10-11-2018, 12:59 PM
81.5
ఎప్పుడైతే తన మిద అటాక్ చేస్తున్న ఇద్దరు కింద పడే కొద్దీ, మాతో పాటు వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్కు తను చేసిన తప్పు తెలిసి వచ్చి, దాన్ని సరిదిద్దుకొనే మార్గం దొరికింది అన్నట్లు చేతిలోని గన్ ను తన ఫ్రెండ్ ను వెనుక నుంచి పట్టుకొన్న వాడి మోకాళ్ళ మిద కాల్చాడు. అంత చీకట్లో సరిగ్గా బుల్లేట్ వాడి కళ్ళలో దూరినట్లు వాడు కెవ్వు మంటూ కిందకు పడిపోయాడు.
వచ్చిన నలుగురు లెక్క సరిపోయింది. మొదట దెబ్బ పడ్డవాడు ఉన్నాడో పోయాడో తెలియ లేదు , కిక్కురు మనకుండా పడుకొన్నాడు. మిగిలిన ముగ్గురు మూలగ సాగారు. ఇంతలో వెనుక వైపు తలుపులోంచి పెద్ద టార్చ్ లైట్ వేసుకొంటూ హమీద్ తో పాటు ఇంకో పొలిసు వచ్చాడు.
"లోపల ఉన్న వాళ్ళను కట్టేసాము. బయటకు నలుగురు వచ్చారు , మీకు కనబడ్డారా" అంటూ లైట్ కింద వైపు వేసి కింద పడ్డ వాళ్ళను చూసి
"లోపలి ఈడ్చుకొని రండి కొడుకులను " అంటూ తనోకాన్ని పట్టుకొని లోనకు తీసుకోని వెళ్ళాడు. లోపల నలుగురు తాళ్ళతో కట్టేసి వున్నారు. ఆ లైట్ వెలుతురులో వాళ్ళను గుర్తు పట్టాను , నన్ను కొట్ట దానికి వచ్చిన వారే , వారిలో ఇద్దరికీ కట్లు కట్టబడి ఉన్నాయి.
బయట ఉన్న నలుగురిని కుడా , లోనకు తెచ్చి అందరిని కలిపి తాళ్ళతో కట్టేశారు. పక్కనే ఇంకో రూమ్ లో ఓ పది మంది పిల్లలు ఓ వయసు మళ్ళిన వ్యక్తి మా వైపు భయం , భయంగా చూడ సాగారు.
వాళ్ళు ఉన్న గది దగ్గరకు వెళ్లి , మిమ్మల్ని ఎవ్వరూ ఏమి అనరు భయపడకండి , వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారు అందుకే వాళ్ళను స్టేషన్ కు తీసుకోని వెళుతున్నాము అని చెప్పి ఎనిమిది మందిని వ్యాను ఎక్కించి కంట్రోల్ రూమ్ కు తీసుకోని వెళ్ళాము.
అప్పటికే రాత్రి 10 గంటలు అవ్వ సాగింది. మేము రాగానే "నేను ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకొంటున్నాను" అంటూ మాకు ఎదురోచ్చాడు ప్రతాప్.
==================================