24-03-2021, 09:00 PM
శక్తి యొక్క 48 సూత్రాలు
[Shakthi Yokka 48 Sutralu]
మూలం: రాబర్ట్ గ్రీన్
అనువాదం: ఆర్. శాంతసుందరి
కొందరు అధికారంతో, శక్తితో ఆడుకుంటారు. ఈ క్రమంలో ప్రాణాంతకమైన ఒక పొరపాటు వల్ల తమ శక్తి మొత్తం పోగొట్టుకుంటారు. కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే, మరికొందరు అవసరమైనంత మేరకి కూడా ముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి, ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి. మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ, ఉపయోగకరమైనదీ కావచ్చు. ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు. తెలుగులోకి ఆర్. శాంతసుందరి గారు తర్జుమా చేసారు. ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48 సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.
నేను కేవలం 48 సూత్రాలు అందిస్తాను.
వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.
ప్రతి సూత్రాన్ని
1.వివేకం,
2.శక్తిని పొందే కీలకం,
3.చిత్రం [ఉదాహరణ]
అనే మూడు విధాలుగా ఒకొక్క సూత్రాన్ని వర్ణించిన తీరు అద్భుతంగా వుంది.
శక్తి యొక్క 48 సూత్రాలు —
1. బాస్ ని మించినట్టు ప్రవర్తంచవద్దు
2. మిత్రులని అతిగా నమ్మవద్దు, శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి
3. మీ ఉద్దేశాలని దాచిపెట్టండి
4. అవసరమైన దానికన్నా తక్కువే మాట్లాడండి
5. పేరు ప్రతిష్ఠలు మీదే ఎంతో ఆధారపడి ఉంది - ప్రాణ సమానంగా కాపాడుకోండి
6. ఏది ఏమైనా సరే అందరి దృష్టిని ఆకట్టుకోండి
7. మీ పని ఇంకొకరి చేత చేయించండి, కాని పేరు ఎప్పుడూ మీకే దక్కేట్టు చూసుకోండి
8. ఇతరులని మీ దగ్గరకి రప్పించుకోండి - అవసరమైతే ఎరని ఉపయోగించండి
9. వాదనతో కాదు, మీ చేతలతోనే గెలవండి
10. అంటువ్యాధి : దురదృష్టవంతులకి దూరంగా ఉండండి.
11. ఇతరులు మీ మీద ఆధారపడేలా ఎలా చేయాలో నేర్చుకోండి
12. నిజాయితీని, ఉదారతను జాగ్రత్తగా ఎంచుకోండి
13. సహాయం కోరేటప్పుడు, అవతలివారి దయనీ, కృతజ్ఞతనీ ఆశించవద్దు.
14. స్నేహితుడిలా నటించండి, గూఢచారిలా పని కానివ్వండి.
15. మీ శత్రువుని పూర్తిగా అణచివెయ్యండి
16. గౌరవాన్ని సంపాదించేందుకు అంటీముట్టనట్టుగా ఉండండి
17. అవతలివారిని ఉత్కంఠకు గురిచేయండి. ముందుగా ఊహించటానికి వీలులేని వాతావరణాన్ని సృష్టించండి.
18. ఆత్మరక్షణకోసం కోటలు కట్టుకోకండి - ఏకాంతవాసం ప్రమాదకరమైంది.
19. మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి - పొరపాటున తప్పుచేయని వ్యక్తికి కోపం తెప్పించకండి.
20. ఎవరికీ నిబద్ధుడై ఉండొద్దు.
21. మూర్ఖుడిగా కనిపించటంకోసం, మూర్ఖుడిలా ప్రవర్తించండి - మీ ముందున్న వ్యక్తికన్నా అమాయకుడిలా నటించండి.
22. లొంగిపోవడం అనే యుక్తిని ఉపయోగించండి: బలహీనతను శక్తిగా మార్చుకోండి.
23. మీ శక్తులన్నీ ఒకచోట కేంద్రీకరించండి.
24. పరిపూర్ణుడైన ఆస్థానికుడి పాత్ర నిర్వహించండి.
25. మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి.
26. మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
27. మిమ్మల్ని ఆరాధించే అనుచరుల బృందాన్ని తయారుచేసుకునేందుకు వాళ్ల నమ్మకాన్ని సంపాదించండి.
28. ధైర్యంగా పనిలో ప్రవేశించండి.
29. చివరిదాకా పూర్తి ప్రణాళికని వేసుకోండి.
30. మీ విజయాలు సులభంగా సాధించినవన్నట్టు కనిపించనీయకండి.
31. ఇతరుల నిర్ణయాలని నియంత్రించండి. మీరు పంచే పేకముక్కలలో ఇతరులు ఆడేటట్టు చూడండి.
32. అందరూ కనే పగటికలలని సమర్ధించండి.
33. ప్రతి వ్యక్తిలోనూ ఉండే బలహీనమైన అంశాన్ని గుర్తించండి.
34. మీ పద్ధతిలో మీరు రారాజులా ఉండండి. రాజులా గౌరవం పొందాలనుకుంటే, రాజులా పని చెయ్యండి.
35. సరైన సమయం ఎంచుకునే కళలో నిష్ణాతులు కండి.
36. మీరు పొందలేని వాటిని తిరస్కరించండి. వాటిని అలక్ష్యం చెయ్యడమే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రతీకారం.
37. ఆకట్టుకునే అద్భుత దృశ్యాలని సృష్టించండి.
38. మీకిష్టం వచ్చినట్టు ఆలోచించండి, కానీ అందరిలా ప్రవర్తించండి
39. చేపల్ని పట్టేందుకు నీళ్లని కదపండి
40. ఉచితంగా లభించేవాటిని తిరస్కరించండి
41. గొప్ప వ్యక్తిని అనుకరించటం మానండి.
42. గొర్రెల కాపరి మీద దాడి చేస్తే గొర్రెలు చెదిరిపోతాయి.
43. ఇతరుల హృదయాలనీ, మనసులనీ జయించండి.
44. అద్దం చూపించి సమ్మోహితులనీ, కోపోద్రక్తులనీ చెయ్యండి
45. మార్పు అవసరమని ఉపదేశించండి, కాని ఒక్కసారిగా మరీ ఎక్కువ సంస్కరించకండి.
46. మరీ నిర్దుష్టంగా ఉన్నట్టు కనబడకండి.
47. లక్ష్యాన్ని దాటి వెళ్లకండి, గెలిచిన తరవాత ఎక్కడ ఆగాలో తెలుసుకోండి.
48. నిరాకారులుగా తయారవకండి.
>>>డౌన్లోడు<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK