10-11-2018, 01:45 AM
72.1
జరిగింది అంతా కలలో లాగా అనిపించింది ఇద్దరికీ, కాని గందర్వుల మాటల ఓ వైపు సంతోషం , మారో వైపు భయం కలిగించాయి . ఆ తటాకం చుట్టుపక్కల ఎవ్వరైనా అడా మగా కలిస్తే వారికి సంతానం కలుస్తుంది అనే మాట వాళ్లకు సంతోషాన్ని ఇచ్చింది. కాని వాళ్ళు పెట్టిన శాపం కొద్దిగా భయాన్ని, ఆ శాపం తొలిగిపోయేటప్పుడు తమకు ఎనలేని సంపద చేరుతుంది అనేది సంతోషం కలుగచేసింది.
మరుసటి రోజు విపరీతమైన వర్షం కురిసింది ఆ ప్రాంతం అంతా, అది చూసి మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వచ్చేశారు.
సరిగ్గా అది జరిగిన నెల రోజులకి అక్కడ గందర్వులు చెప్పిన మాటలు నిజం అనడానికి సూచనగా రాజి ముట్లు ఆగిపోయాయి, అలా రాజీ గర్బవతి అయ్యింది. రాజి ప్రసవించ గానే వారి పెట్టిన శాప ప్రభావం కనబడింది. అలా అప్పు డప్పుడు కూతురు చేష్టలు వారిని భయపెట్ట సాగాయి.
ఆ విధంగా ఇద్దరు జరిగింది అంతా గుర్తుకు తెచ్చుకొని నిద్రలోకి జారుకొన్నారు.
అలా కొన్నిసంవత్సరాలు ఎటువంటి విచిత్రం జరక్కుండా గడిచిపోయింది. ఓ రోజు చేలో గోర్లు మేపుతున్న మనోడికి అక్కడ మెరుస్తున్న మూడు రాళ్ళు కనబడ్డాయి. కూతురుకు ఆడుకోవడానికి పనికొస్తాయని, సద్ది తెచ్చుకొన్న గుడ్డలో మూట కట్టి బుజాన వేసుకొని ఇంటికి వచ్చాడు.
తను ఇంటికి వస్తూనే ఎప్పుడు ఎదురొచ్చే కూతురు , ఇంట్లో మూల చాపమీద పడుకోవడం చూసి
"ఏమైంది బిడ్డా అక్కడ పడుకోన్నావు అన్నాడు ". ఇంతలో దొడ్లో ఉన్న రాజి తనను బయటకు తీసుకోని వెళ్లి , నీ కూతురు పెద్దమనిషి అయ్యింది అని చెప్పింది. పెద్ద పండగ చేయక పోయినా, దానికి కొత్త బట్టలు కుట్టిచ్చి 15 రోజుల తరువాత నలుగు పెట్టిద్దాము , వచ్చిన వాళ్ళకు రైక గుద్దలన్నా ఇయ్యాక పొతే ఎం బాగుంటుంది అని చెప్పింది.
"ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడ నుంచి తేనే ? పోనీ మీ దొరసానమ్మగారిని అడుగుతావా "
"సరే ఇంకా టైం ఉందిగా అప్పుడు చూద్దాం లే , సద్దిగుడ్డ ఇలా తే ఉతికి ఆరేస్తా రేపటికి కావాలికదా " అని తన బుజం మిద ఉన్న సద్దిగుడ్డ తీసుకోని
"ఎం కట్టావు ఇందులో , బరువుగా ఉన్నాయి " అంటూ విప్పి అందులోంచి బయట పడి మెరుస్తున్న రాళ్ళు చూసి.
"యాడ దొరికినాయి మామా ఇవ్వి , ఎం రాళ్ళు ఇవి " అని అడిగింది
"అక్కడ చేలో దొరికితే తెచ్చినానే , పిల్లాడి ఆదుకొంటుంది అని , ఇంతకీ ఎం రాళ్ళు అవి "
"ఏమో మామా , నాకు డౌట్ గా ఉంది , నేను దొరసానమ్మకు చూపిస్తా , ఇవి మెరుస్తున్నాయి " అంటూ అప్పటి కప్పుడు వాటిని పైట చేరుగులో ముట కట్టుకొని దొరసానమ్మ ఇంటికి వెళ్ళింది.
అక్కడే ఉన్న చోదరి , ఆ రాళ్ళు చూసి , మీ పంట పండిందే , నీ మొగుడికి దొరికిన రాళ్ళు చాలా విలువైనవి , కొన్ని లక్షలు చేస్తాయి , రేపు వాన్ని నాతొ పాటు పట్నం రమ్మను , నాకు తెలిసిన సెట్ వున్నాడు , వాడు అమ్మి పెడతాడు అని రాజి ని ఇంటికి పంపించాడు.