Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
#45
ఎన్ని రోజులైనా కార్తిక్ సంగతి తెలియకపోవడం తో రియా క్రిస్టినా ని కాస్త గట్టిగా నిలదీస్తే నిజం బైట పడింది క్రిస్టినా రియా కి సారి చెప్పి కార్తిక్ జైల్ లో ఉన్నాడు అని తనని ఒక కేస్ లో గిల్టీ గా భావించి 3 ఇయర్స్ శిక్ష వేశారని చెప్పింది, అది విన్న రియా తనకి కార్తిక్ పైన ఉన్న పిచ్చి ప్రేమ కార్తిక్ తప్పు చేసాదంటే నమ్మడం లేదు దాంతో క్రిస్టినా రియా కి ఒక వీడియో చూయించింది. అందులో ఒక అమాయకమైన అమ్మాయి చావుకు కారణంగా కార్తిక్ అనే NRI ని అరెస్ట్ చేసారని ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా కారణం అయ్యాడు అని కోర్ట్ తనకి ఒక 3 ఏళ్ళు సాధారణ జైల్ శిక్ష విధించింది అని, తనకి ఐ లవ్ యు చెప్పక పోతే కాల్చుకొని చనిపోతానని రివాల్వర్ తో బెదిరించిన NRI కార్తిక్ తనకి ఆల్రెడీ పెళ్లయింది అని తన భార్య అంటే తనకి చాలా ఇష్టమని మోసం చేయలేను అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా రజని అనే అమ్మాయి తన అన్నయ్య ACP అశోక్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయింది.

దీన్ని బట్టి కార్తిక్ కి తన భార్య పైన ఎంత ప్రేముందో తెలుస్తుంది ఒక అమ్మాయి నువ్వుంటె నాKయూ ఇష్టం లేదు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్తే తన లవ్ ని రిజెక్ట్ చేసినందుకు మొహం పైన యాసిడ్ పోయడం లేదంటే కత్తులతో బెదిరించడం చివరికి చంపేయడం లాంటివి చేస్తారు కొందరు అబ్బాయిలు అలాంటిది స్వయానా తనే ప్రేమించు నువ్వు నాకు కావాలి అని అన్నా అడ్వాంటేజ్ తీసుకోకుండా తన మంచితనాన్ని చాటుకున్న కార్తిక్ లాంటి వాళ్ళకి ఇలా శిక్ష పడడం ఆలోచించదగ్గ విషయం.

కాల్చుకుని చనిపోయింది ఒక సెక్యూరిటీ అధికారి సర్వీస్ రివాల్వర్ వల్ల అది ఒక acp చెల్లెలు కాబట్టి నిందితుడికి ఇలా శిక్ష కావాలనే వేయించి ఉంటారు, అంతే వీడియో ఆగిపోయింది, మొత్తం విన్న రియా కన్నీళ్ళతో తో క్రిస్టినా ని చూస్తుంటే తను రియాని ఓదారుస్తూ ఉండగా రియా కార్తీక్ ని అర్జంట్ గా చూడాల్సిందే అని పట్టుపట్టింది ఎంత సముదాయించిన రియా వినిపించుకోకపోయే సరికి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తానని చెప్పడం తో కాస్త కూల్ అయ్యి రెండు చేయండి నా బిడ్డకి కూడా అని చెప్పింది.

టికెట్స్ బుక్ అయ్యాక రియా తన బిడ్డ ని తీసుకొని ఇండియా కి బయలుదేరి ముంబై లో ల్యాండ్ అయ్యింది తన భర్త కార్తిక్ ఏ జైల్ లో ఉన్నాడో తెలుసుకుని కలవడానికి వెళ్ళింది, కార్తిక్ ని ఉసల వెనక చూసి రియా గుండె తరుక్కు పోయింది, తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకె కార్తిక్ కి ఈ కష్టాలన్నీ అని ఏడుస్తూ కార్తిక్ తో అంది దానికి కార్తిక్ రియా నీదేం తప్పు లేదు ఎప్పుడు నువ్వు అలా అనుకోకు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోకు త్వరలోనే బైటికి వస్తాను అని భరోసా ఇస్తే రియా కార్తిక్ తో తనకో సర్ప్రైజ్ అని బిడ్డని చూయించింది,

కార్తిక్ జాన్ (నామకరణం అయ్యే వరకు ఇదే పేరు తో పిలుచుకుందాం) నిచేసి ఏ బాబు ఎవరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగితే రియా నిజం చెప్పక (చెప్తే తన పైన ఉన్న  విశ్వమంత ప్రేమ ద్వేషం లా మారుతుందని) జాన్ ని అడాప్ట్ చేసుకుందామనుకున్నాను మీరు ఇక్కడ జైల్ లో నేను ఒంటరి దాన్ని అయిపోతానని ప్రస్తుతానికి వీడికి పేరేం పెట్టలేదు ముద్దుగా జాన్ అని పిలుస్తున్నాం క్రిస్టినా ఈ పేరు సజెస్ట్ చేసింది అంటూ జాన్ ని కార్తిక్ కి ఇచ్చింది.

కార్తిక్ జాన్ని ఎత్తుకుని వీడికి మా నాన్న పేరు పెడదాం ఏమంటావ్ అంటూ వాడి బుగ్గపై ముద్దు పెడుతూ అన్నాడు రియా కి అది నచ్చలేదు దిగులు గా మొహం పెట్టేసింది తనకేమో బాబుకు కార్తిక్ నాన్న పేరో ఇంకేదో పేరు కాదు బాబుకు వాడి నాన్న పేరే పెడదామని ఉంది ఎందుకంటే బాబు అచ్చం తండ్రి పోలిక ఎలాగూ తండ్రి ఈ లోకం లో లేడు అందుకే బాబుకి సంజయ్ అన్న పేరే పెడదామనుకుంది.

రియా మొహం దిగులు గా ఉండడం చూసి కార్తిక్ కి అర్థం అయిపోయింది రియా కి తన ఐడియా నచ్చలేదు అని అందుకే రియా తో తనకి నచ్చిన పేరే పెట్టుకోమని తను మాత్రం బాబుని ముద్దుగా తన తండ్రి పేరు తోనే పిలుస్తాను అంటాడు రియా కి కార్తిక్ చెప్పిన మాట నచ్చి సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతుంటే కార్తిక్ తనని పిలిచి ఇక తనని కలవడానికి మళ్ళీ రావొద్దు అని చెప్తాడు రియా అలాగే అని బాబుని తీసుకొని రిటర్న్ ఫ్లైట్ లోమల్లి యు యెస్ కి వచ్చేస్తుంది.

తిరిగొచ్చాక క్రిస్టినా తో తనకో జాబ్ చూడమని చెప్తే చూసి పెడుతుంది మంచి జాబ్ కంపెనీ క్వార్టర్స్ కంపెనీ కార్ అన్ని ఉండడం తో రియా బాబు తో ఒక కేర్ టెకర్ ని బాబు తో ఉంచి జాబ్ చేసుకుంటూ బాబు ని చూసుకుంటూ మధ్య మధ్య లో హాస్పిటల్ లో అర్జున్ గురించి తెలుసుకుంటూ వాడి ట్రీట్మెంట్ కి కావాల్సిన మనీ ఆరెంజ్ చేస్తూ కార్తిక్ ఎప్పుడెప్పుడు జైల్ నుండి రిలీజ్ అవుతాడా అని ఎదురుచూస్తూ కాలం గడుపుతుంది.
మీ 
Uదై
[+] 4 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: కథ కు పేరుపెట్టండి - by INCESTIOUSLOVER - 17-04-2019, 09:17 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: 1 Guest(s)