Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సరైన నిర్ణయం by Sai Arpita
#10
తర్వాత వాళ్ళు నిత్యా ఇంటికి వచ్చేస్తుంది ఆనంద్గారు సోఫాలో కూర్చుని ఉంటారు... నిత్యా ఇంట్లోకి వస్తు వస్తూనే ఆనంద్గారి పక్కన కూర్చుంటుంది...
 
హై బంగారు... ఈరోజు అయిన కనిపించాడ నీ క్రష్ అంటారు నిత్యా చెవిలో చిన్నగా లేదు నాన్న అంటుంది...
 
హ్మ్మ్ సర్లేయ్ తను కనిపించాక తనకి సారి చెప్పు అంటారు...
 
అలాగే నాన్న అంటుంది తర్వాత నిత్యా ఎం.టెక్ జాయిన్ అవుతుంది శ్వేతా కూడా నిత్యా జాయిన్ అయిన కాలేజ్లొనే జాయిన్ అవుతుంది...
 
వాళ్లిద్దరూ మొదటి రోజు క్లాస్కి వెళ్లి కూర్చుంటారు... అప్పుడే అటెండర్ వచ్చి ప్రిన్సిపల్ సర్ వస్తున్నారు అని చెప్పి వెళ్లిపోతాడు.. అందరూ ప్రిన్సిపాల్ వస్తున్నారు అని సైలెంట్గా ఉంటారు... అంతలో ప్రిన్సిపాల్ రూంలోకి వస్తారు ... నిత్యకి ఎదో అలజడిగా అనిపించి చుట్టూ చూస్తుంది అప్పుడే తన పక్కన అమ్మాయిలు ... అబ్బా ఎమున్నారే మన ప్రిన్సిపాల్ సర్ చూడటానికి నవమన్మధుడులగా ఈయన కోసమైనా నేను రోజు కాలేజ్కి వస్తాను అంటుంది...
 
అది విన్న నిత్య నవ్వుకుని... ప్రిన్సిపాల్ వైపు చూస్తుంది..... వాళ్ళు చెప్పింది నిజమే ప్రిన్సిపాల్ చాలా బావున్నారు... కానీ నిత్యా ఫస్ట్ షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడుంది ఎవరో కాదు రోడ్ మీద నిత్యా డాష్ ఇచ్చిన అబ్బాయి...
 
 
నిత్యా నోరు తెరుచుకుని చూస్తూ ఉంది...
 
పక్కన శ్వేతా కదిలిస్తే అప్పుడు మాములుగా కూర్చుని వింటోంది ఆయన చెప్పేది... ఆ అబ్బాయి ఇలా చెప్తున్నాడు...
 
హై స్టూడెంట్స్ థిస్ ఐస్ యువర్ ప్రిన్సిపాల్ లికిద్ కృష్ణ మీకు ఎలాంటి ప్రోబ్లేమ్స్ వచ్చిన ఎవరైనా మిమ్మల్ని రాగ్గింగ్ అనే పేరుతో ఇబ్బందిపెట్టిన నాకు కంప్లైంట్ చెయ్యండి రాగింగ్ చెయ్యండి పర్లేదు కానీ అది అందర్నీ నవ్వించేలా ఉండాలి కానీ ఒకళ్ళని నవ్వుల పాలు చేసి మనం నవ్వుకునేల ఉండకుండదు... అల్ ద బెస్ట్ .... వి విల్ గివ్ యు ఔర్ బెస్ట్ అని ముగించి వెళ్ళిపోతారు .....
 
నిత్యా లికిద్ చెప్తున్నంతసేపు తననే చూస్తూ ఉంది...
 
అతని మేము పై ఆ చెరగని చిరునవ్వు చూస్తూ కూర్చుంది....
 
ఆయన వెళ్లిపోగానే శ్వేతా నిత్యా వైపు చూసింది కానీ నిత్యా మాత్రం ఆయన వెళ్లినవైపు చూస్తూ ఉండిపోయింది.... శ్వేతా నిత్యాని కదిపి ఏమైంది అంటే... మన ప్రిన్సిపాల్ సర్కేనే నేను డాష్ ఇచ్చింది అంటూ కళ్ళలో లైట్స్ వేసుకుని...
 
అది చూసిన శ్వేత ఎందుకే అంత ఎక్సైట్ అవుతున్నావు అంటుంది...
 
చెప్పానుగా ఆయన నా క్రష్ అని అంటుంది... ఈలోపు పక్కన ఇందాక మాట్లాడుకున్న అమ్మాయిలు... అబ్బా సర్ అంటే ఎవరైనా నమ్ముతారా అసలు ఆయన్ని చూస్తే నాకు అసలు సార్లానే అనిపించలేదు... ఎం.టెక్ ఫైనల్ ఇయర్ అబ్బాయిల వున్నారు అంటూ... మాట్లాడుకుంటారు...
 
నిత్యా అవి వినలేకబైటికి వస్తుంది అలా వస్తూ చూసుకోకుండా లికిద్కి డాష్ ఇస్తుంది... వెంటనే వెనక్కి వచ్చి సొరి సర్ అంటుంది...
 
పర్లేదు నిత్య అంటాడు...
 
ఇప్పటికి తన పేరు గుర్తున్నందుకు చాలా సంతోషపడుతుంది...
 
సరే నిత్యా నేను వెళ్ళాలి అని ఆయన వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి... నిత్యా రోజుకి ఒకసారి అయిన కృష్ణని చూడకుండా వుండలేకపోతుంది... అందుకే సండే రోజు లికిద్ ఉన్న ఫొట చూసుకుంటుంది...
 
అలా అలా ఎం.టెక్ ఎండింగ్కి వచ్చేసారు...
 
ఎం.టెక్ అయిపోయింది నిత్యది ఇప్పుడు తను లికిద్ని చూడలేను అని చాలా బాధపడుతుండేది... అలా రోజులు గడుస్తున్నాయి...
 
 
ఒకరోజు నిత్యవాళ్ళ నాన్న వచ్చి ఆమ్మ నిత్య మీ అత్తయ్య వాళ్ళు నిన్ను తన ఇంటికి కోడలిగా చేసుకోవాలనిఆశపడుతున్నారమ్మ....నీకు కూడా చిన్నప్పటినుంచి మీ బావ అంటే ఇష్టం అని నిన్ను అడగాకుండా మేము పెళ్లి ఏర్పట్లు చేసాము అంటారు....
 
నిత్యా గుండెల్లో పిడుగు పడ్డట్టు అయింది... తన తండ్రి ఆనందాన్ని చూసి ఇంకేం మాట్లాడలేపోకయింది..... కానీ తను పెళ్లి కొడుకుని మాత్రం చూడలేదు... ఒకరోజు నిత్యా వాళ్ళ అత్తగారు వచ్చారు రావడం రావడంతోనే అత్త ఇన్ని రోజుల తర్వాత వచ్చేది అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది... నిత్యా
 
సారి అమ్ము అందుకే నిన్ను ఇంకెప్పుడు వైట్ చేయించనీకుండా మా ఇంటికి తీసుకెళ్తున్న కోడలిగా అంటుంది...
 
 
నిత్యకి పెళ్లి ఆనంగానే మళ్ళీ లికిద్ గుర్తొస్తాడు ..
అలా రోజులు గడుస్తున్నాయి ..నిత్యా పెళ్లి రోజు దగ్గరకి వచ్చింది పనులన్నీ వేగం పుంజుకున్నాయి....టైం ఎక్కువ లేదు అని డైరెక్ట్ ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్లి చేస్తున్నారు..
అలా ఆ బాధతోనే నిత్యా పెళ్లి అయిపోతుంది... అప్పటికి కూడా పెళ్లి కొడుకుని చూడదు ..
 
తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక మరబొమ్మల చేస్తూ ఉంటుంది...
ఆ రోజు రాత్రికె కార్యం అవ్వడం వల్ల నిత్యాని ఆ అబ్బాయిని వేరు వేరు గదుల్లోకి పంపించారు...
 
నిత్యా తన గదిలోకి వెళ్లి చాలా సేపు ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకుంది తర్వాత సాయంత్రానికి ఎవరో వచ్చి తలుపు తట్టడంతో మొఖం కడుకొచ్చి తలుపు తెరిచింది...
 
వాళ్ళు వచ్చి కార్యం కోసం నిత్యాని రెడి చేస్తున్నారు నిత్యకి చాలా బాధగా ఉంటుంది కానీ తల పైకెత్తదు... అందరూ అమ్మాయి సిగ్గుపడుతుందేమో అనుకుంటారు.. తర్వాత వాళ్లిద్దరి చేత ఉంగరాలట పులబంతి ఆట ఆడిపిస్తారు...
 
తర్వాత నిత్యాని గదిలోకి పంపించి అందరూ వెళ్ళిపోతారు..నిత్యకి ఏడుపు తన్నుకొస్తుంది...ఏవండి శ్రీమతి గారు ఇప్పటికైనా మీ దర్శన భాగ్యం మాకు కలిగిస్తారా అంటాడు ఆ వ్యక్తి...
 
 
ఆ వాయిస్ బట్టి వెంటనే తన ఎట్టి ఎదురుగా ఉన్న లికిధ్ ని చూడగానేనిజమా కాదా అని కళ్ళు నులుపుకుంటుంది... నులుపుకున్నది చాలు నువు చూసింది నిజమేలే అంటాడు...అమాంతం వెళ్లి కౌగిలించుకుని ముద్దులతో ముంచేస్తుంది... వెంటనే వెనక్కి జరిగి...అసలు అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా... అయిన మా బావతో అక్కడ నా పెళ్లి జరిగింది మరి మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటుంది అమాయకంగా...
 
ఆ సంతలో కూరగాయలు అమ్ముకోడానికి అంటాడు వెటకారంగా....
 
జోక్ కాదు సర్ సీరియస్ అంటుంది... నిత్యాని తన మీదకు లాక్కుంది కూర్చోపెట్టుకుంటు ఒసేయ్ మొద్దు నీకు ఇంకా అర్ధం కాలేదా నేనే నీ బావనే... నిన్నుఆ రోజు డాష్ ఇచ్చిన రోజు చూసిప్పుడే నీ కళ్ళు నన్ను కట్టిపడేసాయి...
 
తర్వాత అదే రోజున అనుకోకుండా మీ క్లాస్ వైపు వచ్చిన నాకు...
నువ్వు శ్వేతతో మాట్లాడింది విన్నాను ఆ కవిత నాకోసం రాసాను అన్నావు అప్పుడే నీ మెడలో ముడుముల్లు వేసి నా దాన్ని చేసుకోవాలి అనిపించింది... నా మదిలో ఎలాంటి భావాలు ఉన్నాయో నీకు అలాంటి భావాలే కలిగాయి...
 
తర్వాత నువ్వు నాకోసం రోజు ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడే ఆరాటం చూసి ... నన్ను ఎంత ప్రేమిస్తున్నవు అనేది అర్ధం అయింది...
 
తర్వాత నిన్ను మా కాలేజ్లో చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను...నువేమో అన్ని మర్చిపోయినన్ను చూస్తూ కూర్చునావు నేను అలా చూస్తూ ఉంటే ఇంకేమైనా ఉందా బాబోయి నువ్వు నా చేత ఏడూ చెరువుల నీళ్లు తాగించెయ్యవు... పైగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నఅందుకే మమయ్యకి కూడా చెప్పద్దు అని చెప్పి.... ఇలా చేసాను అంటాడు తన మెడ మీద ముద్దు పెడుతూ..నిత్యకి కళ్లలోంచి నీళ్లొచ్చేస్తాయి... తను ప్రేమించినవాడే తన జీవిత భాగస్వామి అవ్వడం ఇంకా అసలు తను కోరుకున్నది దొరకదు అనుకున్నది దొరికినందుకు తనపై తన బావకి ఉన్న ప్రేమ... ఓయ్ పిచ్చి ఇప్పుడు ఏడుస్తూ ఎనర్జీ మొత్తం వాడేస్తే .... మా అమ్మవాళ్ళకి మనవడిని మనవరాళ్ళని ఎవరిస్తారు.. అంటూ తనని అల్లుకుపోతాడు...
 
అలా ఆరాత్రి ప్రకృతి వడిలో విశ్రాంతి తీస్కున్నట్టు హాయిగా ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరతారు...
 
శుభం
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: సరైన నిర్ణయం by Sai Arpita - by k3vv3 - 24-05-2022, 07:00 PM



Users browsing this thread: 1 Guest(s)