడు.
ఇంటి ముందు కారు ఆపగానే ఇద్దరూ లోపలికి వెళ్ళారు.
రెజీనా పక్కన మోహన్ వాళ్ల ఇంటికి వెళ్ళి కూలింగ్ వాటర్ తెచ్చి మంచం మీద కూర్చుని ఉన్న రాముకి ఇచ్చింది.
రాము వాటర్ తాగి బాటిల్ రెజీనా కి ఇవ్వగానే….ఆమె కూడా వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి మంచం మీద రాము పక్కనే కూర్చున్నది.
రాము తన చేత్తో రెజీనా భుజాలను పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తు, “రెజీనా….ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా….” అనడిగాడు.
రెజీనా కూడా తన చేత్తో రాము ఛాతీని షర్ట్ మీదనే నిమురుతూ, “చాలా సంతోషంగా ఉన్నది రామూ….ఇప్పటికి నాకు జరుగుతున్నదంతా కలలా అనిపిస్తున్నది,” అన్నది.
రాము : సరె….హ్యాపీగా ఉన్నావు కదా….నేను ఒక మాట అడిగాను….తీరుస్తావా….
రెజీనా : తప్పకుండా రామూ….నువ్వు ఏ పని చెప్పినా ఆలోచించకుండా చేస్తాను….నన్ను ఏం చెయ్యమంటావు….
రాము : ఇప్పుడు పరిస్థితి ఏంటి……పిల్లాడి ఆపరేషన్ కోసం రాత్రిళ్ళు బయటకు వెళ్తున్నానని అన్నావు….ఆ ఆపరేషన్ అయిపొయింది….ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు…..
రెజీనా : అదే రాము…ఇప్పుడే కదా ఆపరేషన్ అయిపోయింది…చిన్నగా ఏదైనా పని వెతుక్కోవాలి….
రాము : చిన్న పిల్లాడిని పెట్టుకుని ఏ పని చేస్తావు….బయటకు వెళ్ళి పని చేయడానికి కుదురుతుందా….
రెజీనా : అవును రామూ….నాకు ఏం తోచడం లేదు….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 21-07-2022, 07:27 PM



Users browsing this thread: sree2022, 7 Guest(s)