20-03-2021, 01:23 PM
(This post was last modified: 21-03-2021, 08:31 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
అగ్రహారం కథలు
(Agraharam Kathalu)
వేదుల సుభద్ర
(Vedula Subhadra)
పుట్టిన ఊరూ, పెరిగిన వాతావరణం, తెలిసిన వ్యక్తుల్ని వస్తువుగా చేసుకుని - తనదైన ప్రపంచంలోకి పాఠకులని పరకాయప్రవేశం చేయించే రచనా వ్యాసంగం దాదాపు నూటయాభై సంవత్సరాల కిందటే ప్రారంభం అయింది.
ధామస్ హార్డీ 'ససెక్స్' నవలలు తొలి ఉదాహరణలు.
ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత ఆర్.కె.నారాయణ్ 'మాల్‌గుడి'ని తెలియని వారుండరు.
మిత్రుడు సత్యం శంకరమంచి 'అమరావతి'ని తన కథల్లో చరితార్ధం చేశారు.
మరో మిత్రుడు వంశీ 'పసలపూడి కథలు', 'దిగువ గోదారి కథలు' చక్కని ఉదాహరణలు. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'మిట్టూరోడి కతలు', మహమ్మద్ ఖదీర్ బాబు 'దర్గామిట్ట కథలు', 'భట్టిప్రోలు కథలు' ఇలాంటివే!
ఈ కోవకి చెందిన మరో గొప్ప ప్రయత్నం వేదుల సుభద్ర 'అగ్రహారం కథలు'.
ఈ తరహా రచనలో చిన్న సుఖం ఉంది... చిన్న గడుసుదనం ఉంది... చిన్న సవాలు ఉంది. వారికి తెలిసిన ఆయా ప్రాంతాల కథలు కనుక - వారికి తెలిసినవే, లేదా వారు తెలిపినవే మనకి తెలుస్తాయి. రెండోది వారు చెప్పిన ఘనతే మనక తెలిసేది. మూడోది ఒకే ప్రాంతంలో, ఒకే వస్తువుని ఎత్తుకుంటున్నారు కనుక పునరుక్తి దోషం తగిలే ప్రమాదం ఉంది. అయితే ఇవేవీ ఈ 'అగ్రహారం కథల' రుచిని ఏ మాత్రమూ భంగపరచలేదు.
ఈ అగ్రహారం పేరు పేరమ్మ అగ్రహారం. అమలాపురం సమీపంలో బోడసకుర్రు, గంగలకుర్రు, భూపయ్య అగ్రహారం, కొంకాపల్లి, పేరూరులకి అటూఇటూగా ఉంది. ఇవన్నీ సస్యశ్యామలమైన అగ్రహారాలు - సంప్రదాయానికీ, సంపదకీ.
అగ్రహారం జీవితాన్ని కాచి వడబోసిన, ఆ జీవనంతో మమేకమయిన, మనస్సులో అమూల్యంగా పొందుపరుచుకున్న - చక్కని సంప్రదాయం, నుడికారం, రచనా దక్షతా ఎరిగిన రచయిత్రి రచన ఇది.
- గొల్లపూడి మారుతీరావు
>>>అగ్రహారం కథలు<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK