Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
ఇద్దరు చేతుల్లో చేతులు వేసుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే వాళ్ళ మూగ ప్రేమ ని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ రూంనుండి బైటికి వచ్చి కిచెన్ లోకి వెళ్ళింది రియా తన వెనకే అను కిచెన్ లోకి వెళ్లి రియా తో “ఏంటి వదిన ఇది నువ్వు మరి ఓవర్ గా చూపిస్తున్నావ్ దాని పైన ప్రేమ ఎందుకిలా చేస్తున్నావ్ ఏమైంది నీకు ఎవత్తది దాని పైన అంత కన్సర్న్ ఎందుకు నీకు చెప్పు” అప్పుడు రియా “ ష్ మెల్లిగా ఎందుకు అలా అరుస్తున్నావ్ తనకి వినిపించేలా”.

మరి చెప్పు ఎందుకు నువ్వు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్ అని అను మళ్ళీ అడిగింది దానికి రియా “ఆ అమ్మాయి కి మన అర్జున్ అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్న తన తో కూడా చెప్పేసా అర్జున్ పూర్తిగా కొలుకోగానే పెళ్లి జరిపిస్తామని” అని బాంబ్ పేల్చింది. అప్పుడు అను వాట్…….? మనసులో (అర్జున్ ని ఇది పెళ్లి చేసుకుంటే మరి నా పరిస్థితేంటి అర్జున్ అంటే నాకు కూడా చాలా ఇష్టం లవ్ అట్ ఫస్ట్ సైట్, మా వదిన కి దాని ప్రేమ కనిపించింది కానీ నా ప్రేమ కనిపించలేదా, హాస్టల్ నుండి కాల్ చేసిన ప్రతి సారి అర్జున్ గురించి అడుగుతూనే ఉంటాను అది తెలియలేదా). హే అను… అను అని రియా పీలుస్తుంటే తన ఆలోచనలనుండి బైటికి వచ్చి ఏంటి వదిన ఎం మాట్లాడుతున్నావ్ అది ఎవరో ఎంటో తెలియదు దానికి అర్జున్ కి పెళ్లా అసలు ఎలా వచ్చింది నికి థాట్.

దీనిలో ఏముంది తనకి అర్జున్ అంటే ఇష్టం అని చెప్పకదా అందుకే పెళ్లి చేద్దాం అనుకున్నా ఎం నేను మీ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అప్పుడు మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు కానీ నేను అలా కాదు ప్రేమికులని విడదీసేఅంత చెడ్డదాన్ని అసలే కాదు అందుకే అలా అన్న ఇందులో ఏముంది మీ అన్నయ్య కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు అసలేంటి మీరు తాను ఎవరైతే ఏంటి తనకి అర్జున్ పైన ఎంతో ప్రేముందో లేకపోతే ఇన్నేళ్లు అర్జున్ ని కంటికి రెప్పలా కాపాడుకోలేదు.
ఏంటి కాపాడుకుండా తొక్కేమ్ కాదు అది దాని జాబ్ పేషెంట్ కి కేర్ తీసుకోవడం ఇదే పని ఇంకెవరైన చేసుంటే వాళ్ళకి కూడా అర్జున్ అంటే కన్సర్న్ ఉంటే పెళ్లి చేసేస్తావ్ చెత్తగా వాగకొదిన అర్జున్ కి కూడా అదంటే ఇష్టం ఉందా ముందు అది తెలుసుకో అప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వొచ్చు అసలు దీన్ని అంటూ అర్జున్ గదివైపు వెళ్తుంటే హే ఎక్కడికి అంటూ అను చేయి పట్టుకుని ఆపేసింది రియా.

ఉండొదిన అసలు ఇది వదులు నన్ను పోయింది అటే పోక మళ్ళీ వచ్చింది రేపు వాళ్లంతా వస్తున్నారు పూర్ణిమ MBBS చేసింది గా తానే వాళ్ళ అన్న కి టేక్ కేర్ చేస్తుంది దీన్ని ముందు ఇక్కడినుంది పంపించేయి, వాళ్ళు వచ్చాక ఎలాగో కొత్తింట్లోకి వెళ్తున్నాం గా అక్కడికి ఇది రాకూడదు చెప్తున్నా అంటూ రియా చేయి వదిలించుకుని బెడ్రూం లోకి వెళ్లి డోర్ గట్టిగా వేసేసుకుంది.

ఇక్కడ అర్జున్ రూం డోర్ దగ్గర నించుని రియా అను మాట్లాడుకుందాంతా విని చాలా బాధపడి పోతుంది నర్స్ పాప ఎవరికి చెప్పకుండా ఇక్కడినుంది కూడా వెళ్లిపోదామని నిర్ణయం తీసుకుని అర్జున్ దగ్గరికి వెళ్లి చూసింది వాడికి కూడా అను రియా మాట్లాడుకుందాంతా వినిపించింది కానీ ఎం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేడు, నర్స్ పాప వాడి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని ఎదో చెప్పే లోపు వాడు వద్దు అన్నట్టు తల అడ్డంగా ఉపేసరికి వాడికి తాను ఎం చెప్పదలుచుకుందో అర్థం అయ్యే సరికి వాడి గుండెల పైన పడి కూని రాగాలు తీస్తుంది. వాడు తన తల పైన చేయి వేసి ఓదారుస్తున్నాడు.

ఇక్కడ రూం లో దూరి తలుపేసుకున్న అను మంచం పైన బోర్లా పడుకుని కాసేపు బాధపడి ఎలాగైనా నర్స్ ని పంపించేయాలి అని డిసైడ్ అయ్యి ఏవేవో ప్లన్స్ వేస్తుంది, ఇంతలో తనకో కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి చూస్తే ఎవరిదో మొగ గొంతు ఆ గొంతు గుర్తు పట్టి కోపంగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి కాల్ కట్ చేసి రూం లోనుండి బైటికి వచ్చి అర్జున్ గది వైపు వెళ్తుంటే హాల్ లో టీ వీ చూస్తున్న రియా అను ని చూసి తన దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని తన సమస్య ఏంటి అడిగింది.

అను ఎం సమాధానం చెప్పలేదు రియా కి అను ఎదో ప్రాబ్లెమ్ లో ఉందని అర్థమై కాస్త గట్టిగా ఏమైంది అని అడిగితే అప్పుడు అను వీలైనంత త్వరగా ఆ నర్స్ ని పంపించేయి అప్పుడే నీతో మాట్లాడుతాను అని పక్కనే ఉన్న టీ వీ రిమోట్ తీసుకుని ఛానల్ మారుస్తూ కూర్చుంది. రియా కి ఎం అర్థం కాలేదు అర్జున్ తో ఆ నర్స్ ఉంటే దీనికి ఎందుకు అంత కోపం వస్తుంది అని ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో కార్తిక్ వచ్చి రియా ని పిలిచాడు,

రియా కార్తిక్ తో ఏంటి అప్పుడే వచ్చేసావ్ అని అడుగుతుంటే మనం బయల్దేరాలి కింద పాకెర్స్ వాళ్ళు వచ్చారు సామాన్లు మూవ్ చేయడానికి మీరు నా కార్ తీసుకుని వెళ్ళండి ఇదిగో అడ్రస్ అని తన మొబైల్ నుండి లొకేషన్ అను మొబైల్ కి షేర్ చేసి కీస్ సోఫా లో పడేసి బైటికి వెళ్తుంటే మిరెక్కడికి అని అడిగితే నేను క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న రేపు మార్నింగ్ వాళ్ళు వస్తున్నారుగా లేట్ అయితే క్యాబ్స్ దొరకవు బై అంటూ వెళ్ళిపోయాడు.

పాకెర్స్ వాళ్ళు వచ్చి మెల్లిమెల్లిగా సామాన్లు మూవ్ చేస్తున్నారు అను ఇంకా రియా వాళ్ళతో జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ అన్ని లారీ లోకి ఎక్కించి వాళ్ళ సహాయం టోన్ అర్జున్ ని కార్ కో కూర్చోపెట్టించి రియా డ్రైవ్ చేస్తుంటే అను పక్కనే కూర్చుని అడ్రస్ చెప్తుంటే వెనక సీట్ లో నర్స్ పక్కనే అర్జున్ కూర్చుని కొట్టింటి దారి పట్టారు.
మీ 
Uదై
[+] 3 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: భారతంలో అర్జునుడు - by INCESTIOUSLOVER - 03-05-2019, 08:16 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: 2 Guest(s)