16-06-2021, 09:20 PM
పాండవపురం
[Pandavapuram]
మలయాళం: సేతు
తెలుగు అనువాదం: ఎల్. ఆర్. స్వామి
తెలుగు అనువాదం: ఎల్. ఆర్. స్వామి
Quote:---> An Excerpt from the book
ముఖం దించుకు నిలబడింది దేవి. ఒక నిమిషపు విస్ఫోటనంలో ఆమె ముఖంపై ఎన్నో భావాలు మెరిసి మాయమవడం అతడు గమనించాడు.
అతడు మళ్లీ మాట్లాడాడు. మెల్లగా మాట్లాడే అతని గొంతు అప్పుడప్పుడు బాధతో కూరుకు పోయింది. ఎండిన పెదవులు అప్పుడప్పుడు లాలాజలంతో తడిచేసుకుంటూ అతడు అన్నాడు. ''నా గదిలో కిటికీ వద్ద నిలబడితే మీ పడకగది కనబడేది. నా గదిలో దీపాలు ఆర్పేసి కిటికీ వద్ద నిలబడి కిటికీ ఊచలపై ముఖం ఆన్చి మీ గదిలో నీడలు పెనవేసుకోవటం చూసి నిలబడిన రాత్రులు ఎన్నో! అప్పుడు ఇంటి వెనక లోకల్ స్టేషనులోంచి పొగ కక్కుతూ అలసిపోయిన ఒక ట్రైను లేపిన హడవుడి-ఆ తరువాత నీడలు శాంతించటం-అంతా ఎన్నిసార్లు చూస్తూ నిలబడలేదు నేను? అప్పుడు నా మనస్సులో వుండేది అసూయయా, అసహ్యమా లేకపోతే నిస్సహాయతా అని నాకు తెలియదు. కుంజికుట్టన్ అదృష్టవంతుడని చాలాసార్లు అనిపించేది. అయినా అతన్ని నేను అసూయతో చూడలేదు. మీరంతా ఏం చెప్పినా, మీ మాటలు సమర్థించనికి వందలకొద్దీ రుజువులు పేర్చినా నేను ఇంటిపై కప్పెక్కిఆరిచి చెప్పటానికి సిద్ధంగా వున్నాను. కుంజికుట్టన్ అమాయకుడని, ఎందరో అతన్ని అపార్థం చేసుకున్నారు. అందరిని నమ్మటానికి, అందరిని అనుమానించటానికి పుట్టిన వాడు కావటమే అతని దురదృష్టం.''
దేవి కొంత కంగారు పడినా వెంటనే ధైర్యం సంతరించుకుని అంది. ''ఏమిటీ మీ ఉద్దేశ్యం! మీరు ఈ కట్టుకథలు ఎందుకు చెబుతున్నారు? జీవితంలో ప్రప్రథమంగా నిన్ననే మిమ్మల్ని చూసాను. పాండవపురంలోని క్వార్టర్లు, ఆ క్వార్టర్లు వెనక వుండే రైలు పట్టాలు, మా పడక గది, మీరు - అంతా ఒక పెద్దకట్టుకథ లోని భాగాలు కావా? ఇలాంటి కట్టుకథల ఉద్దేశ్యమేమిటి? నన్ను బాధ పెట్టడానికా? బాధ పెట్టనికే అయితే మీ శ్రమ 'వేస్టు'. పొడిస్తే గాయపడే రోజులు దాటేసాను.''
ఆ మాటలు చెప్పగానే ఆమె మనసు కొంత కుదుట పడినట్లు అనిపించింది. అరుగు మీద వున్న టీ గ్లాసు అందుకోవటానికి వంగినప్పుడు కావాలని ముందుకు సాగిన అతనికి తగలకుండా తప్పించుకొని ఆమె నవ్వటానికి ప్రయత్నించింది.
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK