19-05-2021, 07:50 AM
(This post was last modified: 19-05-2021, 11:33 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
రొండా బర్న్ పుస్తకాలు
రోండా బర్న్ గురించి
రోండా తన ప్రయాణాన్ని ద సీక్రెట్ అనే సినిమాతో ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా దాన్ని కొన్ని లక్షలమంది చూశారు. ఆ తరవాత 2006లో ఆమె ద సీక్రెట్ అనే పుస్తకాన్ని రాసింది. అది బెస్ట్ సెల్లర్స్ జాబితాలో చేరి అత్యధికంగా అమ్ముడయింది. 50 భాషల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల ప్రతులకి పైగా అమ్ముడయింది. ద సీక్రెట్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో 200 వారాలకి పైగా చోటుచేసుకుని ఇంకా అలాగే కొనసాగుతోంది. గత పదిహేనేళ్ళలో అత్యధికంగా అమ్ముడయిన 20 బెస్ట్ సెల్లర్లలో ఇది ఒకటి అని యూఎస్ఏ టుడే పత్రిక ఇటీవలే పేర్కొంది. ఆమె తను ప్రారంభించిన కొత్త ఒరవడిని కొనసాగిస్తూ 2010లో ద పవర్ అనే పుస్తకాన్నీ, 2012లో ద మేజిక్ అనే పుస్తకాన్ని ప్రచురించింది. అవి కూడా అత్యధికంగా అమ్ముడయి బెస్ట్ సెల్లర్స్ జాబితాలో చోటుచేసుకున్నాయి.
1) రహస్యం (The Secret)
మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు...
ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగి ఉన్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చెయ్యబడినది, తరువాతి తరాలవారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్దాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలామంది అర్థం చేసుకున్నారు : ప్లేటో, గెలీలియో, బిథోవెన్, ఎడిసన్, కార్నెగీ, ఐన్ స్టీన్, వంటివారు. వీరితోపాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులూ, శాస్త్రవేత్తలూ, గొప్ప తాత్వికులూ కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెల్లడి చెయ్యబడుతోంది.
“ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరచుకోగలరో, మీ మనసుకు నచ్చే పని ఎలా చెయ్యగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీ కోసం వేచిఉన్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు.”
— పరిచయం నుంచి.
>>>డౌన్లోడ్<<<
2) శక్తి (The Power)
అద్భుతంగా జీవించడానికే మీకీ జన్మ లభించింది.
ఈ పుస్తకంలో మీకు ఒక అద్భుతమైన జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తాను. జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవలసింది ఎంతో వుంది. అదంతా మంచి గురించే. నిజానికి అది “మంచి” కన్న కూడ ఉన్నతమైనది, విలక్షణమైనది. ఈ పుస్తకంలో మిమ్మల్ని నేనొక అద్భుతమైన జీవితంలోకి నడిపిస్తాను. మిమ్మల్ని గురించి, విశ్వాన్ని గురించి, మీలోనే వుండి మీకే తెలియని శక్తుల గురించి తెలియచేస్తాను. మీరనుకున్నదానికన్న ఈ జీవితం మరింత సరళమైనది, సులభమైనది. జీవితగమనాన్ని గురించీ, మీలో వున్న శక్తి గురించి తెలుసుకుంటున్న కొద్ది మీకు జీవితంలోని అద్భుతం అర్థమౌతుంది. అప్పుడు మీకొక అద్భుతమైన జీవితం లభిస్తుంది. ఇప్పుడిక ఆ అద్భుతంలోకి అడుగుపెట్టండి.
>>>డౌన్లోడ్<<<
3) మ్యాజిక్ (The Magic)
ఒక పదం అంతటినీ మార్చేస్తుంది.
ఇరవై శతాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంథంలోని కొన్ని పదాలను చదువరులందరూ అపార్థం చేసుకున్నారు. ఆ పదాలు వారిని గందరగోళపరిచాయి. చరిత్రలో కొంతమంది పాఠకులు మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్థం వున్నదనీ, ఆ అర్థాన్ని కనుక్కోగలిగితే మన కళ్ళముందు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందనీ తెలుసుకున్నారు. “మ్యాజిక్”లో రోండా బర్న్ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది. ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనకు బోధిస్తున్నది. మీరెవరైనా కానీ మీరెక్కడున్నా కానీ మీ ప్రస్తుత పరిస్థితులెలా వున్నా కానీ ఈ "మ్యాజిక్” మీ జీవితం మొత్తాన్ని మార్చివేస్తుంది.
>>>డౌన్లోడ్<<<
4) హీరో (Hero)
ఈ కథ మీరు ఈ లోకంలో ఎందుకున్నారో చెపుతుంది.
మీలో ఏదో ప్రత్యేకత ఉంది. మీరు ఏదో ఒక రకంగా రూపొందేందుకు పుట్టారు.. మీరు చెయ్యబోయే పని మిగతా ఏడు బిలియన్ల జనాభాలో ఇంకెవరూ చెయ్యబోరు. మీరు ఏ రకంగా జీవించాలో నిర్ణయం అయిపోయింది. మీరు చెయ్యవలసిన ప్రయాణం ఒకటి ఉంది. ఈ పుస్తకం ఆ ప్రయాణం గురించే చెపుతుంది.
ఈనాడు ప్రపంచంలో జీవిస్తున్న పన్నెండుమంది అతిగొప్ప విజేతలు అసాధ్యమనిపించే తమ విజయగాథలని మనతో పంచుకుంటున్నారు. మనం అందరం కూడా మన స్వప్నాలని సాకారం చేసుకోగల సామర్థ్యాన్ని వెంటపెట్టుకునే పుట్టాం. మనకున్న అతి పెద్ద కలని అనుసరిస్తూ జీవిస్తే మన జన్మ సార్థకం అవుతుంది. ఈ ప్రపంచాన్ని మనం అక్షరాలా మార్చివెయ్యగలుగుతాం అని వారు చెపుతున్నారు.
ఒకానొకప్పుడు, ఒక హీరో ఉండేవాడు...
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK