Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#26
అనిరుద్ర H/o అనిమిష - 10వ భాగం

అనిమిష ఇంట్లోకి అడుగుపెట్టేసరికి హాలులో సామాన్లతో రెడీగా వుంది ద్విముఖ.

“ఏమిటిది?” ఆశ్చర్యంగా అడిగింది అనిమిషం

“నేను వేరే ఫ్రెండ్ రూమ్లోకి మారుతున్నాను. నీకు ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు దొరకడం కష్టం. పైగా ఇలాంటి ఇల్లు దొరకదు. నాకంటే పెద్ద ప్రాబ్లమ్ లేదు. నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను” అంది ద్విముఖ.

అనిమిష ద్విముఖను వాటేసుకుంది. ఏం మాట్లాడాలో కూడా అర్ధంకావడంలేదు. అప్పుడే ఓ, కారు వాళ్ల ఇంటి ముందు ఆగింది. శోభరాజ్ కారులో నుండి దిగాడు. భావన, నిఖిత, ఆర్ముగం కారులో నుంచి దిగారు. పళ్లు, స్వీట్స్... ఆర్ముగం తెచ్చి ఇంట్లో పెట్టాడు.

“సర్... ఏమిటిది?” అడిగింది అయోమయంగా అనిమిష

“మీ ఏర్పాట్లు మీకు ఉంటాయి. నేనెలా చెప్పాలి...” అంటూ భావనవైపు చూసి, "మీరు చెప్పండి భావన...” అన్నాడు. భావన వచ్చి అనిమిష చెవిలో చెప్పింది. అనిమిష మొహం ఎర్రబడింది.

నిఖిత అనిమిష చెయ్యి నొక్కి వదుల్తూ, “ఈ రోజంతా మేము ఇక్కడే ఉంటాం. అఫ్ కోర్స్

హాలులో... ఇది బాస్ ఆర్డర్...” అంది.

ద్విముఖ, అనిమిషలు మొహమొహాలు చూసుకున్నారు. “కొంపదీసి మీ బాస్ కి అనుమానం రాలేదు కదా...” మెల్లిగా అడిగింది అనిమిషకు మాత్రమే వినిపించేలా ద్విముక.

“ఏమో... ఇప్పుడెలా?” అడిగింది అనిమిష.

“ఎలా ఏమిటి... కానిచ్చేయడమే...” అంది ద్విముఖ. అనిమిష సీరియస్గా చూడడంతో “అదే నాటకం కంటిన్యూటీని కానిచ్చేయడమే. గదిలో మీరేం చేసేది వీళ్లు చూడొచ్చారా అంది.

శోభరాజ్ అనిమిషవైపు చూసి, “అనిమిషా నీకు ఎవరూ లేరని ఫీలవ్వకు... ఎటు జెడ్ అన్నీ సమకూరుతాయి. అన్నీ శాస్త్ర ప్రకారం, సంప్రదాయబద్ధంగా జరుగుతాయి” అంటూ ద్విముఖవైపు చూసి, “మనం ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుందాం” అన్నాడు అంతా ఆరు బయట సెటిలయ్యారు. శోభనం గదిలో అనిమిష, అనిరుద్ర.

****

మంచం మధ్యలో కూర్చొని రెండు చేతులు చుబుకానికి ఆన్చుకొని మొకాళ్ల మధ్య తల పెట్టి ఓరగా కోరగ అనిరుద్ర వైపు చూడసాగింది అనిమిష.

“ఎంతసేపు చూస్తావు? మెడ పట్టేస్తుంది. లుక్కు మార్చు” “నీ చూపులో నాకు డిఫరెన్స్ కనిపిస్తోంది” అంది అనిమిష

“ఇప్పుడు నన్నేం చేయమంటావ్... బయటకు వెళ్లిపోనా...” అడిగాడు తలుపు దగ్గరకి నడుస్తూ అనిరుద్ర.

“వద్దు... మా బాస్ చూస్తే డౌటొస్తుంది” అంది.

“మరేం చేయను”

“ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. నా మీద అలాంటి హోప్స్ పెట్టుకోవద్దు” అంది అనిమిష,

“ఎలాంటి హోప్స్?” అడిగాడు ఆమె నడుం మడత వంక చూస్తూ. వెంటనే నడుం మడతను చీర కొంగుతో సరిచేసుకొని కోపంగా అనిరుద్రవైపు చూసింది అనిమిష

“మీరు ఎక్కడో చూస్తున్నారు”

“ఎక్కడో కాదు నడుం మడత వంక చూశాను. చాలా బావుంది. చాలా టెంప్టింగ్గా ఉంది” అన్నాడు అనిరుద్ర.

“అదిగో అలాంటి మాటలు నాకు నచ్చవ్... మన అగ్రిమెంట్ మర్చిపోతున్నారు"

“అగ్రిమెంట్ ఏం మర్చిపోలేదు... సరే కాస్త జరిగితే నేను అటువైపు తిరిగి పడుకుంటాను"

“వ్వా...ట్... అదిరిపడి అంది అనిమిష.

“నా పక్కన పడుకుంటారా... నో... నెవర్” అంది ఎగిరిపడిన లేవల్లో.

“సారీ...” మళ్లీ తనే అంది అనిమిష.

“ఎందుకు?” అడిగాడు అనిరుద్ర.

“మిమ్మల్ని నేల మీద పడుకోబెడుతున్నందుకు” .

“నెవ్వర్... నేను నేల మీద పడుకోవడమేంటి? ఇది నీ కోసం...” దిండు, దుప్పటి ఆమె చేతిలో పెట్టి మంచం మీద పడుకుంటూ అన్నాడు అనిరుద్ర.

“ఓరి దుర్మార్గుడా...” మనసులోనే కచ్చగా అనుకుంది అనిమిష

“లైట్ ఆర్పేయనా... వెలుతురులో నాకు నిద్ర పట్టదు” అడిగాడు అనిరుద్ర.
“వద్దు... లైట్ ఆర్పేస్తే నువ్వు వెధవ్వేషాలు వెయ్యవని గ్యారంటీ ఏంటి?” అనిరుద్ర అనిమిష వైపు సీరియస్గా చూశాడు.

“అది కాదు... ఈ ఒక్క రాత్రి అడ్జస్టయిపోండి. రేపట్నుంచి వేరు వేరు గదుల్లో పడుకోవచ్చు” కాస్త నచ్చచెప్తున్నట్లుగా అంది అనిమిష.

“అంటే తెల్లవార్లు మెలకువగా ఉండాలా? నో నెవర్...” అన్నాడు అనిరుద్ర.

“ఓ పనిచేద్దాం. మనం అగ్రిమెంట్ రాసుకుందాం... ఇటు టైమ్ పాస్... అటు అగ్రిమెంట్ రాసుకోవడం రెండూ పూర్తవుతాయి”

“అగ్రిమెంటా? నా మెమరీలో ఎప్పుడో డిటిపి చేయించి పెట్టాను. ఎప్పుడు పడితే అప్పుడు ప్రింటవుట్ తీసుకోవచ్చు” అన్నాడు అనిరుద్ర.

“రిటన్గా వుంటే మంచిది కదా...” అంటూ వెళ్లి టేబుల్ మీద వున్న ప్యాడ్ తీసుకొచ్చింది అనిమిష.

“హు... మొదటి రాత్రి ఇలా వుంటుందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది” అంటూ నిట్టూర్చాడు అనిరుద్ర.

****

“ఇదిగో మీ డ్యూటీస్ వరుసగా రాస్తున్నాను. అన్నింటికీ స్టార్ గుర్తు పెడ్తున్నాను” అంది అనిమిష

నికిష్టమున్న గుర్తులు పెట్టుకో... అన్నట్టు ఓ అపాయింట్మెంట్ లెటర్ కూడా రాయి. మొగుడిగా అపాయింట్ చేసుకున్నట్టు” అన్నాడు అనిరుద్ర.

ఆమెకు చాలా గమ్మత్తుగా అనిపించింది. అనిమిష బుద్ధిగా రాసుకుంటూ పోతోంది. ఆమె వంకే చూస్తుండిపోయాడు అనిరుద్ర.

“అవును... ఉదయమే వాకిలి ఊడ్చి.... ముగ్గు వేసే డ్యూటీ కూడా మీదే కదా” అడిగింది డౌట్గా అనిమిష.

“ఆ డ్యూటీ కూడా చేయాలా?” అడిగాడు అనిరుద్ర.

“ఏం భార్యగా మేము చేయమా... మీరెందుకు చేయరు...” "రైట్... రైట్” అన్నాడు అనిరుద్ర..

“కూరగాయలు తేవడం... వేణీళ్లు కాయడం... కూరలు వండడం... టిఫిన్... నీట్గా ఉంచడం... బట్టలు వాషింగ్ మెషిన్లో వేయడం...” చెప్పుకుంటూ రాసుకుపోతోంది అనిమిష.

“ఆగాగు... బట్టల లిస్ట్ లో ఏమేం ఉన్నాయి?” అడిగాడు అనిరుద్ర.

“ఏముంటాయి? చీరలు... బ్లౌజులు... లంగాలు.. బ్రా...” అని ఆగి అనిరుద్ర మొహంకేసి చూసి సిగ్గుతో చప్పున తలదించుకుంది.

“బట్టలు నావి నేనే పిండుకుంటాను” అంది అనిమిష నవ్వుకున్నాడు అనిరుద్ర. అనిమిష అన్ని పాయింట్స్ రాస్తూ ఉంది.

“ఇంతకీ హాలిడేస్ లిస్ట్ ఉందా?” అడిగాడు అనిరుద్ర.

“హాలిడేనా? అదేంటి?”

“అదేంటి అంటే అదే మరి... జాబ్ చేసే వాడికి హాలిడే ఉండదా? ఎవ్రీ సండే హాలిడే... సెకండ్ సాటర్ డే హాలిడే... పండుగలు.. నెలకు రెండు ఆప్షనల్ హాలిడేస్...' లిస్ట్ చెప్పుకుపోతున్నాడు అనిరుద్ర.

బద్దకంగా కళ్లు తెరిచింది అనిమిష. తను మంచం మీద ఉంది. పక్కనే ప్యాడ్ పెన్ను. కుర్చీలో కూర్చొని కాళ్లు టేబుల్ మీద పెట్టి నిద్రపోతున్నాడు అనిరుద్ర.

'తాను మంచం మీదికి ఎలా వచ్చింది?' వెంటనే ఉలిక్కిపడి అద్దంలో తన మొహం చూసుకుంది. చీర చూసుకుంది. బ్లౌజు చూసుకుంది.

“నిన్నేమీ చేయలేదు. అమాంతం ఎత్తుకొని మంచమ్మీద పడుకోబెట్టాను... అంతే” కళ్లు మూసుకునే చెప్పాడు అనిరుద్ర. టైం చూసింది నాలుగున్నర కావస్తోంది.

కంగారుగా లేచి చీర సరిచేసుకొని బాత్రూంలోకి పరుగెత్తింది. స్నానం చేయాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే బాత్రూంలో నుండి బయటకు వచ్చింది. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు అనిరుద్ర. తను స్నానం చేస్తుంటే బాత్రూం డోర్ పీప్ హోల్లో నుంచి చూస్తే.. వెంటనే సిగ్గుపడిపోయింది. అతను చూసేసినంతగా.

“ఎక్స్ క్యూజ్ మీ” అతని కళ్ల ముందు చేతులు పెట్టి పిలిచింది.

“ఏంటి? రాత్రి అసలే నాకు నిద్రలేదు” బద్దకంగా అన్నాడు అనిరుద్ర.

“నిద్రలేదా... ఏం చేశావేంటి?” అనుమానంగా అడిగింది.

“ఏం చేయలేదు కాబట్టే నిద్రలేదు... షుగర్ పేషెంట్ ముందు బందరు లడ్డు పెట్టినట్టయింది” అన్నాడు అనిమిషను ఉడికించాలని. .

‘అగ్రిమెంట్లో క్లియర్ గా ఉంది. మళ్లీ ఇలా మాట్లాడితే నేనూర్కోను... ఇక దయచేయండి” అంది అనిమిషం


“ఎక్కడికి?”

“ఎక్కడికేంటి? బయటకు”

“ఎందుకు... నాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది”

“నాకే కంపరంగా ఉంది. నేను స్నానం చేయాలి”

“ఏంటి? ఇక్కడా... బావోదేమో... బెడ్ రూమ్లో స్నానం చేస్తే ఏం బావుంటుంది?”

“ఇదిగో ఇలాంటి జోక్స్ వేస్తే నాకు ఒళ్లు మండుతుంది. నేను బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చెయ్యాలి”

“చేయ్... బాత్రూంకు బోల్ట్ లేదా.. ఫర్లేదు. ఎవ్వరూ రాకుండా నేను చూసుకుంటాను”

“నువ్వు రాకుండా చూసుకోవడానికే బయటకు వెళ్లమనేది”

“ఛఛ... నేనా టైప్ కాదు. పిలవని పేరంటానికి, ఇన్వయిట్ చేయని షవర్ బాత్ స్నానానికి వెళ్లే అలవాటు లేదు నాకు”

“అరె... మీకెలా చెప్పాలి... నేను స్నానం చేస్తుంటే పీప్ హోల్ నుంచి చూడరని గ్యారంటీ ఏమిటి??

“ఎంత మంచి ఐడియా ఇచ్చావ్... నిజానికి నాకా ఐడియానే తట్టలేదు. బాత్రూంలో ఈ ఫెసిలిటీ కూడా వుంటుంది కదూ” టక్కున అన్నాడు అనిరుద్ర..

“అంటే చూసేద్దామనే...” కోపంగా అంది అనిమిష

“నేనేం చూసేయను.. ఇంతోటి అందాలు కనిపించక ఇక్కడెవరూ మొహం వాచిలేరు” అన్నాడు అనిరుద్ర. .

“అంటే మీరు అందాలను కూడా చూసేశారా?” అంది ఉక్రోషంగా.

“మరి మాకేం పని? పొద్దస్తమానం అందాలు బాబోయ్... అంటూ విశాఖపట్నం అంతా రౌండేస్తాం.. చాల్చాల్లే.. వెళ్లవమ్మా... వెళ్లు” అంటూ చెయ్యి చూపించాడు.

“నువ్వు బయటకు వెళ్తేనే నేను బాత్రూంలోకి వెళ్తాను” మొండిగా అంది అనిమిష.

“నీ ఖర్మ...” అంటూ అనిరుద్ర లేచి బయటకు నడిచి గోడకు కొట్టిన బంతిలా వెనక్కొచ్చి పడ్డాడు.

“ఏంటీ... మళ్లీ వచ్చారు?”

"నేను రాలేదు. మీ యాంకర్ ఫ్రెండ్ తోసేసింది. డిటైల్స్ మొబైల్లో చెప్తుందిట” అన్నాడు. అప్పుడే అనిమిష మొబైల్ మోగింది.

“ఏయ్ అనిమిషా... నీకస్సలు బుద్ది ఉందా? బయట మీ బాస్, స్టాఫ్ ఉన్నారు. తెలుగు సినిమాల్లో వంద మందిని చితగ్గొట్టి కూడా క్రాఫ్ చెదిరిపోకుండా, బట్టలు నలగకుండా వుండే హీరోలా.. శోభనం గదిలో నుండి, అప్పుడే లాండ్రీ నుంచి తెచ్చిన డ్రెస్సేస్కొని వచ్చే శాల్తీలా అనిరుద్ర బయటకు వస్తే జనాలకు డౌట్ రాదా?” మొబైల్లో క్లాసు పీకింది ద్విముఖ.

అనిమిషకు అదీ నిజమే అనిపించింది. ఏం చేయాలా? అని ఆలోచిస్తుండగానే ఓ ఐడియా ఫ్లాషయింది.

“నేను కళ్లకు గంతలు కడతాను. నా సేఫ్టీ కోసం” అంది అనిమిషం

“సరే” అన్నాడు అనిరుద్ర.

అనిమిష అతని కళ్లకు గంతలు కట్టి బాత్రూంలోకి వెళ్లింది. అనిమిష బాత్రూంలో బట్టలు విప్పి స్టాండ్ మీద వేసి కూడా టెన్షన్గా పీప్ హోల్లో నుండి చూసింది. అనిరుద్ర తన పక్కనే వున్న ఫీలింగ్. చిత్రంగా కోపం రావడంలేదు. సిగ్గు ముంచుకు రావడంలేదు. చిన్నపాటి ఉద్వేగం... వేల వేల ప్రకంపనలయ్యాయి.

****

అనిమిష స్నానం చేసి బయటకు వచ్చి చూసి గతుక్కుమంది. అనిరుద్ర తాపీగా మ్యాగజైన్ చదువుతున్నాడు. కళ్లకు కట్టిన గంతలు కిందికి జారి ఉన్నాయి.

“ఏం చేస్తున్నావ్?” కీచు, గొంతుతో అడిగింది అనిమిష.

“కనపడట్లేదా? మ్యాగజైన్ చదువుతున్నాడు. సెక్స్లో ఆసక్తి లేకపోవడానికి ప్రిజిడిటీ అంటారుట...” అన్నాడు. అనిమిష" వంక చూస్తూ... స్నానం చేసొచ్చిన అనిమిష దగ్గరకు లాక్కోవాలన్నంత ఫ్రెష్ గా ఉంది.

“నన్ను మోసం చేశారు. కళ్లకు గంతలు విప్పేశారు” ఉక్రోషంగా అంది.

“సారీ... నేనేం మోసం చేయలేదు. నా కళ్లకు గంతలు కడతానంటే సరేనన్నాను. కళ్లకు గంతలు విప్పుకోకూడదన్న షరతు ఏమీలేదు. అయినా కళ్లకు గంతలు కట్టాలన్న గుడ్డి ఆలోచన వచ్చింది కానీ... గంతలు విప్పుకోకుండా చేతులకు కూడా కట్టాల్సింది...” అన్నాడు అనిరుద్ర. .

ఓసారి కోపంగా అనిరుద్ర వంక చూసి, “నాకు ఛాన్స్ వస్తుంది” అంది అనిమిష

“అవును... ఇప్పుడే వస్తుంది. నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. నీ పగ, నీ ప్రతీకారం తీర్చుకోవచ్చు. పీప్ హోల్లో నుండి చూసి” చెప్పి బాత్రూంలోకి వెళ్లాడు అనిరుద్ర.

ఈసారి అనిమిషకు కోపం రాలేదు. పైగా నవ్వొచ్చింది. అనిరుద్ర మాటలకు ముద్దోచ్చింది.

****
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 10-11-2018, 01:53 PM



Users browsing this thread: 1 Guest(s)