14-12-2018, 06:53 AM
(This post was last modified: 14-12-2018, 06:54 AM by Vikatakavi02.)
ఏ దేశమేగినా...
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లిభూమి భారతిని
నిలపరా నీ జాతి నిండుగౌరవము
ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవియెందూ !
లేరురా మనవంటి పౌరులింకెందు !
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక
ఓడలా ఝండాలు ఆడునందాక
అందాకగల ఈ అనంతభూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీరభావభారతము !
తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
శౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినదీ దివ్య విశ్వంబు పుత్ర !
దీవించె నీ దివ్యదేశంబు పుత్ర !
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
కానలా కస్తూరి కాచరా మనకు
అవమానమేలరా?! అనుమానమేలరా?!
భారతీయుడనంచు భక్తితో పాడ!
-- రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984)
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK