07-04-2019, 12:22 PM
చలం - అమీనా [Chalam - Ameena]
అంతర్జాలంలో నాకు లభించిన అత్యద్భుతమైన నిష్పక్షపాత సమీక్ష ఇది. దీన్ని విప్లవ్ కే వ్రాసారు. అమీనా పుస్తకాన్ని చదవాలనే కాంక్షని నాలో కలిగించిన ఈ సమీక్షని ఇక్కడ అందరితో పంచుకోవాలని కాపి చేసి పోస్టు చేస్తున్నాను.
అంతర్జాలంలో నాకు లభించిన అత్యద్భుతమైన నిష్పక్షపాత సమీక్ష ఇది. దీన్ని విప్లవ్ కే వ్రాసారు. అమీనా పుస్తకాన్ని చదవాలనే కాంక్షని నాలో కలిగించిన ఈ సమీక్షని ఇక్కడ అందరితో పంచుకోవాలని కాపి చేసి పోస్టు చేస్తున్నాను.
Quote:చలం గురించి కానీ, అతని ( ఆయన / గారు అని నేను అనను. సమీక్షించేటప్పుడు కోర్టులో జడ్జీ అంత నిష్పాక్షికంగా వ్యవహరించాలి కనుక, మర్యాద మొదలెడితే విమర్శ నిఖార్సుగా రాదు కనుక) రచనాశైలి గురించీకానీ, philosophy గురించైనా ఇవ్వాళ నేను రాయడం అంటే ఒకట్రెండు జీవితకాలాల లేటుగా జరుగుతున్న వ్యవహారం. కానీ నేను చదివిన అతని రచనలు కొన్నిటిని గూర్చి సమీక్షలూ, విమర్శలూ గట్రా చదువుదామని మూడునాలుగు సంవత్సరాలుగా గూగుల్‍లో చూస్తున్నా ఎప్పుడూ ఏవీ కనపడలేదు. కొంచెంలో కొంచెం మైదానం గురించైతే వాడివేడి discussions, arguments జరిగాయ్ తప్పితే. నాకు అర్థం అయినంతలో, అర్థం చేసుకుంటూ చెబుతున్న అర్థాలే ఈ సమీక్షలనీ,
విభేదించేవారు బాహాటంగా తిట్టిచ్చని confess చేస్తూ…మొదటగా ” అమీనా” గురించి:
ఒక్కమాటలో కథ గురించి చెప్పాలీ అంటే, “పన్నెండూపదమూడేళ్ళా బాలికపట్ల ఆకర్షితుడై ఆ అమ్మాయి కోసం తపించిన ఒక మగవాడి కథ” ఇలా ఇంత క్లుప్తంగా చూస్తే, ఇదేదీ అనైతిక సంబంధం గురించి, అసాంఘిక అక్రమ వ్యవహారమనీ, tale of perversion in lust అనీ, pedophilic themes అనీ…ఎన్నో రకాలైన వెగటు భావాలు తోస్తాయి. సరిగ్గా, ప్రపంచ ప్రసిద్ధిపొందిన “LOLITA” నవల కూడా ఇదేలాంటి కథాంశంతో అప్పట్లో (1950s) సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈనాటికీ ఆ నవల గురించి మంచిగానూ చెప్పొచ్చు, చెడుగానూ చూడొచ్చు అని interpretations జరుగుతూనే ఉన్నాయి. కానీ, సాంస్కృతికంగా అంతగా బరితెగించని, పరాయి దేశస్థుల పాలనలో ఉన్న మన దేశంలో దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితమే అదేలాంటి నవల వచ్చి ఉంటే మనం దాన్నిగురించి అట్టే analyze చేసుకోకపోవడం చాలా విచారకరం.
కథా వస్తువు నేను పైన చెప్పిన ఒక వాక్యంలో ఉన్నదే అయినప్పటికీ, ఆ కథను వ్రాసిన తీరు, పాత్రలను సన్నివేశాలను మలచిన తీరు చూస్తే ఈ నవల చాలా వరకూ abstractగానే ఉంటుంది. కొన్ని పాత్రలకు అసలు పేర్లు ఉండవు, వారి ముఖాలూ, పర్సనాల్టీల గురించి అట్టే వర్ణనలు లేవు. అసలు కథ జరిగే ప్రదేశం గురించైనా విపులంగా చెప్పలేదు. కొన్ని పాత్రల పేర్లు తక్కిన చలం రచనల్లో లాగానే మారుపేర్లు రహస్యాలు. నిజానికి అయినా అబద్ధానికి అయినా భావం ఉంటుందే కానీ రూపం ఉండదు అన్నట్లేమో, కథ చెప్పడంలో రూపాలగురించి వివరాలు చెప్పకపోవడం వలన భావం మాత్రమే ఆవిష్కరింపబడి భరించలేనంత impact కలిగిస్తుంది.
కథ detailed synopsis: (Read at your own Risk)
ఎందుకో ఏమిటో కానీ, కథానాయకుడు ( అది చలమో లేక మరొకరో తెలీదు) ఒక ఊర్లో, తన స్నేహితులతో ఉంటాడు. అతని narrationలో సాగే కథలో, అతనితో పాటు ఉన్న స్నేహితులు రకరకాలవాళ్ళు. కొందరు వస్తుంటారు. కొందరు వెళ్తుంటారు. 1970s లో ప్రాచుర్యం పొందిన హిప్పీల్లా అనిపిస్తుంది వాళ్ళ జీవనశైలి, ఇవ్వాళ 2000s దాటిన మన మనస్తత్వంతో చూస్తే. కాకపోతే హిప్పీలు తిరుగుతూ ఉంటారు. వీరు ఒకచోట ఉండిపోతారు. వీరి స్నేహితుల్లో కొందరికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అది అక్రమమో సక్రమమో తెలియని, తేల్చుకోలేనట్టివి. కథానాయకుడికీ చాలామంది స్త్రీ-స్నేహితులు. వాళ్ళల్లో అతనికి కొందరంటే ఇష్టం ఉంది, ఇంకొందరంటే ఇష్టం పోయింది. దాదాపు ఇలా polyamorousగా “దినానికి ఇరవైనాలుగు గంటలూ చాలని ” రోజుల్లో , “మొండిగోడల” ఇంట్లో బ్రతికేస్తున్న అతనికి ఒకరోజు , ఊరిచివర పాకలో ఉండే ''ల ( చలం భాష ప్రకారం అయితే తురకల… ఇవ్వాల్టికంటే ఆరోజుల్లోనే ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషెన్ ఎక్కువేమో ) అమ్మాయి పరిచయమౌతుంది. ఇతను అన్నా, ఇతని life style నచ్చిన ఆ అమీనా అతనితో వచ్చేస్తాను అంటుంది. అన్నం లేక చాపలు కాల్చుకు తినే ఆ అమ్మాయిని , అన్నం చేసుకునే ఓపికా , ఆసక్తీ లేక హోటలు అన్నం తెచ్చుకుని తినే తమ జీవనశైలిలోకి ఆహ్వానిస్తాడు కథానాయకుడు. ఆ అమ్మాయి మాట , తీరూ మాత్రమే కాదు పాట కూడా నచ్చుతుంది అందరికీ. అమీనా పాట వినాలనీ , ముఖం చూడాలనీ సరే అంటారు అందరూ.సేవకురాలిగా అతని దగ్గర
ఉండిపోతుంది. అది డబ్బు , జీతం కోసం చేసే ఉద్యోగంలా చేసే సేవ కాకపోగాట, ప్రేమతో చేసే సపర్యలలా ఉంటాయి. అతనికోసం “జీవం” , విమల, శ్యామల, సుబ్బులు ఇలా ఎందరో స్త్రీలు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరూ అతనికి ఇష్టమే కానీ , అతనిలో ఏదో అసంతృప్తి. ప్రేమ చాలదన్నట్లు , ఇంకా కావాలన్నట్లు. ఆ వచ్చే స్త్రీలు ఇతడిలో ఏదో ఆశిస్తూ ఉంటారు లేదా ఇతనే వారి నుంచి ఏదో ఆశిస్తూ ఉంటాడు. కానీ ఏదీ ఆశించకుండా అమీనాను మాత్రం చూస్తే చాలు , ఆ అమ్మాయి పక్కన ఉండి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే చాలన్నట్లు ఉంటాడు. ఎంత ప్రవిత్రంగా ఉండజూసినా శరీరంలో రేగే కోర్కెలు , మనసులో ,ఎగసే వికారాలు. అవన్నిటినీ ఇంకే స్త్రీ పైనో చూపించదలుస్తాడు కానీ , అమీనా దగ్గర మాత్రం పసివాడిలానో , తండ్రిలానో మాత్రమే ఉండబుద్ధేస్తుంది. వయస్సుకూ,genderకూ అంటని ,అసలు ఇదీ అని చెప్పలేని “relationship”లో అతను రగిలిపోతుంటే అసలు అతనికీ మిగతావారికీ ఉన్న సంబంధం ఏమిటో define చెయ్యమనీ నిరంతరం పోరుతూ, చూఛాయగా తనూ ఒక నిర్వచనాన్ని కోరుకుంటున్నట్లు తెలియజేస్తుంటుంది అమీనా. అలా నిర్వచించ ఇష్టపడని అతని నుండి ఆమె దూరమౌతుంటే ఆమె కోసం అర్రులు చాస్తూ , అసహాయంగా మిగిలిపోతాడు అతను.
ఇది , చదివితే తెలిసే కథ. అరటిపండు వొలిచి నోటికందినట్లు అర్థమయ్యే కథ. కానీ చలం రచనాశిల్పంలో దాగి ఉన్న కథ మరొకటి ఉంటుంది. ఈ అమీనాలో ఆ, hidden story ఏమిటంటే : its a story of man’s (or human’s) relationship with “change”. మార్పు అంటే ఇష్టపడని మనిషి , మార్పు లేనిదే జీవితం లేదనే సత్యం తెలిసీ ఆ మార్పుకు దూరంగా ఉండాలని వెర్రిగా యత్నించీ చుట్టూ ప్రపంచం అంతా మారిపోతుంటే తనొక్కడూ మారిపోకుండా ఉండిపోవడమూ మార్పే అవుతుందని తెలుసుకోలేక అనాధగా ,అభాగ్యుడిగా మిగిలిపోవడం themetic elementలా అనిపిస్తుంది. ప్రపంచాన్ని ఒక ఆడదానిగా చూపించినట్లు తీసుకుంటే, ఈ కథ:
ఆడదాన్ని ప్రేమించకుండా ఉండలేని ఒక మగవాడు , ఒకరి కంటె ఎక్కువ మంది ఆడవారే తనకు దగ్గరవుతున్నా వారు తన నుంచి “ఏదో” ఆశించడం గ్రహించగానే ఆ బంధంలోని unconditionality నశించడంతో ఆ ఆడదాన్ని ద్వేషిస్తూనే ప్రేమిస్తూ ప్రేమిస్తూనే ద్వేషిస్తూ , అసలు ఇదంతా స్త్రీ బుద్ధి అని స్త్రీ జాతినే ద్వేషించకుండా ప్రేమించలేని పరిస్థితుల్లో ఉండగా.
ఇంకా స్త్రీ కాని/ స్త్రీ అయ్యే పరిణామంలో ఉన్న ఒక అమ్మాయి అతనికి తారసపడుతుంది.
ఆమె స్త్రీగా వికసించేలోగా ఆమె పట్ల ఆకర్షుతుడయ్యే అతను. అతని ఆకర్షణ, ప్రేమ నిలబడేలోపలే స్త్రీ గా మారిపోయే ఆమె. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే moulting-stageలో ఉన్నప్పుడు, ఎటూ కానీ ఆ జీవిని ప్రేమిస్తే.. ఆ ప్రేమ ఎంత క్షణికం. అసహ్యంగా కనిపించినా ఇష్టపడిన పాత రూపు ఉండదు , అందమైన కొత్త రూపు నచ్చదు.
ఇదీ క్లుప్తంగా కథ. గొంగళిపురుగు సీతాకోకచిలుక పోలిక , నా సొంత analogy అయినప్పటికీ , చలం వర్ణనల్లో ఆయన ఉద్దేశ్యం అదే అని బలంగా అనిపించింది. మొదటి సారి అమీనాకు ఆకర్షుతుడవ్వడం , ఆమె అతనికి గుర్తుకురావడమూ… బురదలో , దుమ్ముకొట్టుకుపోయి, మురికిగా ఉన్న పిల్లగా కనిపిస్తుంది. అప్పుడే ఆమె అతనికి నచ్చుతుంది. కానీ ఆమె అతడిని విడిచి పోయేప్పుడు మాత్రం, అతని దగ్గరే తీసుకున్న డబ్బుతో కొనుక్కున రెండు గజాల కొత్త పరికిణీ. అది చాలటం లేదు అని complain చేస్తూ పోతుంది..ఒక అందమైన ఆడపిల్లలా. అతడి దగ్గరే పీడించి తీసుకున్న డబ్బుతో అలా మారిపోవడం అంటే, ఆ మార్పుకు అతనే కారణం అని చెప్పజూడడం కావొచ్చు.
ఏది ఏమైనా ఇలా ఆలోచించిజూస్తే , 1928లో చలం ఈ రచన చేసేందుకు మూడు సంవత్సరాల క్రితమే జెర్మ రచయిత Franz Kafka అద్భుత సృష్టి అయిన THE METAMORPHOSIS చలం అంత త్వరగా ( అంటే మూడు సంవత్సరాలలో ఆ కథ జెర్మన్ నుండు తర్జుమా అయి మన దేశానికీ వచ్చి ఉంటే )చదివి , అందులోని ” మార్పు
కలుగజేసే భయాన్ని ” poeticగా , శృంగారభరితంగా ఆలోచించి అమీనా రచించాడా అనిపిస్తుంది. కాకపోయి ఉండొచ్చు కూడా , గొప్ప మనుష్యులు గొప్ప ఆలోచనలు
ఏకకాలంలో చేయడం చరిత్రలో నిరంతం జరిగేదే. విచిత్రం ఏమిటంటే లోలితా వ్రాసిన నొబొకోవ్ కూడా మెటామార్ఫొసిస్‍ను క్షుణ్ణంగా analyze చేసినవాడే.
ఇక అమీనాలోని వాక్యాలూ , అందమైన పోలికలూ:
అబద్ధాలు చెప్పేవారిని ఎత్తిపొడుస్తూ, “వాళ్ళు పది గజాలు తమ మధ్య కొలుచుకు కూర్చున్నారు ,ఆరుగజాల పొడుగు ఎటూ లేని గదిలో “
ఒక స్త్రీలోని selfishnessను వివరిస్తూ : “నేనేమైపోతాను ” అనేదే ఆమె ప్రశ్న. “నేనున్నాను” అంటాను, ఆ మాటే పట్టట్లేదు . అనాల్సిన మనిషి అనట్లేదనే బాధే కానీ అనేవాడిని నా గురించి ఆలోచించదే.
“స్త్రీ జనం మీద ఒళ్ళు మండుతోంది” అనేంత స్త్రీ ద్వేషంతో పీడింపబడే సమయాల్లో ప్రేయసిని అతను వర్ణించడం : “నా రతీదేవి , నా కాళి నన్నే బలి కోరుతోంది”
“అమీనా నువ్వూ స్త్రీవేనా ? ” “బలి కోరుతున్న విధి వెయ్యినాల్కలలో ఒకదానివి”
“girls girls everywhere, not a lip to kiss “(బహుశా ఈ వాక్యం ఈ ఆంగ్ల కవితలో ప్రాచుర్యం పొందిన water water everywhere ..ప్రయోగానికి అనుసరణ కావొచ్చేమో ) , ఇలాంటి ఒంటరితనపు , ప్రేమరహిత నిముషాల్లో రగిలిపోతున్నప్పుడు , “దౌర్జన్యం చేస్తే ” (bang) అనే ఆలోచన కలగడం ,
కానీ మంచీ చెడులను బేరీజు వేసుకుంటూ, అసహాయంగా మిగిలిపోతూ”విరహం మనసులోకి జెర్రులను పిలుస్తోంది” అనుకున్నా “హృదయాలు అంధకార సొరం మార్గాలు..తేళ్ళు, జెర్రులు, బొద్దింకలు, బురద, మధ్యమధ్య మిణుగురు పురుగులు, తవ్వగా తవ్వగా దొరికే మణుల పొడి” అంటూ మంచితనాన్ని నిలబెట్టుకోవడం , అలాంటి సమయాల్లో ఒక వేశ్య అతడిని కవ్వించిజూసి, తానున్నాని సూచిస్తూ దగ్గిన సందర్భాన్ని చెప్పిన పద్ధతి :
“దగ్గు ఆడదగ్గు రమ్మని దగ్గు డబ్బు కావాలని అడిగే దగ్గు ఆకలి.ఆశ. అవసరం.
నా ఆకలి-నా ఆస్తి – నా జాతి – నువ్వు – నీ జేబులోని పర్సు.
వెడితే.
నా నూన్యత , నా బాధ , నా అగ్రహం
స్త్రీ జాతి మీద క్రౌర్యం – ఈమె మీద చూపితే – ?
అసహ్యించి , చించి , నలిపి”
ఇక ప్రకృతిని వివరిస్తూ.. ” ఏటి పొడవునా రక్తం కారే సాయంత్రాలు”
“మిణుగురుపురుగుల గొడుగు కింద..” లాంటి వాక్యాలు ఆ జీవితంలోని romanticismను అసూయపడేంతగా వర్ణిస్తే ,
“వెర్రి అమీనా పిల్ల చూపుల అమీనా ,పిచ్చి అమీనా, తిరక అమీనా, చింకిరి అమీనా ” అయినా ఆ అమ్మాయి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే
“ఎన్ని ఆల్టర్నేటివ్స్ యోచించుకున్నా , జీవితం మనిషిని ఆశ్చర్యపరచగల కార్ద్ ను చూపించి నవ్వుకుంటూనే ఉంటుంది” అంటూ క్రూరమైన విధిని తల్చుకుని భయపడుతూ ,
“”ప్రేమలోకంలో దిక్కుమాలిన బిచ్చగాళ్ళం
దెబ్బతిన్న గుడ్డివాళ్ళం- అనాధలం- అంధకారులం –
ప్రేమని నిరసించే నేను
ప్రేమను ఆశించే అమీనా” కనిపించకపోయిన క్షణం అతను వెర్రిగా వెదికివచ్చి
ఆమెను చూసుకోకుండా తన ఇంటి గుమ్మంముందే చీకట్లో తొక్కేసినపుడు , ఆ బాధలోనూ ఆ అమ్మాయి అతని కాళ్ళను కౌగిలించుకోవడం , “కన్నీళ్ళు – ఎక్కిళ్ళు
వేళ్ళు – ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళ వేళ్ళు – వేళ్ళ మధ్య వేళ్ళు – పెదమల మధ్య
జుట్టు – రెప్పల మధ్య నీళ్ళు” ఇలా కలయిక-ఎడబాటుల్లో కరిగిపోతూ అతని బాధ
“గట్లు లేని స్వేచ్ఛ మహా భార”మని విచిలుతుడవడం …ఆ “ఎదగని నౌకరు కన్య”
కు, పరుల దృష్టిలో”ఆ తెలివిగల అందమైన పిల్ల” ఇక రాదు అనిపించినపుడు అతనిలో కలిగే మొదటి ఆలోచన “టీ ఎట్లా త్రాగను ” అవడం , ఇచ్చేవారూ,
పెట్టేవారూ ఎందరున్నా ఆ అమీనా లేనిదే రుచించదన్నట్లు, రెండు రూపాయలిస్తే రెండు గజాల పరికిణీనే వచ్చింది , వొంటికి చాలట్లేదు అంటూ ఎదిగిపోతున్నానని చెబుతూ ఆ అమ్మాయి వెళ్ళిపోవడం…. అన్ని సన్నివేశాలూ దృశ్యకావ్యాలూ , హృదయాంతరాలను కదిలించేవీ, తూట్లు పొడిచేవీ , కన్నీళ్ళతో నింపేవీను.
కథాంశం నచ్చనివారయినా ఈ రచనాశిల్పం కోసం చదవవలసిన నవల. చెప్పడం ద్వారా ఎంత తెలియజేయొచ్చో , చెప్పకపోవడం ద్వారా పాఠకుల మనస్సులో ఎన్నో ఊహలను
రేకెత్తించి ఆ ఊహలన్నిటినీ కొద్ది వాక్యాలలో తన ఊహతోనే కట్టించుకుని తన వెంటే లాక్కుపోవడం రచయితగా చలం ఈ అమీనాలో అద్భుతంగా చేసిన విన్యాసం.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK