24-05-2019, 08:22 PM
(24-05-2019, 03:14 PM)Lakshmi Wrote: రమేష్ గారూ...
గత ఏడాది ఇదే నెలలో తేదీ కచ్చితంగా గుర్తు లేదు కానీ 20-24 తేదీల మధ్య ఈ కథని మొదలు పెట్టాను... మీరు సరిగ్గా ఏడాది తర్వాత చదివారు...
మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది...
అభినందిస్తూ కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు...
ఈ కథ పూర్తయ్యే ముందు ఇంకో కథ ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఏ ఆలోచనా రాక ఏదైనా ఇంగ్లీష్ కథని అనువాదం చేద్దామని మంచి కథని సూచించమని సరిత్ గారి దారంలో అడిగాను అప్పుడు రాజు గారు అనుకుంటా ఇంగ్లీష్ ఫోరమ్ లోని " Indian Housewife : I had to do it "
కధ ని అనువదించమని సలహా ఇచ్చారు... నేనూ ఆ కథను చాలా భాగాలు చదివాను... కథ నాకు బాగా నచ్చింది కూడా... అయితే ఆకథను చదువుతున్నపుడు కింద కామెంట్స్ చూస్తే ఎక్కువగా తెలుగు వారే ఉండడం గమనించాను ... ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది చదివారు కదా అని అనువాదం చేసే ఆలోచన మానుకున్నాను... ఇంకొక కారణం ఏంటంటే పెద్ద కథల్ని సీరియల్ గా రాస్తుంటే అప్డేట్ వెంట వెంటనే చేయాల్సి వస్తుంది... "ఇదీ నా కథ" రాస్తున్నపుడు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు ... పాఠకులతో "అప్డేట్ ప్లీస్" అని అడిగించుకోవడం ఇష్టం ఉండదు నాకు ... అందువల్ల కూడా అనువాదం ఆలోచన మానుకున్నా...
దానికి విరుగుడుగా కవి గారి సలహాతో ఇప్పుడు "పారిజాతాలు" శీర్షికన చిన్న కథల్ని రాస్తున్నాను...
వీలయితే మీరూ ఒకసారి చూడండి...
మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు
... లక్ష్మి
లక్ష్మి గారు మీరు ఆ కథని అనువదిస్తే బాగుంటుంది. అప్డేట్ లు ఆలస్యమైనా ఫరవాలేదు అనువదించండి.
తెలుగు వాళ్ళు చాలా మందే చదివి ఉన్నా, తెలుగులో చదవలేదు కదా. తెలుగులో దాన్ని చదివితే ఆ ఆనందమే వేరు.
ప్లీస్..............