10-11-2018, 09:10 PM
(08-11-2018, 10:58 PM)annepu Wrote: కావలెను
ఇరవై ఆరు సంవత్సరాల, ఆరు నెలల పదహారు రోజుల, ఆరు గంటల వయసు వున్న అందమైన అయిదు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు వున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ (యావరేజ్ ర్యాంకర్)ని అయిన నాకు ఒక సంవత్సరం అటు ఇటుగా వుండి, ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ నన్ను 'హౌస్ హజ్బెండ్'గా స్వీకరించి, జీతం (భర్తగా ఉద్యోగం చేస్తున్నందుకు), కూడా ఇచ్చే అందమైన లేదా యావరేజ్ అందమైన యువతి భార్యగా కావలెను. మీరు ఇచ్చే జీతభత్యాల వివరాలతో సంప్రదించవలసిన లేదా ఎస్.ఎమ్. ఎస్ చేయవలసిన ఫోన్ నంబర్.....
అనిరుద్ర
92XXXXXXXX
****
వైజాగ్... సాయంత్రం ఆరు గంటలు....
అప్పటివరకూ గృహిణిలా ఒద్దికగా గంభీరంగా వున్న బీచ్ సాయంత్రం అయ్యేసరికి టీనేజ్ అమ్మాయిలా హొయలుపోతోంది.
కుర్రకారుకు మత్తెక్కించే అమ్మాయి సొగసుల్లా సముద్రపు అలలు వీక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి.
సముద్రం ఒక్కసారి ఆఫ్ బీట్ సినిమాలా, మరోసారి బాక్సాఫీసు మసాలాలా కనిపిస్తోంది.
సముద్రపు ఒడ్డున వున్న బీచ్ అమ్మాయి చీర పమిటలా ఉంది.
సముద్రపు అలలు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నట్టున్నాయి. బీచ్లో సన తలారా స్నానం చేయిస్తున్నాయి. సముద్రపు అలలు. సముద్రాన్ని తలవంచి పెట్టుకుంటున్నట్టుంది ఆకాశం.
పెళ్లయిన వాళ్లకు, పెళ్లికాని వాళ్లకు, ప్రేమలో పడ్డవాళ్లకు, ప్రేమలో దెబ్బతిన.. పిల్లలకు, వృద్దులకు ఆ బీచ్ ఒక రిలాక్సేషన్... ఒక కామన్ ప్లాట్ ఫామ్.
***
ఇసుకలో వెల్లకిలా పడుకొని దూరంగా ఆకాశాన్ని తరుముకుంటూ వెళ్తోన్న సముద్ర అలలను చూస్తున్నాడు అనిరుద్ర.
“అనిరుద్ర... నీకు సముద్రాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది?” అడిగాడు కార్తీక్
అనిరుద్ర మరోసారి సముద్రం వంక చూసి ఆ తర్వాత తల తిప్పకుండానే, “ట్యాంకర్ తో సముద్రపు నీళ్లని తోడి హైదరాబాద్లో నీళ్ల కరువు వున్న ఏరియాల్లో అమ్మాలనిపిస్తోంది” చెప్పాడు.
“ఏ ప్రశ్నకూ సీరియస్గా జవాబు చెప్పే అలవాటు లేదా?” అడిగాడు కార్తీక్.
“నేనిప్పుడు సీరియస్ గానే చెప్పాను... ఇప్పుడు నీళ్లని మించిన గుడ్ బిజినెస్ లేదు" అన్నాడు అనిరుద్ర.
“అనవసరంగా నిన్ను కదిలించి పొరపాటు చేశాను. అన్నట్టు మన దగ్గర క్యాష్ ఎంతుంది?”
“మన అంటే నిన్ను నన్ను కలిపా? అయినా 'మన'లో 'నీ' తీసేస్తే నా దగ్గర క్యాష్ లేదు... ఎట్ లీస్ట్ యాష్ (బూడిద) కూడా లేదు...”
“అదేంటి... బొత్తిగా క్యాష్ లేకుండా బయటకు ఎలా వచ్చావు?” .
“చెప్పులు వేసుకొని... నడుచుకుంటూ వచ్చాను” "కామెడీనా?”
“సీరియస్సే.... కామెడీ అండర్ కరెంట్”
కార్తీక్ ఓసారి అనిరుద్ర వంక చూశాడు. మొహంలో ఎప్పుడూ ఫ్రెష్ నెస్సే... అతని మనసులో ఏ ఫీలింగ్ వుందో కూడా తెలియదు. ఆరేళ్లుగా అనిరుద్రతో పరిచయం వున్నా అనిరుద్ర అతనికి అర్థంకాలేదు. అతనిలోని టిపికల్ థింకింగ్ మాత్రం కార్తీక్ కి చాలా ఇష్టం. .
“కార్తీక్... ఈ టైంలో బీచ్లో అమ్మే ముంతకింది పప్పుగానీ, మిరపకాయ బజ్జీలుగాని తింటే బావుంటుంది కదూ...” అడిగాడు అనిరుద్ర.
“ఎందుకలా అనుకుంటున్నావు?”
“రాత్రి ఓ నవల చదివాను. పేరు 'ఒక గుండె సవ్వడి” అనుకుంటాను. అందులో హీరోయిన్ కు ఇలాంటి కోరిక పుడుతుంది”
“నీకో విషయం తెలుసా అనిరుద్ర....” గుసగుసగా అన్నాడు కార్తీక్.
“ఏమిటి... ఆ కథలో హీరోవి నువ్వేనా?” నవ్వుతూ అడిగాడు అనిరుద్ర.
“కాదు... ఆ నవల రాసింది మనమే” ఇంకా గుసగుసగా అన్నాడు. అనిరుద్ర తాపీగా చూసి, “ఒహో... అలాగా....” అన్నాడు.
“అదేంటి షాకవట్లేదు... కార్తీక్ అసహనంగా అడిగాడు.
“షాకా... ఎందుకు? రాసే ఉంటావ్... అన్నట్టు నువ్వెప్పుడు సెక్స్ మార్పిడి చేయించుకున్నావ్?” మరింత తాపీగా అడిగాడు అనిరుద్ర. .
“ఏం... ఎందుకలా అడుగుతున్నావ్?”
“మరేం లేదు... ఆ నవల రాసింది రచయిత కాదు రచయిత్రి...." చెప్పాడు అనిరుద్ర.
***
ఒక్కసారిగా బీచ్లో చిన్న కలకలం.
“అనిరుద్రా... టీవీ వాళ్లు....” హుషారుగా చెప్పాడు కార్తీక్. “అయితే ఏంటి?” అడిగాడు అనిరుద్ర.
“అయితే ఏమిటంటావేంటి? మనమెల్లి వాళ్ల ఎదురుగా నిలబడితే, కెమెరాలోపడి టీవీలో కనిపిస్తాం” ఉత్సాహంగా చెప్పాడు కార్తీక్. .
ఈటీవీలో కనిపిస్తే ఏమిటి?” అని అడిగా “మనల్ని అందరూ చూస్తారు”
“చూస్తే....”
వెర్రిగా చూశాడు కార్తీక్.
“చూస్తే ఏమిటంటే ఏం చెప్పాలి? అందరూ మనల్ని గుర్తుపడతారు”
“గుర్తుపడితే ఏంటి? అని అడుగుతున్నాను”
తలపట్టుకున్నాడు కార్తీక్. ఈలోగా ఓ యాంకర్ మైక్ పట్టుకొని అటువైపే వస్తోంది. వెనకే కెమెరామేన్...
తన కార్తీక్ జేబులోని దువ్వెన తీసి క్రాఫ్ సరిచేసుకున్నాడు.
***
“ఎక్స్ క్యూజ్ మీ... మేము డ్రీమ్ టీవీ నుండి వస్తున్నాం.
'ఏం చేయాలనుకుంటున్నారు?” అనే కాన్సెప్ట్ తో స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రేమికులు, పెళ్లయిన వాళ్లు, నిరుద్యోగులు, వైద్యులు, మహిళలు... ఇలా ఎవరైనా సరే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పొచ్చు...” కార్తీక్ వైపు చూస్తూ చెప్పింది యాంకర్.
కార్తీక్ కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు. మైక్ చేతిలోకి తీసుకున్నాడు.
“హలో... ఐయామ్ కార్తీక్... పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. నాకు పెద్ద రైటర్గా పేరు తెచ్చుకోవాలని ఉంది. భవిష్యత్తులో రైటర్ని కావాలనుకుంటున్నాను”
“రైటరా.... ఇప్పుడు పత్రికలు చదివే వాళ్లు ఉన్నారా?” అడిగింది యాంకర్.
“ఏం... మార్కెట్లో పత్రికలు అమ్మడం లేదా?? "
“నా ఉద్దేశం అదికాదండీ... రైటర్ అంటే మార్కెట్ ఉంటుందా? అని”
“విదేశాల్లో రైటర్లు కార్లలో తిరుగుతారు. మన రైటర్లు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు. టి.వి.కి, సినిమాలకు, పత్రికలకు రాసి బోల్డు సంపాదించవచ్చు...
“సో... మీరు భవిష్యత్తులో రైటర్ అవ్వాలనుకుంటున్నారు... ఆల్ ది బెస్ట్ అండీ.., ఇప్పుడు కెమెరా అనిరుద్ర వైపు తిరిగింది.
“మీరేం చేయాలనుకుంటున్నారండీ....” యాంకర్ అనిరుద్రను అడిగింది.
“చెప్తే నాకెంతిస్తారు?” అడిగాడు అనిరుద్ర. యాంకర్ షాకయ్యింది. 'స్టాప్....' అని అరిచింది కెమెరామెన్ వైపు చూసి.
“నాకర్ధం కాలేదు....” అంది అయోమయంగా.
“మీ ప్రోగ్రాంలో పాల్గొంటే నాకెంతిస్తారు? అని అడుగుతున్నాను”
“మేము ఇవ్వడమేమిటండీ... ఇది సరదాగా చేస్తున్న ప్రోగ్రామ్... మీ అభిప్రాయాలను ప్రేక్షకులు చూస్తారు. మిమ్మల్ని గుర్తుపడతారు”
“నా అభిప్రాయాలను ప్రేక్షకులు చూస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? నన్ను గుర్తుపట్టడం వల్ల నాకు ఒరిగేదేమిటి? నేనేం సినిమాస్టార్ నో, బిజినెస్ మేన్నో, ఎట్లీస్ట్ డర్టీ పొలిటీషియన్ నో కాదు కదా.... అయినా ఈ ప్రోగ్రామ్ చేయడానికి మీరు యాంకరింగ్ కు డబ్బు తీసుకుంటున్నారు కదా....” అనిరుద్ర అడిగాడు.
“తీసుకుంటున్నాను”
“ఈ కెమెరామెన్”
“తీసుకుంటున్నాడు”
“క్యాసెట్ డబ్బు పెట్టే కొంటున్నారు కదా”
“అవును”
“షూటింగ్ కు, టెలికాస్ట్ కు, మీ కాస్ట్యూమ్స్ కు అన్నింటికీ డబ్బు ఖర్చవుతుంది కదా”
“అవును... అయితే ఏమిటి?
“ఈ డబ్బంతా ఈ ప్రోగ్రామ్ కోసమే కదా ఖర్చవుతోంది” “అవును”
“మరి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మాకు డబ్బు ఎందుకు ఇవ్వరు?” అనిరుద్ర ప్రశ్న వేశాడు.
షాకవడం యాంకర్ వంతయ్యింది. ఇలాంటి రెస్పాన్స్ ఆమె ఊహించలేదు.
“సారీ అండీ... మేము కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కు రెమ్యునరేషన్ పే చేస్తాం. అదీ మా చానెల్స్ యాజమాన్యం చేతిలో ఉంటుంది. అయినా మీ ప్రశ్న కొంత లాజికల్గా ఉంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు?”
“చెప్పానుగా.. లాభం లేకుండా ఏ పనీ చేయాలనుకోవడం లేదు”
“ఈ బీచ్ కు రావడం వల్ల మీకు లాభం కలిగిందా?” అడిగింది యాంకర్.
“గుడ్ క్వశ్చన్... కలిగింది”
“ఎలాంటి లాభం?”
“ఈ బీచ్ కి రావడం వల్ల నా మనసు ప్లెజెంట్ గా ఉంటుంది. మానసికమైన లాభం... కరెన్సీ రూపంలో కాకుండా మానసికమైన ఆనందం రూపంలో వచ్చే లాభం అది...”
యాంకర్లో చిన్నపాటి యాంగ్జయిటీ. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఓ యాభై రూపాయల కాగితం తీసి అనిరుద్రకు ఇస్తూ, “ఇది నా పర్సనల్ అమౌంట్. అయినా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనిపించి ఇస్తున్నాను” అంది.
అనిరుద్ర ఆ యాభై రూపాయల కాగితం తీసుకొని యాంకర్వైపు చూసి, 'ఎక్స్ క్యూజ్ మీ” " అంటూ కార్తీక్ ని పిలిచి యాభై నోటు ఇస్తూ, “మిరపకాయ బజ్జీలు తీసుకురా” అని చెప్పాడు.
***
“మీరేం చేయాలనుకుంటున్నారో ఇప్పుడైనా చెప్పండి” అంటూ కెమెరా స్టార్ట్ చేయమంది యాంకర్.
అనిరుద్ర క్రాఫ్ సరిచేసుకోలేదు. మొహాన్ని కర్చీఫ్ తో తుడుచుకోలేదు. చాలా క్యాజువల్ గా చెప్పాడు.
“హౌస్ హజ్బెండ్ ని అవ్వాలని అనుకుంటున్నాను” “వ్వాట్...?” షాకింగ్ గా అడిగింది యాంకర్..
“యస్... హౌస్ హజ్బెండ్ ని అవ్వాలని అనుకుంటున్నాను”
“నేనడిగేది మీరే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు? అని” యాంకర్ రెట్టించి అడిగింది.
“హజ్బెండ్ జాబ్... భర్తగా జాబ్ చేసి జీతం తీసుకుంటాను” కామ్గా చెప్పాడు అనిరుద్ర.
“భర్తగా జాబ్ చేయడమేంటి?” విస్మయంగా అడిగింది యాంకర్..
“హౌస్ వైఫ్ ఎలానో.... హౌస్ హజ్బెండ్ అలా... కాకపోతే నేను శాలరీ బేసిస్లో పని చేయాలనుకుంటున్నాను... త్వరలో దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా పేపర్లలో ఇద్దామనుకుంటున్నాను... దట్సాల్... థాంక్యూ...”
****
ఓరినాయనో ... అన్నెపు ---