29-05-2021, 11:12 PM
(This post was last modified: 30-05-2021, 06:53 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
అరరే!
రంగనాయకమ్మగారూ!
మీకూ నాస్తికత్వం తెలుసా!!
రామకృష్ణ
ఈ పుస్తకం కేవలం రంగనాయకమ్మగారికే కాదు, నాస్తికత్వం - చార్వాకం - లోకాయతు అంటే ఏమిటో కనీసపు జ్ఞానం కూడా లేకుండా విప్లవకారులమని, చెలామణీ అవుతూ పై ఉద్యమం అంటే చాల చిన్న చూపుతో వున్న ఆమెలాంటి వాళ్ళకు కూడా.
శ్రీ రంగనాయకమ్మ గారు తమ పుస్తకం మొదట్లో “ఈ వ్యాసంలో కొందరి దృక్పథాల్నే విమర్శించాను" అని అంటూ వారి వారి పేర్లు కూడా ఇచ్చారు.
అది అంతవరకే అయితే నాకీ పుస్తకం తొందరపడి రాయవలసిన అవసరం వుండేది కాదు.
కానీ సందర్భం వచ్చినప్పుడల్లా, నాస్తికోద్యమాన్ని జనరలైజ్ చేసి తెలిసీ తెలియని రాతలు చాలా రాశారు.
ఇదివరలో ఒకసారి 1977 లో మా జాతీయ మహా సభలు జరిగే సందర్భంలో కూడా 'నాస్తికత్వం - ఒక పరిశీలన' అనే పేరుతో ఏదేదో ఎవరిని గురించో రాశారు.
తిరిగి ఏం ఆవసరం వచ్చిందో ఇప్పుడు మళ్ళా "నాస్తికవాదం - హేతువాదం - నవ్యమానవతావాదం" అనే పేరుతో పుస్తకం రాశారు.
రాయొచ్చు - అవకాశం వుంది. కాబట్టి అచ్చు వేయించు కోవచ్చు . తమలాంటి జనానికి అమ్ముకోవచ్చు. డబ్బు చేసుకోవచ్చు.
ఆయా ఉద్యమాల గూర్చి కనీసపు జ్ఞానం లేకుండా నేనే సర్వజ్ఞురాలననే భావంలో రాయటం సమంజసం కాదు.
నిజంగా ఆ ఉద్యమాలను గూర్చి శ్రీ రంగనాయకమ్మగారికి ఆవగింజలో అరవయ్యోవంతు గూడా తెలిసివుంటుందో వుండదో!
అంత మాత్రానికే ఇంత రాద్ధాంతం చేయటం అనవసరంగా అందరినీ కదిలించటం మంచిది కాదు.
అందుకే ఈ పుస్తకం రెండు రోజుల్లో రాయవలసి వచ్చింది.
పైగా 1981 జనవరిలో మా రాష్ట్ర మహాసభలు మంగళగిరిలో జరుగనున్నాయి. ఆ దృష్టితో గూడా ఈమెకు తగిన సమాధానం చెప్పక తప్పదు.
ఇదిచూచిన తరువాత ఈమె ఇంకా ఏమైనా ఉక్రోషంతో రాయటానికి పాల్పడవచ్చు. ఆలోచన లేని ఆవేశం - అదీ చేయిస్తుంది.
చేయనీయండి చాలమంచిది.
— 'ఓ మాట' నుంచి
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK