24-04-2021, 02:05 PM
మరణ రహస్యం
(మార్కండేయుడు)
“మరణం ఉన్నదని భావించేవారికి మరణాన్ని మనయొక్క కార్యక్రమములు పరిపూర్ణం గావించేంత వరకూ కూడా అలా ఉండు, నన్ను పండనీ. నేను పండిన తర్వాత నేనే శరీరం వదిలివేస్తాను. ఈ లోపల నీవు వచ్చి తీసుకుపోనక్కర లేదు” అని చెప్పే విధానం ఒకటి ఉంది.ఒక దివ్యమైన ప్రయోజనం కోసం అనునిత్యం తన జీవితాన్ని సమర్పిస్తూ జీవిస్తున్నవాడు, వాడికి ఈ దేహం కొంతకాలం ఉండవలసిన అవసరం ఉంటే, time ప్రకారం దానిని తీసివెయ్యాల్సిన అవసరం లేకుండా పని పూర్తియైన తరువాత శరీరం వదిలెయ్యవచ్చు. శరీరం మనని వదిలేసి వెళ్ళిపోకుండా, మనమే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనే ధర్మం ఒకటి ఉన్నది. ఇదే మార్కండేయుని కథలో ప్రధానమైన సూత్రం.
- మాస్టర్ పార్వతీకుమార్
>>>డౌన్లోడ్<<<
* * *
మరణ రహస్యం - 2
(సతీ సావిత్రి దేవి ఉపాఖ్యానము)
భరత ఋషులు మానవులకు గాయత్రి ఆరాధన నిచ్చారు. గాయత్రి ఆరాధన ద్వారా దివ్యత్వమును పొంది, దివ్యలోక సంచారము గూడ చేయవచ్చు. దివ్య దేహ నిర్మాణము గావించుకొనవచ్చు. దేహమందుండగానే, దివ్య దేహమును సాధించుకోవాలి. ఆ దేహముతో దివ్యలోక సంచారం గావించవచ్చు. మరణము దేహమునకే కాని, తనకు కాదని తెలియవచ్చు. మరియు జీవన ప్రయోజనము సిద్ధించువరకు, దైవకృపతో దేహమందుండవచ్చు. మహాత్ముల జీవితములలో గోచరించే సూక్ష్మమగు ఘట్టము లివి.>>>డౌన్లోడ్<<<
* * *
మరణ రహస్యం - ౩
(నచికేత విద్య)
“శరీరం ఆహుతి అయిపోయే లోపల మనం శరీరం నుండి బయటపడటం నేర్చుకోవాలి. అందుకే కళ ఉపనిషత్తు. అందుకే సమస్త జ్ఞానము. నీలోని ఈశ్వరుడు సత్యము. అతడే ధర్మజ్ఞుడు, యజ్ఞస్వరూపుడు కూడా. నీవతనిని ఎరిగి, ధర్మ మాచరించాలి. అపుడు నీకు అక్షరుడవని తెలుస్తుంది. నీలోని ఈశ్వరుని నీవు అనుసరిస్తూ వుంటే నీలోని ఓరుడు (నీ స్వభావ పురుషుడు) నిన్ను అనుసరిస్తాడు. నీలోని పెద్ద అయిన ఈశ్వరుని నీవనుసరిస్తే, నీ నుండి పుట్టిన క్షరుడు నిన్ను అనుసరిస్తాడు. నీవు నీ తండ్రిని అనుసరిస్తూ వుంటే, నీ కుమారుడు నిన్ను అనుసరిస్తాడు. ఇలా మనలో గల ముగ్గురు సమన్వయం కలిగివుంటే, నీ నిజస్వరూపం నీకు ధారణ స్థితిలో గోచరిస్తూ వుంటుంది.”>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK