Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు (ఇంకో చోట) మిత్రులకోసం
#79
విజయ స్వప్నం నాల్గవ భాగం
 
విజయ నిద్ర లేచేసరికి బాగా చీకటి పడింది. తలంతా దిమ్ముగా ఉంది. గడియారం చూస్తే ఏడున్నర అయింది. లేచి బయటికి వచ్చి చూసింది. గెస్ట్ హౌస్ లో లైట్ వెలుగుతోంది. మెల్లగా ప్రొద్దున్న జరిగిందంతా గుర్తుకు రాసాగింది. తను పడుకున్నప్పుడు టైము సుమారు ప్రొద్దున్న పదకొండు గంటలైనట్టుగా లీలగా గుర్తుంది. అంటే స్వప్న అప్పుడే రూమ్ లో దిగిపోయిందన్న మాట. స్వప్న గుర్తుకు రాగానే మైండ్ ఒక్కసారే ఫ్రెష్ అయిపోయింది. ప్రియురాలు గుర్తుకొచ్చిన ప్రియుడిలా మనసంతా హూషారుతో నిండిపోయింది.. గబగబా గెస్ట్ హౌస్ వైపు నడవబోయి, తన అవతారం ఒకసారి గుర్తుకు వచ్చి ఆగిపోయింది. మైండ్ లో ఉన్న హుషారు బాడీ లో లేదు. ప్రొద్దున త్రాగిన ‘రా’ విస్కీ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తోంది. శరీరం లోపలంతా ఏదో ఇన్ కన్వీనియంట్ గా అనిపిస్తోంది. స్నానానికి వెళ్ళి తొందరగా తయారై,
మెత్తని సాటిన్ నైటీ వేసుకుంది. వేడివేడిగా ఒక గ్లాసుపాలు త్రాగాక కాస్త నయమనిపించింది. స్వప్నను చూడాలనిమనసు తొందరపెడుతుంటే గబగబా గెస్ట్ హౌస్ కి వెళ్ళింది.
గెస్ట్ హౌస్ శుభ్రంగా కడిగినట్లుగా తెలుస్తోంది. అక్కడక్కడా ముగ్గులు పెట్టి ఉన్నాయి. మెల్లగా తలుపు త్రోసింది. తలుపు తీసే ఉంచినట్టుంది. మెల్లగా తెరిచి లోపలికి వెళ్ళింది. ఇల్లంతా సాంబ్రాణి వాసన, అగరొత్తుల గుభాళింపు. ఇటువంటి వాతావరణం ఈ ఇంట్లో ఎప్పుడూ లేదు. ఒకమూలలో దేవుని ఫొటోలు పెట్టి పూజ చేసినట్లుగా ఉన్నాయి. ఎంట్రెన్స్ ఎదురుగా స్వప్నతల్లితండ్రుల ఫోటోలేమో, పూల దండలు వేలాడదీసి ఉన్నాయి.

ఇటువంటి పద్ధతులు విజయకు చాలా ఇష్టం. మామూలు పనిమనుషులతో ఇటువంటి వాతావరణం తేవడం కష్టం. స్వప్నపై విజయకు ఇష్టం రెట్టింపైంది. లోపలి ఇన్నర్ రూమ్ తలుపు కూడా తీసే ఉంది. గదిలో స్వప్న ఏదో సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతోంది. సడన్ గా విజయను చూడగానే ఉలిక్కిపడి లేచింది. అప్పుడే దిగిన ఇల్లు కాబట్టి బోల్టు పెట్టుకోవడానికి సంశయించి, బావుండదని తలుపు దగ్గరగా వేసి ఉంచింది. అందువల్లనే విజయ లోపలికి రాగలిగింది.
“గుడీవెనింగ్ మేడం.”
“గుడీవెనింగ్ స్వప్నా! ఎప్పుడు వచ్చావ్? ”
“మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చాను మేడం, కాలింగ్ బెల్ కొట్టాను, మీరు నిద్ర పోతున్నట్టున్నారు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, మీరిచ్చిన తాళాలతో గెస్ట్ హౌస్ లో దిగిపోయాను. ”
“చాలా మంచి పని చేసావ్ స్వప్నా. దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రంమ్ యు. ప్రతీ చిన్న పని నా పర్మిషన్ కోసం ఆగనక్కరలేదు. చదువుకొంటున్నట్లున్నావు. ఇల్లు రేపుదయం చూపిస్తాలే.”
“ఫర్వా లేదు మేడం, అంత అర్జెంట్ గా చదవాల్సినదేమీ లేదు. రేపు మంచి రోజు. ఇప్పుడు ఇల్లు చూపించేస్తే, రేపే పని మొదలు పెట్టేస్తాను. ”
“దట్స్ గుడ్. నీలా చలాకీగా ఉన్న అమ్మాయి కోసమే నేను చూస్తున్నాను, పద.”
ఇద్దరూ బయల్దేరారు.

హుషారుగా ఇల్లంతా చూపించింది.
‘మేడంకి మందు నిషా దిగినట్టుంది’ అనుకుంది స్వప్న .
చాలా విశాలమైన ఆవరణలో విస్తరించి ఉన్న డూప్లెక్స్ ఇల్లు అది. ఇంటి చుట్టూ అన్ని వైపులా గార్డెన్ ఉంది. అన్నీ కలిపి దాదాపు ఎనిమిది రూములు ఉన్నాయి. ప్రతీ గదిలో టీవీలు, ఏసీలూ బిగించి ఉన్నాయి. హాలులో ఉన్న హెూమ్ థియేటర్ లో కావాల్సిన మూవీలు వేసుకోవచ్చు. ఏ గదికి ఆగది చాలా కళాత్మకంగా ఉంది. ఏచిన్న వస్తువు చూసినా, ఖరీదయినదిగానే అనిపిస్తోంది. ఏరెండు రూములూ ఒకలా లేవు. పైన రెండు, క్రిందరెండు బెడ్ రూములున్నాయి. అన్నింటికీ సకల సౌకర్యాలతో కూడిన అటాచ్ట్ బాత్ రూమ్ లున్నాయి. కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది. ఖరీదైన ఇంపోర్టెడ్ మైక్రోవేవ్ ఓవెన్, రెండు ఫ్రిజ్ లూ, ఇటాలియన్ క్రోకరీ లతో చాలా ఆధునికంగా ఉంది. హాలులో మినిబార్ ఉంది. టెర్రేస్ మీద ప్రత్యేకంగా ఒక చిన్నహాలు జిమ్ కోసం కేటాయించబడింది. అంత ఇంటిలో మేడం ఒక్కత్తే ఎలా వుంటుందో అర్థం కాలేదు. స్వప్నకు డ్యూటీస్ తనేమేం చెయ్యాలో అన్నీ వివరించి చెప్పేసరికి రాత్రి పదకొండు అయింది.
పరిగా
“వెళ్ళి పడుకో, స్వప్నా” అని పర్మిషన్ ఇచ్చింది. తను మాత్రం సరిగా నిద్ర రాక మరో రెండు రౌండ్లు పోసుకుని పడుకుంది.
*
**
మర్నాడు ప్రొద్దున్నే స్వప్న నాలుగున్నరకే నిద్ర లేచింది. అయిదున్న రకల్లా స్నానంచేసి పూజమూల శుభ్రం చేసి, పూలు కోసుకురావడానికి వెళ్ళింది.
గార్డెన్ నిండా రక రకాల పూల మొక్కలున్నాయి.

తోటమాలి శ్రద్ధతో పెంచినట్లుంది. స్వప్నకు పూలంటే తగని పిచ్చి. కరువు తీరా కోసుకుంది. ఒక పావుగంటలో పూజ ముగించుకుని బంగ్లా లోనికి వెళ్ళింది.
మేడం మామూలుగా ఏడింటికి లేస్తుందని రాత్రే చెప్పింది. తనను డిస్టర్బ్ చేయనక్కర లేకుండా, ఒక సెట్ తాళాలు నిన్ననే మేడం తనకు ఇచ్చింది. జాయిన్ అయ్యీ అవ్వగానే తనపై నమ్మకం ఉంచిన మేడం పై గౌరవం పెరిగింది. వాటితో బయటి నుంచే డోర్ తీసింది. బాక్స్ లో పడి ఉన్న మిల్క్ పేకెట్ లు తీసుకుని మేడంకు బ్రేక్ ఫాస్ట్ తయారు చేయసాగింది. మేడం ఆఫీసుకి వెళ్ళేవరకు తనకు అవసరమైన ఇంపార్టెంట్ పనులు మాత్రమే చూడాలి. తరువాత, మిగిలిన పనులు తీరిగ్గా చేసుకోవచ్చు.
అంతా ప్రిపేర్ చేసి, జ్యూస్ తీసి ఫ్రిజ్ లో పెట్టి, ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దిపెట్టింది. అంతా అయ్యేసరికి ఏడున్నర అయింది. గబగబా కాఫీ తయారు చేసి, మేడం ముందే చెప్పిన ప్రకారం టెర్రెస్ మీద ఉన్న జిమ్ కి తీసుకెళ్ళింది.
ఓరగా వేసి ఉన్న తలుపు మీద మృదువుగా ఒకసారి తట్టింది.
“కమిన్ స్వప్నా!” లోపలినుంచి వినిపించింది.
స్వప్న మెల్లగా తలుపు తీసి లోనికి వెళ్ళింది.
అప్పటికే మేడం నిద్రలేచి, మ్యూజిక్ పెట్టుకుని ఏరోబిక్స్ చేస్తోంది.
“గుడ్ మార్నింగ్ మేడం”.
“మార్నింగ్, స్వప్నా!” మేడం కళ్ళల్లో వెలుగు.

“కాఫీ మేడం.”
స్వప్నను చూడగానే మెల్లగా వెళ్ళి మ్యుజిక్ సిస్టమ్ ఆఫ్ చేసి, ప్రక్కనున్న టవెల్ అందుకుని చెమటను ఒకచేత్తో తుడుచుకుంటూ వచ్చి మరోచేత్తో స్వప్న చేతిలోని కాఫీ అందుకుని

“అలా కూర్చో”, అని గోడ వారనున్న కుర్చీ చూపించి తను ప్రక్కనే ఉన్న మరో ఈజీ చైర్ లో కూర్చుంది.
స్వప్న కూర్చుంది.
రిలాక్స్ అవుతూ నెమ్మదిగా స్వప్న ఇచ్చిన కాఫీ సిప్ చేయసాగింది. “వెరీ గుడ్,
కాఫీ చాలా బాగుంది.”
“థాంక్యూ మేడం”.
వెనక్కి చారగిల బడి ఒళ్ళు
మేడం ఒకసారి కప్పు ప్రక్కన పెట్టి విరుచుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది.
స్వప్న మెల్లగా తల ఎత్తి మేడం వైపు చూసింది.
మేడం పాదాలకు స్పోర్ట్ షూస్ వేసుకుని ఉంది. పైవరకు తొడలు కనిపిస్తున్న టైట్ షార్ట్స్, పైన బనియన్ లాంటి తెల్లని టీ షర్ట్ టక్ చేసుకుని ఉంది. ఒళ్ళంతా బాగా చెమటపట్టి ఉంది. తొడలమీద, మెడపైనా చెమట బిందువులు తళుక్కుమంటున్నాయి. టీ-షర్ట్ బాగా తడిచిపోయి శరీరానికి అతుక్కుపోయింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు (ఇంకో చోట) మిత్రులకోసం - by k3vv3 - 09-03-2022, 10:50 PM



Users browsing this thread: 10 Guest(s)