Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
నిహారిక : అవునా….మీ పేరు చూడంగానే నాకు డౌట్ వచ్చింది….కాని ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్….ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కామన్ కదా…అలా మీ ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారేమో అనుకున్నా…..

రెజీనా : లేదు డాక్టర్ గారు….రాము నాకు చిన్నప్పటి ఫ్రండ్….టెన్త్ లో నాకు క్లాస్ మేట్….తరువాత నాకు మళ్ళి కలవలేదు….నిన్న రాత్రి అనుకోకుండా రాముని కలిసాను…తరువాత నా కొడుకు గురించి తెలిసిన తరువాత ఏమాత్రం ఆలోచించకుండా ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ లో జాయిన్ చేసాడు…..ఇప్పుడు ఆపరేషన్ కి ఆయ్యే మొత్తం ఖర్చు కూడా రామునే ఇస్తున్నాడు….చాలా మంచివాడు మేడమ్…..
నిహారిక : (రాము వైపు చూస్తూ) అవును….ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళ గురించే పట్టించుకోవడం లేదు….ఎప్పుడో టెన్త్ క్లాస్ మేట్ కష్టాల్లో ఉన్నదని తెలిసిన మరుక్షణం హెల్ప్ చేస్తున్నాడు….రాత్రి రాముతో మాట్లాడిన తరువాత ఆయన గొంతులో టెన్షన్ చూసి ఆయన కొడుకేమో అనుకున్నాను…..
రెజీనా : రాముకి ఇంకా పెళ్ళి కాలేదు డాక్టర్ గారు…..
నిహారిక : అవునా….నాకు పెళ్ళి అయింది….కాకపోతే మాత్రం రాముని తప్పకుండా ట్రై చేసేదాన్ని…..
రెజీనా : (నవ్వుతూ) ఇప్పుడే కదా పరిచయం అయ్యారు….అప్పుడే పెళ్ళి దాకా వెళ్ళిపోయారు….
నిహారిక : కొన్ని పరిచయాలకు టైం అక్కర్లేదు….మాకు ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ చూపులను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో బాగా తెలిసిపోతుంది….అందుకే అలా అన్నాను….మీరు విషయం చెప్పిన తరువాత రాము మీద ఇంకా గౌరవం పెరిగింది….
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా రాము నిద్ర లేచి వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ నిహారిక వైపు చూసి విష్ చేసాడు.
రాము : (నిహారిక వైపు చూసి) పొద్దున్నే కళ్ళు తెరవగానే ఇంత అందమైన అమ్మాయి కనిపిస్తే….చాలా మంచి జరుగుతుందని విన్నాను….(అంటూ నవ్వాడు.)
నిహారిక : అవునా….మీకు అలా ఎవరు చెప్పారు…..
రాము అలా అనగానే నిహారిక ఎలా రియాక్ట్ అవుతుందో అని రెజీనా కొంచెం కంగారు పడింది….కాని నిహారిక కూడా నవ్వుతూ మాట్లాడుతుండుంటం చూసి వాళ్ళిద్దరి మాటలను ఎంజాయ్ చేస్తున్నది.
రాము : ఎవరూ చెప్పక్కర్లేదు….పొద్దున్నే అందమైన అమ్మాయిని చూసామనుకోండి….మనసంతా ఉల్లాసంగా ఉంటుంది….దాంతో అనుకున్న పనులు వాటంతట అవే అయిపోతాయి…..
నిహారిక : మీరు ఆడవాళ్లతో బాగా ఫ్లర్ట్ చేస్తారనుకుంటాను…..
రాము : అదేంటి….అంత మాట అనేసారు…..ఏదో సరదాగా అన్నాను…..(అంటూ ఆమెను పైనుండి కింద దాకా అనుమానంగా చూస్తున్నాడు.)
నిహారిక : ఏంటి అలా చూస్తున్నారు…..
రాము : ఏం లేదు….ఇందాక అమ్మాయిని కాదన్నారు కదా….చూడ్డానికి మీరు అమ్మాయిలాగే కనిపిస్తున్నారు కదా….
నిహారిక : అమ్మాయి కాదు అంటే….నాకు పెళ్ళి అయిపోయింది……అని అర్ధం…పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళను అమ్మాయిలు అంటారు….మీరు వేరే అర్ధాలు తీయకండి….
రాము : ఒక్క నిముషం….ఇప్పుడే వస్తాను….(అని బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నిహారిక వైపు చూసి) మీరు రాత్రి నుండీ హాస్పిటల్ లోనే ఉన్నారా…..
నిహారిక : లేదు….మిమ్మల్ని కలిసిన తరువాత నేను ఇంటికి వెళ్ళాను….పావుగంట క్రితమే మళ్ళీ హాస్పిటల్ కి వచ్చాను….
రాము : మా కన్నా మీరే ఎక్కువ కష్టపడుతున్నారు….
నిహారిక : తప్పదు కదా….పేషెంట్ గురించి చాలా కేర్ తీసుకోవాలి….
రాము : ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుంది….
నిహారిక : దాని గురించి మీరు ఆలోచించొద్దు….(అని వార్డ్ బోయ్ ని పిలిచి) మన క్యాంటిన్ లో రెజీనా కి టిఫిన్ తీసుకుని రా…..
రాము : మరి నాకు….టిఫిన్ చెప్పలేదేంటి….
నిహారిక : నాకు, రాము గారికి టిఫిన్ తీసుకొచ్చి నా క్యాబిన్ లో పెట్టు….
రెజీనా : అదేంటి…రాముకి మీ క్యాబిన్ లో ఎందుకు…..
నిహారిక : ఏం లేదు….కొంచెం ఆపరేషన్ గురించి డిస్కస్ చేయాలి….అందుకే టిఫిన్ చేస్తూ మాట్లాడదామని….
రాము : అలాగే తప్పకుండా….
నిహారిక : సరె…..పావుగంట ఆగి రిపోర్ట్ లు తీసుకుని నా క్యాబిన్ కి వచ్చేయండి….(అని వెళ్ళిపోయింది.)
రెజీనా : ఏంటి రామూ….మళ్ళీ ఆపరేషన్ గురించి డిస్కషన్ అంటున్నారు….రెండు గంటల్లో ఆపరేషన్ చేస్తామన్నారు కదా….మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవడం ఏంటి….
రాము : ఏం లేదు….ఫార్మాలిటీస్ అయి ఉంటుంది…..నువ్వు బట్టలు ఏమీ తెచ్చుకోలేదు కదా….
రెజీనా : లేదు….నేను సర్దుదామని అనుకుంటే….నువ్వే కదా….ఇక్కడ హాస్పిటల్ లో అన్నీ ఉంటాయని చెప్పావు….
రాము : అంటే…నువ్వు దుప్పట్లు, నేప్ కిన్స్ సర్దుతుంటే….అన్నీ ఇక్కడ ఉంటాయని అన్నాను….సరెలే….ఆపరేషన్ స్టార్ట్ అయిన తరువాత ఇంటికి వెళ్దువు గాని….
రెజీనా : అమ్మో…ఆపరేషన్ స్టార్ట్ అయిన తరువాత నేను వెళ్లను….అయిపోయిన తరువాత వెళ్ళొస్తాను….
రాము : నా డ్రైవర్ కి ఫోన్ చేసి మా అత్తయ్యను అడిగి చీరలు పంపమని చెబుతాను….
రెజీనా : అయ్యో….ఆమెనెందుకు ఇబ్బంది పెడతావు….వద్దులే….నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను….
రాము : ఇక్కడ నుండి నా విల్లా చాలా దగ్గర….పది నిముషాల్లో తెచ్చేస్తాడు…నీకే కాదు….నాక్కూడా బట్టలు కావాలి…
(అంటూ మీనా అత్తకు ఫోన్ చేసి విషయం చెప్పి…తామిద్దరికి బట్టలు పంపమని చెప్పి హాస్పిటల్ పేరు, రూమ్ నెంబర్ చెప్పి ఫోన్ పెట్టేసి) నేను స్నానం చేసి వస్తాను….(అని బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.)
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-07-2022, 10:00 PM



Users browsing this thread: 3 Guest(s)