13-04-2021, 11:12 PM
(This post was last modified: 15-04-2021, 10:32 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆటిజం - వికసించని బాల్యం
[Autism - Vikasinchani Balyam]
ఎస్. బాలభారతి
[S. Balabharati]
అమాయక బాలలకు సోకే ఆటిజాన్ని త్వరగా కనుగొనడం ద్వారానూ, వారికి సరియైన అలవాట్లను నేర్పడం ద్వారాను మంచి అభివృద్ధి సాధించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో పూర్తిగా వారిని సామాన్య బాలలుగా కూడా తీర్చి దిద్దుకోవచ్చు. ఇక్కడున్న ఆటిజం బాధితుల్లో ఎక్కువమంది మానసిక రోగులు అని వీరికి చికిత్స చేసేవారు చెబుతుంటారు. కానీ మానసిక రుగ్మత వేరు, ఆటిజం వేరు అనే అవగాహన కూడా వీరికి లేకపోవడం దురదృష్టకరం.
ప్రభుత్వం కూడా ఆటిజంను ఒక ప్రత్యేక విషయంగా భావించక, బుద్ధిమాంద్యం గల పిల్లలతోనే వీరిని కలిపివేస్తుంది. ఆటిజం అనేది ఇలాగే ఉంటుందని కచ్చితంగా నిర్ధారించి చెప్పలేము. దీని లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. వారు సాధారణంగా నేర్చుకోవడంలో విఫలమౌతుంటారు. చివరకు కొందరు అత్యంత ప్రమాద స్థాయికి కూడా చేరుకుంటారు.
ఈ పుస్తకంలోని వ్యాసాలలో ఆటిజం బాధితులైన పిల్లల్ని ఎలా మనం గుర్తించగలం? ఆ పిల్లల్ని మనం ఎలా చూడాలి? వారితో ఎలా వ్యవహరించాలి అనే అంశాలతోపాటు ఆటిజం బాధితులైకూడా గొప్పగొప్ప విజయాలు సాధించిన కొందరి పరిచయాలు కూడా ఉన్నాయి.ఈ అంశాలన్నిటినీ కొంత వివరంగా చెప్పాలని నా ప్రయత్నం.
- ఎస్. బాలభారతి
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK