13-04-2019, 10:35 AM
(This post was last modified: 13-04-2019, 10:36 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
అమీనా (Ameena)
చలం (Chalam)
చలం (Chalam)
"అమీనా" గురించి నేను సేకరించిన సమీక్షలోని కొంత భాగం:
.
.
.
ఒక్కమాటలో కథ గురించి చెప్పాలీ అంటే, “పన్నెండూ పదమూడేళ్ళా బాలికపట్ల ఆకర్షితుడై ఆ అమ్మాయి కోసం తపించిన ఒక మగవాడి కథ” ఇలా ఇంత క్లుప్తంగా చూస్తే, ఇదేదీ అనైతిక సంబంధం గురించి, అసాంఘిక అక్రమ వ్యవహారమనీ, tale of perversion in lust అనీ, pedophilic themes అనీ… ఎన్నో రకాలైన వెగటు భావాలు తోస్తాయి. సరిగ్గా, ప్రపంచ ప్రసిద్ధిపొందిన "LOLITA" నవల కూడా ఇదేలాంటి కథాంశంతో అప్పట్లో (1950s) సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈనాటికీ ఆ నవల గురించి మంచిగానూ చెప్పొచ్చు, చెడుగానూ చూడొచ్చు అని interpretations జరుగుతూనే ఉన్నాయి. కానీ, సాంస్కృతికంగా అంతగా బరితెగించని, పరాయి దేశస్థుల పాలనలో ఉన్న మన దేశంలో దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితమే అదేలాంటి నవల వచ్చి ఉంటే మనం దాన్నిగురించి అట్టే analyze చేసుకోకపోవడం చాలా విచారకరం.
కథా వస్తువు నేను పైన చెప్పిన ఒక వాక్యంలో ఉన్నదే అయినప్పటికీ, ఆ కథను వ్రాసిన తీరు, పాత్రలను సన్నివేశాలను మలచిన తీరు చూస్తే ఈ నవల చాలా వరకూ abstractగానే ఉంటుంది.
కొన్ని పాత్రలకు అసలు పేర్లు ఉండవు, వారి ముఖాలూ, పర్సనాల్టీల గురించి అట్టే వర్ణనలు లేవు. అసలు కథ జరిగే ప్రదేశం గురించైనా విపులంగా చెప్పలేదు. కొన్ని పాత్రల పేర్లు తక్కిన చలం రచనల్లో లాగానే మారుపేర్లు రహస్యాలు. నిజానికి అయినా అబద్ధానికి అయినా భావం ఉంటుందే కానీ రూపం ఉండదు అన్నట్లేమో , కథ చెప్పడంలో రూపాల గురించి వివరాలు చెప్పకపోవడం వలన భావం మాత్రమే ఆవిష్కరింపబడి భరించలేనంత impact కలిగిస్తుంది
.
.
.
— విప్లవ్. కే
పూర్తి సమీక్షని చదవటానికి ఈ క్రింది లింక్ ని నొక్కండి...
REVIEW LINK
DOWNLOAD PDF BOOK: AMEENA — CHALAM
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK