12-11-2018, 10:13 AM
21.ఫ్లాష్ బ్యాక్
ఆ రిపోర్ట్ పట్టుకుని రొడ్డు పై ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది రియా....తనకి ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు.....ఒక్కసారి గతం లోకి వెళితే....
****
గతం......
సినిమా కి వెళ్ళి ఆటో డ్రైవర్ బలవంతం చేస్తే అభి వచ్చి కాపాడిన రోజు కి దగ్గరికి వెళ్తే...
"రా....."అని చెయ్యి పట్టుకుని లాకెళ్తున్న అభి ని అలానే చూస్తుండిపోయింది రియా.....
అభి తనని తన బైక్ పార్క్ చేసిన చోటుకి తీసుకుని వెళ్ళి...బైక్ స్టార్ట్ చేసి...."ఎక్కు ...."అన్నాడు తన వైపే వింతగా చూస్తున్న రియా ని వుద్దేశించి....
"నడిచి వెళ్దామా....?"అడగాలా వద్దా అని ఆలోచిస్తూనే అడిగేసింది రియా
వింతగా తన వైపు చూసిన అభి....."బైక్ వున్నప్పుడు నడవడం ఎందుకు,...?"అర్థం కానట్టు అడిగాడు అభి
మారు మాట్లాడకుండా బైక్ ఎక్కి కూర్చుంది రియా.....ఒక్క కుదుపు తో బైక్ స్టార్ట్ అయ్యిందో లేదో.......రియా తన చుట్టూ చేతులు వేసి అభి ని గట్టిగా హత్తుకుంది.....
ఒక్కసారిగా ఆ స్పర్శ లో అంతులేని ప్రేమ ,నువ్వు లేపోతే నేను లేననే నిస్సహాయత కనిపించాయి అభి కి.......
ఒ 20 నిమిషాల తర్వాత.....
వాళ్ల ఇల్లు చేరిన అభి....."రియా...?" అని పిల్చాడు....
రియా పలకలేదు......తనని గట్టిగా హత్తుకుని నిద్రపోతుంది....."రియా...?"అని మళ్ళి ఒకసారి పిలవడం తో.....ఈ సారి లేచిన రియా....బండి దిగి.....అభి కి దగ్గరాగా వచ్చింది......"అభి.....అది..."అంటూ ఆగింది
"చెప్పు రియా....ఏమైంది...?"అడిగాడు అభి....
"ఏం లేదు...."అని ఇంట్లోకి వెళ్ళిపోయింది....
తన డైరి ఓపెన్ చేసి రాయసాగింది....
"అభి నీకు నేనెంటే ఎందుకంత ఇష్టం నీకు....?నీ కేరింగ్ ఎలా వుంటుందో తెల్సా.....నాన్న తన కూతురిని ఎంత జాగ్రత్తగా చూస్కుంటాడో అంత జాగ్రత్తగా నన్ను నువ్వు చూస్కుంటావ్...నాకే కష్టం రానివ్వవు...సినిమాల్లో హీరోలు అన్నట్టు ఏ కష్టమైన నా దరి చేరాలంటే అది నిన్ను ముందు దాటాలి అనేలా వుంటావ్......నీ ప్రేమ ని నేను తట్టుకోలేకపోతున్నాను...ఆ రోజు నువ్వు యూ.ఎస్ వెళ్ళాలంటే నీకో ప్రామిస్ చెయ్యాలి అని చెప్పి అణ్దరి ముందు నిశ్చితార్థం అని చెప్పేసరికి చాలా హర్ట్ అయ్యాను....కనీసం నా ఒపీనియన్ పట్టించుకోవా అని అనుకున్నాను....కాని నాకిప్పుడు అనిపిస్తుంది నువ్వు చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదని...నువ్వు నన్నెంత కోరుకుంటున్నావో అని.....నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గ్రహించిన క్షణం నుంచి నేను నేనులా లేను....నీతో వుండాలని నీతో మాట్లాడాలాని చాలా అనిపిస్తుంది...బహుశా ఆరోజు నన్ను చూడ్డానికి నువ్వు చేసిన పని నేనిప్పుడు చెయ్యాలేమో...."అని డైరి మూసి....వాళ్ళింటి టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి అభి వాళ్ళ ఇంటి టెర్రస్ మీదకి దూకి అభి రూం కి చేరి.....అభి నిద్రపోతుంటే రెప్ప వాల్చకుండా చూస్తుండిపోయింది.......
అలా రెండు గంటలు గడిపిన తర్వాత...చిన్నగా లేచి మళ్ళి తన రూం కెళ్ళి నిద్రపోయింది....
ఆ మరుసటి వుదయం.....అభి ఏదో పని వుండి బయటకి వెళ్ళడానికి రెడి అవుతున్నాడు అభి రెడి కిటికి లోంచి చూసిన రియా
"అభి ...అభి..."అని పిల్చింది అభి కి వినపడలేదు.....
అరిచింది అయినా వినపడలేదు .....ఇలా కాదని పేపర్ బాల్ చేసి విసిరింది జస్ట్ లో అభి కి తగలకుండా మిస్ అయ్యింది.....ఇంకో బాల్ విసిరింది అభి పట్టించుకోలేదు.......ఈ సారి ఇంకోటి విసిరింది అభి చూస్కోలేదు......చిరాకొచ్చిన రియా పక్కనున్న నైట్ ల్యాప్ ని ఎత్తింది కోపం లో.......అప్పుడు కానీ అభి చూడలేదు...........అభి చూసాడన్న సంతోషం లో నైట్ ల్యాప్ ని పడేసింది....అది కింద పడి డ్యామేజ్ అవ్వడమే కాదు రియా కాలిని కూడా డ్యామేజ్ చేసింది......"అమ్మా...అని పెద్దగా అరిచి కాలు పట్టుకుని బెడ్ పై కూర్చుండి పోయింది......ఒక 2 నిమిషాలు గడిచి వుంటాయేమో.....తన పక్కన ప్రత్యక్షమయ్యాడు....రియా కాలిని తన చేత్తో పట్టుకుని అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని కట్టు కట్టసాగాడు...."ఆ నైట్ ల్యాంప్ నిన్నేం చేసింది.....దాన్నెందుకు ఎత్తావ్ అస్సలు...?పిచ్చా నీకేమైనా...?
"నాకు పిచ్చి కాదు నీకు చెవుడు ఎన్ని సార్లు పిల్చాను...కాదు కాదు అరిచాను కనీసం చూశావా.....పేపర్ బాల్స్ కూడా వేసాను నువ్వే చూడలేదు.....అందుకే కోపమొచ్చి దీన్ని ఎత్తి కింద పడెస్తే చూస్తావానుకున్నా కానీ ఇది నా కాళ్ళ మీద పడుతుంది అనుకోలేదు..."అంది రియా
"అవునా ఎందుకు పిలిచావ్...?"అడిగాడు అభి
"ఎక్కడికి వెళ్తున్నావ్...?"అడిగింది రియా
"పనుంది బయటకి వెళ్తున్నా..."చెప్పాడు అభి
"నేనూ వస్తా..."అంది ఎక్సైట్ అవుతూ రియా
"ఏంటి ఈ అవతారం లోనా...?ఏం అక్కర్లేదు....కనీసం బ్రష్ అన్నా చేశావంటే.,,,,?"అడిగాడు అభి
"లేదు...కానీ గివ్ మీ ఫైవ్ మినిట్స్ రెడి అయిపోతా....."అంది రియా నమ్మకంగా
"ఏం అక్కర్లేదు......నాకు టైం అవుతుంది...బై..."అని వెళ్ళడానికి లేచాడు అభి
"అభి ప్లీస్ రా....ప్లీస్...నేనూ వస్తా.....నాకొక్క ఐస్ క్రీం ఇప్పించు చాలు ప్లీస్...."అంది వేడుకొలుగా
"సరే....ఏడ్వకు.....నేను కింద వెయిట్ చేస్తుంటాను వచ్చేయి......"అని కిందకి వెళ్ళబోతుండగా...ఆపేసింది రియా
"ఏంటి కిందకి వెళ్తావా..?ఇంకేమైనా వుందా...అమ్మకి గోడ దూకి వచ్చావని తెల్సిపోతుంది.....ఇక్కడె కూర్చో.....ప్లీస్...."అంది రియా
"నేను మా ఇంట్లో వుంటాను...నువ్వు రెడి అయ్యాక కాల్ చెయ్యి వస్తాను..."అని చెప్పాడు అభి
"అరే కూర్చుంటే నీ సొమ్మేమన్నా పోతుందా....?కూర్చో...."అంది రియా
"ఏంటె...తేడాగా మాట్లాడుతున్నావ్...?ఏం అక్కర్లేదు రెడి అవ్వగానే కాల్ చెయ్యి..."అని లేచి వెళ్ళిపోయాడు అభి....
"ఈ రోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను..."మనసులో నవ్వుకుంది రియా
రియా కాల్ చెయ్యడం తో ఇంటి బయటకి వచ్చి నిల్చున్నాడు అభి.....
ఎదురుగా వస్తున్న రియా చూసి......నోరెళ్ళబెట్టాడు......
రెడ్ కలర్ శారి లో దేవకన్య లా వుంది తను.....ఒక టైం లో దేవకన్యలకి డ్రెస్ కోడ్ వైట్ నుంచి రెడ్ కి మార్చారా అని కూడా అనిపించింది తనకి.....అభి తననే చూస్తు వుండిపోయేసరికి రియా కి ఏదో లా వుంది...
"ఓయ్...దిష్టి పెట్టకు...."అంది రియా
"ఏంటె...ఈ కాస్ట్యూమి పెళ్ళికి కాని వెళ్తున్నావా ఏంటి...?"అడిగాడు అభి
"కాదు గుడికి........"అంది రియా
"మిట్ట మధ్యాహ్నం గుడి ఏంటి తల్లి....అయినా కొత్తగా ఈ భక్తి ఏంటి...?"అడిగాడు అభి
"అవును కదా...సరేలే నువ్వేళ్ళు..రేపు నేను గుడికి వస్తాను...."అనేసరికి..."ఐస్ క్రీం కావాలి అన్నావ్ కదా రా....కొనిస్తాను"అన్నాడు అభి
"ఆర్ యీ స్యూర్...?"అడిగింది రియా
"హా రా "అన్నాడు అభి
ఐస్ క్రీం పార్లల్ కి వెళ్ళిన ఇద్దరూ ఒక సీట్లో సెటిల్ అయ్యాక....
"ఏమ్ కావాలి...?"అడిగాడు అభి
రియా చెప్పిన లిస్ట్ చూసి కళ్ళు తేలేశాడు...........!!!!
*****