22-03-2021, 09:23 PM
(This post was last modified: 23-03-2021, 08:44 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రమా దాదా ఖలందర్...
నువ్వు చెప్పిన పుస్తకం ఏమిటో నాకు తెలీదు. అంచేత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళెగారు వ్రాసిన పుస్తకాలను గురించి అంతర్జాలంలో వెదికాను. నువ్వన్న పుస్తకం ఏదీ కనపడలేదు. ఐతే, వారు వ్రాసిన 'వెలుగు తగ్గిన తెలుగు' అనే పుస్తకం దొరికింది. యిది డెబ్బయి పుటాలున్న పుస్తకం. కనుక, నువ్వు అడిగిన పుస్తకం ఇది కాకపోవచ్చును. ఐనా, ఈ పుస్తకాన్ని ఇక్కడ పోస్టు చేస్తాను. తెలుగు భాషను గురించి పిళ్ళెగారి ఆవేదనను ఇక్కడ తెలుగువారు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

వెలుగు తగ్గిన తెలుగు
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
“మమ్మీ... ఎనభై ఏడు అంటే ఎంత ?"
— ఒక తెలుగు పిల్లవాడి ప్రశ్న
“ఎనభై ఏడు అంటే ఎయిటీ సెవెన్ !"
— ఆ తెలుగుతల్లి జవాబు
* * *
"గెట్ ది పోయమ్ డైహార్ట్ బై టుమారో !"
— ఇంగ్లీషు మీడియం కాలేజీలో ఒక పిల్లవాని హోంవర్కు బుక్ లో తెలుగు మాస్టారి రిమార్కు
* * *
“ఇదిగో... సిక్స్ చాక్లెట్స్... నీకు త్రీ, చిన్నీకి త్రీ!" — ఒక తెలుగు తండ్రి పిల్లలకు ఇచ్చే సూచన
* * *
“బంటీ, బంటీ - ఇదిగో ఎలిఫెంట్, ఎలిఫెంట్, లుక్ హియర్-లుక్ హియర్!”
— తిరుపతి బజార్లో దేవస్థానం ఏనుగును చూపి ఒక తెలుగుతల్లి పిల్లవానికి చెప్పే తెలుగుమాట. 'బంటీ' కూడా తెలుగు పిల్లవాని పేరే
"ఎర్లీ మార్నింగ్ ఫోర్ కంతా రెడీ అయి బస్టాండుకు వెళ్లానా, డైరెక్ట్ విజయవాడ బస్సు జస్ట్ మిస్సయిపోయింది. ఫైవ్ కు నెల్లూరు బస్సు ఉందన్నారు. అంతలోపల టీ తాగొద్దామని వెళ్తే టీషాప్ అప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. స్టవ్ వెలిగించి టీ బాయిల్ చేసేదాకా వెయిట్ చేసి, వెయిట్ చేసి టీ తాగేటప్పటికి ఫోర్ ఫార్టీ. బస్టాండుకు వెళ్తే అప్పటికే నెల్లూరు బస్సు ఫిలప్ అయిపోయింది. లాస్ట్ సీటు దొరికింది.”
— ఇది ఒక విద్యావంతుని మాటలు. పాలల్లో నీళ్లు కలిశాయా నీళ్లలో పాలు కలిశాయా అన్నంత మిశ్రమం!
.
.
.
ఎక్కడికీ పయనం?
తెలుగు భాష ఏమయిపోతూ ఉంది?
తెలుగుజాతి ఏమయిపోతూ ఉంది?
తెలుగుకు సంబంధించినదంటూ ఏమి మిగులుతూ ఉంది?
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK