11-11-2018, 04:58 PM
(This post was last modified: 17-12-2018, 10:51 AM by pastispresent.)
ఎపిసోడ్ 11 - సీక్రెట్
నెక్స్ట్ రోజు నిద్ర లేసాను, ఇంకా రాజ్ పడుకొని ఉన్నాడు. నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్లి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాను. రోజు నాకు పొద్దునే లేసి జిం కి వెళ్ళటం అలవాటు. అలారమ్ లేకపోయినా నిద్ర పొద్దునే లేస్తాను. నా హై కాలేజ్ రోజుల నుంచి ఇదే అలవాటు. కాలేజ్ లో ఉన్నపుడు రోజు పొద్దున్న చదువుకునేదాన్ని. కాలేజీ రోజుల్లో అయితే వెళ్లి exercise చేసేదాన్ని. రోజు ఏదో ఒక పండు కానీ లేదా జ్యూస్ తప్పకుండ తాగుతాను.
ఒకసారి నిన్నటి అనుభవం గుర్తు చేసుకుంటే అంత చాలా ఫాస్ట్ గా గడిచినట్లనిపించింది. ఇప్పుడు రాజ్ లెస్ దాకా ఎం చేయాలో అర్ధం కాక నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసాను, ఇంకా కొన్ని లైక్స్ అలాగే కొత్త కామెంట్స్ కూడా ఉన్నాయి. ఫేస్బుక్ క్లోజ్ చేసి గేమ్స్ ఆడుతూ కూర్చున్నాను. సడన్ నా ఫోన్ మోగింది, వెంటనే సైలెంట్ చేసాను.
ఇంతలో రాజ్ లేసాడు "టైం ఎంత ??" అని అడిగాడు.
"5:10" అని చెప్పను.
"అప్పుడే లేసావా ??"
"య 5 కె లేసాను....."
"నేను జనరల్ గా 6 కి లేస్తాను.....అవును నా ఫోన్ ఏమైనా మోగిందా ఇప్పడు??" అని అడిగాడు.
లేదు అని "ఊహు...." అంటూ తల ఊపాను.
"కింద జిం ఉంది కావాలంటే, వెళ్లొచ్చు.....అన్నాడు"
నేను ఇది హోటల్ అన్న సంగతే మరచిపోయాను. నేను వెంటనే "ఏ ఫ్లోర్ ??" అని అడిగాను.
"1st ఫ్లోర్ అనుకుంట....హోటల్ రిసెప్షన్ కి ట్రై చేసి అడుగు లేదంటే....."
"ఒకే" అన్నాను.
"మ్యూజిక్ కోసం earphones కావాలంటే అదిగో ఆ టేబుల్ మీదే పెట్టాను.... నువ్వు జిం నుంచి వచ్చాక రెడీ అవ్వాలంటే...... టవల్స్ ఉన్నాయి అదిగో అక్కడ cupboard లో....హోటల్ వాళ్ళు సోప్ షాంపూ బ్రష్ పేస్ట్ అన్ని ఇచ్చారు....ఆ వాష్ బేసిన్ కింద అరలో ఉంటాయి......నన్ను డిస్టర్బ్ చేయకు నేను ఈ రోజు జిం కి వెళ్లట్లేదు.....నన్ను 6:30కి లేపు.... ఓకేనా ?? బాయ్" అని చెప్పి మల్ల పడుకున్నాడు రాజ్.
చూడటానికి మంచోడు లాగే ఉన్నాడు. నేను కొంచెం బాగా stressed గా ఉండేసరికి జిం కి వెళ్లాలని డిసైడ్ అయ్యాను కానీ జిం కోసం బట్టలు లేవు అందుకే ఉండిపోయాను. కానీ రూమ్ లో బాగా స్పేస్ ఉండేసరికి కొంచెంసేపు యోగ చేద్దామనుకున్నాను. కొంచెం పక్కనున్న పోర్షన్ కి వెళ్లి గది కర్టెన్స్ ను తీయగానే కొంచెం వెలుతురు వచ్చింది. నా ఫోన్ లో యాప్ లాంచ్ చేసి కొంచెం సేపు సూర్యనమస్కరం ఆ తర్వాత యోగ చేసాను.
ఆ తర్వాత బాత్రూం కి వెళ్లి బట్టలన్నీ ఇప్పేసి షవర్ కింద నిల్చున్నాను. బాత్రూం చాల పెద్దగా ఖరీదుగా ఉంది. హాట్ వాటర్ కూడా వస్తున్నాయి. జుట్టు ముడి విప్పేసి షవర్ కింద నిల్చొని స్నానం చేయటం స్టార్ట్ చేసాను.
అసలు నేను చేస్తుంది తప్ప కరెక్టా అర్ధం కాలేదు. షవర్ లో స్నానం చేసాక, టవల్ తీసుకొని తుడుచుకొని నా చుట్టూ కట్టుకున్నాను. అడ్డం దగ్గరకు వెళ్లి కొంచెం సెక్సీ గా ఫోజులు కొట్టి ఒక పెద్ద మోడల్ లాగ ఫీల్ అయ్యాను. నా హెయిర్ అక్కడ ఉన్న డ్రైయర్ తో ఆరబెట్టుకొని, జుట్టును నీట్ గా అద్జుస్త్ చేసుకున్నాను. మేకప్ వేసుకుందామంటే నా హ్యాండ్బ్యాగ్ తలేదు.
టవల్ తీసేసి నా టి-షర్ట్ జీన్స్ వేసుకొని బయటకి వచ్చాను.
"సెక్సీ గర్ల్ నేహా ఎం చేస్తుంది ??" అని అడిగాడు రాజ్.
కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకో ఆఫెన్సివ్ గా అనిపించలేదు. చెప్పాలంటే కొంచెం స్వీట్ గా అనిపించింది. ఎందుకో నవ్వు కూడా వచ్చింది ఎందుకో తెలియదు.
"కం ఆన్! సెక్సీ గర్ల్ నేహా ఎం చేస్తుంది ??" అని మల్ల అడిగాడు.
"రెడీ అవుతోంది" అని చెప్పాను.
"సరే సెక్సీ గర్ల్, ఫోన్ చేసి ఇద్దరికీ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయి" అని చెప్పాడు.
"ఇప్పుడేనా ??" అన్నాను.
"యా మనం బయటకు వెళ్తున్నాం.....అది రావటానికి అరగంట పడుతుంది...నేను ఈ లోపల రెడీ అయ్యి వస్తాను"
"బయటక ఎక్కడికి ??" అని అడిగాను.
"చెప్పను ssshhh surprise " అన్నాడు.
నేనేమి మాట్లాడలేదు.
"నీకు బాగా నచ్చుతుంది ఆ చోటు.....ఇద్దరికీ మంచి ప్రైవసీ అక్కడైతే" అని చెప్పాడు.
నిజానికి నేను డిస్కంఫోర్ట్ ఫీల్ అవ్వాలి కానీ ఎందుకో నాలో excitement వచ్చింది. ఎందుకో తెలియదు. ఎందుకో ఈ రోజు రాజ్ కొంచెం డిఫరెంట్ గా కనిపించాడు. మే బి నిన్న నేను తనని కలవలేదు కాబట్టి చాల డిఫరెంట్ గా ఊహించుకున్నాను. ఇప్పుడు కలిసాను కాబట్టి చాల వేరుగా కనిపిస్తున్నాడు.
నేను వెళ్లి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి ఫాస్ట్ గా తెమ్మని చెప్పను. నాకోసం జ్యూస్ కూడా చెప్పుకున్నాను.
నా ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. నిన్నే వచ్చింది కానీ నేను చూడలేదు. ఎవరో అకౌంట్స్ పర్సన్ అనుకుంట, నా బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ అడిగాడు. ఎమర్జెన్సీ అని రాజ్ రాసాడు కాబట్టి ఇలా అడుగుతున్నట్లు ఉన్నారు. నేను నా అకౌంట్ డీటెయిల్స్ పంపించాను.
ఒక ఇమెయిల్ కూడా వచ్చింది కంపెనీ నుంచి. నన్ను ప్రమోట్ చేస్తున్నట్లు, త్వరలో అప్పోయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని. నాకసలు ఏమి అర్ధం కాలేదు. ఒకేసారి చాల సంతోషంగా ఫీల్ అయ్యాను. అలాగే మెసేజెస్ ఓపెన్ చేసి చూస్తే "చెక్ యువర్ ఇమెయిల్. సేంట్ యువర్ ప్రమోషన్ ఇమెయిల్" అని రాసుంది. చాలా shocking గా ఫీల్ అయ్యాను. నాకేమి అర్ధం కాలేదు.
ఈ లోపల ఫోన్ మోగింది. నా ఫోన్ కాదు. సౌండ్ ఎక్కడినుంచో వస్తుంది. నేను వెళ్లి వెతికాను. రాజ్ ఫోన్ లాగా ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే ఫోన్ పడుకోపెట్టి ఉంది. ఫోన్ ని సైలెంట్ లో పెడదామని ఫోన్ చేతులోకి తీసుకొని చూసాను "నైనా డార్లింగ్" అని రాసుంది. ఒక అందమైన అమ్మాయి నవ్వుతు ఉన్న ఫోటో ఉంది ఫోన్ పైన. నిజంగా చాలా అందంగా ఉంది. రాజ్ girlfriend అనుకుంట.
అది చూసి కొంచెం ఆశ్చర్యపోయాను, ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ ని పెట్టుకొని నన్నెందుకు ఇలా పిలిచాడో అర్ధంకాలేదు. కాల్ కట్ అయ్యాక చూస్తే చాలా మెసేజెస్ కనిపించాయి :
"ఐ లవ్ యు రాజ్"
"ఐ మిస్ యు రాజ్"
"డార్లింగ్ కాల్ మీ వెన్ ఫ్రీ"
"వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ రాజ్"
స్క్రోల్ చేసి చూసాను చాలా మెసేజెస్ ఉన్నాయి అలాంటివి. ఒక 5 మిస్సేడ్ కాల్స్ ఉన్నాయి.
ఇదంతా చూసి నాకేమి అర్ధం అసలు కాలేదు. నాకు అశ్విన్ నుంచి వచ్చిన ఇమెయిల్, SMS. రాజ్ ఫోన్ లో ఉన్న మెసేజెస్, రాజ్ నాతో ప్రవర్తించిన తీరు.
ఈ లోపల రాజ్ స్నానం నుంచి బయటకు వచ్చాడు. నేను కొంచెం ఆలోచనలో ఉండేసరికి ఫోన్ నా చేతులలోనే ఉంది.
రాజ్ ఫోన్ నా చేతుల్లో ఉండటం చూసాడు. ఎం చేయాలో నాకు అర్ధం కాలేదు.
టు బి కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.