19-12-2018, 07:37 AM
పన్నెండేళ్ల బాలుడి అకృత్యం
యువతులు స్నానాలు చేస్తుండగా ట్యాబ్‌తో చిత్రీకరణ
మహిళా వసతి గృహనిర్వాహకుల ఫిర్యాదు
సెక్యూరిటీ ఆఫీసర్ల అదుపులో నిందితుడు
మాదాపూర్, న్యూస్‌టుడే: తెలిసీ తెలియని వయస్సులో ఓ బాలుడు చేసిన నిర్వాకం అతని తల్లిదండ్రుల్ని తలదించుకొనేలా చేసింది. సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. ఆడుకోవడం కోసమని కొనిచ్చిన ట్యాబ్‌తో అమ్మాయిలు స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తూ ఘోర తప్పిదానికి పాల్పడ్డాడు. దాదాపు 3వేలకుపైగా వీడియోలు, చిత్రాలు ఆ బాలుడి ట్యాబ్‌లో లభించడాన్ని చూసి సెక్యూరిటీ ఆఫీసర్లు అవాక్కయ్యారు. మాదాపూర్ సెక్యూరిటీ అధికారిస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైటెక్ సిటీ ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్న బాలుడి(12) ఇంటిని అనుకునే మహిళా వసతి గృహం ఉంది. అక్కడి యువతులు స్నానం చేస్తున్న దృశ్యాలను బాలుడు ట్యాబ్‌తో చిత్రీకరిస్తూ వస్తున్నాడు. ఈ నెల 16న సాయంత్రం ఓ యువతి స్నానం చేస్తూ కిటికీ దగ్గర అలికిడైనట్టు గుర్తించింది. అప్రమత్తమై పరికించి చూసింది. పక్కింటి బాల్కనీ నుంచి ఓ బాలుడు చేతిలో ట్యాబ్‌తో పరుగులు తీస్తుండగా గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించింది. వారు బాలుడిని ప్రశ్నించడంతోపాటు ట్యాబ్‌లోని దృశ్యాలు, చిత్రాలను పరిశీలించారు. సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ ఆఫీసర్లు బాలుడిని అదుపులోకి తీసుకొని ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలుడు దాదాపు ఆరు నెలలుగా ఈ పనిచేస్తున్నట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. వాటిని ఎవరికైనా పంపించాడా? తన వద్దే ఉంచుకున్నాడా? అనేది ఆరా తీస్తున్నారు. ఈ బాలుడు వెనుక ఆకతాయిలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK