20-12-2018, 10:21 AM
(19-12-2018, 11:34 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
నిన్ననే మీ ఈ కథని పూర్తి చేశాను.
చాలా బాగా వ్రాశారు.
ఒక్క ఎపిసోడ్ ని కూడ వ్రాయకుండా కథని మొదలుపెట్టి ఇలా విజయవంతంగా కథని వ్రాయగలగటం సాధారణ విషయం కాదు.
ఒకసారి ఎవరో ఒక ప్రముఖ దర్శకుడిని ఇలా అడిగారట— "ఏంటి సార్... ఎంత వరకూ వచ్ఛింది సినిమా?" అనీ.
దానికాయన — "ఇదుగో... కథ సిద్ధమైపోయింది. ఇక మిగిలిన పదిశాతం (సినిమా చిత్రీకరణ) మాత్రం మిగిలిందంతే!" అన్నారంట. కథ పక్కాగా వుంటే ఆ ధైర్యం ముందుకు నడిపించేస్తుంది.
మీరు ఈ కథను ఎప్పుడో మీ మనసులో సిద్ధంచేసేశారు. అందుకే, అంత చక్కగా, ఏ తడబాటు లేకుండా వ్రాసేయగలిగారు.
ఈ కథను చదవక ముందు నేను ఊహించిన థీమ్ వేరు. ఈ కథ థీమ్ కాస్త మారింది.
మామూలుగా తటస్థ వ్యక్తి కోణంలో సాగే కథలకూ, మొదటి, రెండవ వ్యక్తి కోణాలు (నేను, నువ్వు...) గల కథలకూ చాలా తేడా వుంటుంది.
తటస్థ కోణంలో — ఒక్కో పాత్రని గురించీ సెపరేట్‌గా వ్రాస్తూ వారి భావాలను ప్రకటింపచేయవచ్చు.
కానీ, ఇలా ఓ పాత్రతో నెరేట్ చేస్తూ వ్రాసేప్పుడు ఆ సదరు వ్యక్తి ద్వారా మిగతా పాత్రలను మనం చూస్తాం.
ఉదాహరణకు యండమూరి గారి రచనలయిన అంతర్ముఖం, లేడీస్ హాస్టల్!
మొదటి రచనలో ఒక పాత్ర నెరేట్ చేస్తూ వ్రాస్తుంది. అదే రెండవదానిలో ప్రతి పాత్ర... వాటి ఆలోచనా, వాటన్నిటి గురించి చాలా డీప్ గా వుంటుంది. రాయన్న ఒకలా, అనంతలక్ష్మి ఒకలా... అలా అన్నమాట!
మీ రచనలో మీరు వాడిన కొన్ని పదాలు, ఉపమానాలు, సామెతలు చాలా బాగున్నాయి!
అయితే, అక్కడక్కడా కథనం కాస్త కచ్చాపచ్చాగా అన్పించింది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్స్ లో...!
ఇక, శృంగారానికి అన్ని సొబగులూ (బలవంతంగా, మొరటుగా, సున్నితంగా, బూతులతో, కలలో శృంగారం, కక్కోల్డ్... ఇలా) అద్దటానికి మీరు ప్రయత్నించిన విధానం చాలా బావుంది. కానీ మీరన్నట్లుగా అక్కడ మీ ఇబ్బంది కొద్దిగా కన్పించింది. నాకైతే, వాళ్ళ హనీమూన్ చదివేప్పుడు ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే నవల గుర్తుకొచ్చింది. ఆ ఊయల మంచం... రతి జరిపిన తరువాత ఆ జంట ఒకర్నొకరు చూసుకొని నవ్వుకోవటం చదివేప్పుడు భలేగా కన్పించింది.
అవును... నిజంగానే కన్పించింది.
ఎందుకంటే... ఈ కథని చదివేప్పుడు నేను సినిమాలా అనుకొని చదివాను.
ఐతే, కొత్తవారిని కాక అరవై, డెబ్బై దశకంలో ఉన్న నటీనటులను ఆయా పాత్రలుగా భావిస్తూ చదివాను.
ఉదాహరణకు —
రవి - హరనాథ్
రాజు - రంగనాథ్
అక్షర - నవలా(రాణి) నాయిక 'వాణిశ్రీ'
ప్రకాష్ - కైకాల సత్యనారాయణ
లావణ్య - విజయలలిత
అక్షర అక్క - జమున
..... అలా అన్నమాట!
ఆసలు మీరనుకున్న లైన్ లో లావణ్య, ప్రకాష్ లేరన్నారు. మరి వాళ్ళు లేకుండా వుంటే కథ ఏ తీరిన సాగేదా అన్పించింది...
Xossip కోసం మార్చాను అన్నారు. అలా కాకపోతే ఈ కథ ఇంకా బావుండేదేమో! కుదిరితే, ఒకసారి మామూలుగా ఈ కథని మీరు వ్రాయండి. ఆ వ్రాసిన ప్రతిని ఏ స్వాతీ మేగజైన్ కో పంపండి. లేప్పోతే, ఇంకెవరైనా ఆ పని చేసేయ్యగలరు.
ఇంత అద్భుతమైన కథని మాకు అందించినందుకు ధన్యవాదాలు లక్ష్మిగారు.
అలాగే దీన్ని పిడిఎఫ్ గా మార్చిన లక్కీవైరస్ కూ ధన్యవాదాలు.
మీ నుంచి మరో కథను ఆశిస్తున్నాం లక్ష్మిగారూ...
లేటైనా పర్లేదు. అదిరిపోవాలి!
వికటకవి
Superb Explanation Vikatakavi2... Miru Cheppindi 100% Right....