20-03-2021, 01:24 AM
(This post was last modified: 20-03-2021, 11:01 AM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
అమీష్ త్రిపాఠి రచనలు
(తెలుగు అనువాదంలో)
శివ త్రయం
1) మెలుహా మృత్యుంజయులు
1900 BC.
ఆధునిక భారతీయులు సింధూ నాగరికతను తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఆ కాలపు నివాసులు దీనిని మెలుహా భూమి అని పిలిచేవారు, ఇది చాలా శతాబ్దాల ముందు సూర్యవంశ చక్రవర్తి అయిన శ్రీ రాముని చేత సృష్టించబడింది, ఆయన ఇప్పటివరకు నివసించిన గొప్ప చక్రవర్తులలో ఒకరు. ఒకప్పుడు ఈ సూర్యవంశీ పాలకుల ప్రాధమిక జీవనది అయిన గౌరవనీయమైన సరస్వతి తర్వాతి కాలంలో నెమ్మదిగా అంతరించి పోతున్నందున వారు తీవ్రమైన అగచాట్లను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో చంద్రవంశీయుల భూమి అయిన తూర్పు నుండి వినాశకరమైన ఉగ్రవాద దాడులను కూడా వారు ఎదుర్కొంటున్నారు. విషయాలను మరింత దిగజార్చడానికి, చంద్రవంశీయులు నాగాలతో పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. ఆశ్చర్యపరిచే యుద్ధ నైపుణ్యాలతో వికృతమైన శరీర ఆకృతి కలిగిన ఈ 'నాగా'లు మానవులచే బహిష్కరించబడిన చెడు జాతి!
ఇట్టి విపత్కర పరిస్థితుల్లో సూర్యవంశీయులకు ఉన్న ఏకైక ఆశ వారి పూర్వీకులు చెప్పిన ఒక జోస్యం:
'చెడు పూర్తి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఆశలన్నీ అడుగంటి నప్పుడు, శత్రువులు విజయం సాధించినట్లు అనిపించినప్పుడు, తమను రక్షించేందుకు ఒక నాయకుడు తప్పక ఉద్భవిస్తాడు' అని.
టిబెటన్ ప్రాంతం నుంచి తన తెగతో సహా మెలుహాకి వలస వచ్చిన శివ అనే వ్యక్తిని అందరూ తమ నాయకుడిగా భావించడానికి అతనిలో గల లక్షణాలు ఏమిటి? మరి అతను కూడా తనని తాను వారికి నాయకుడిని అని అనుకుంటున్నాడా? లేకపోతే, విధి అతన్ని మెలుహాకి తీసుకెళ్ళిందా? ఏదేమైనా, తనని నమ్మి వలస వచ్చిన ప్రజానీకానికి మంచి చెయ్యడానికో, లేక తను ప్రేమించిన వ్యక్తి పట్ల ఆకర్షితుడు కావడం వల్లనో శివుడు సూర్యవంశీయుల ప్రతీకారానికి నాయకత్వం వహించినా, అతను నిజంగా చెడును నాశనం చేస్తాడా?
>>>డౌన్లోడ్<<<
2) నాగా రహస్యం
వేట కొనసాగుతోంది. ఒక దుర్మార్గుడైన నాగా తన ప్రాణ మిత్రుడైన బృహస్పతిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భార్య సతీని వెంటాడుతున్నాడు. చెడుని నిర్మూలించడానికి అవతరించినట్టుగా భవిష్యవాణి చెప్పబడిన టిబెట్ వలసదారు శివ ఎక్కడికక్కడ దుష్ట స్వభావాన్ని ప్రతిఘటించి గానీ నిద్రపోడు. శివ ప్రతీకార పధంలో పయనించే సందర్భంలో సరిగ్గా తను అనుకున్నట్టే నాగా ప్రాంతాన్ని చేరుకుంటాడు.
మోసం, కపటం లేనిదెక్కడ? అన్నిచోట్లా ఉంది. ఒక అద్బుతమైన ఔషధానికి ప్రతిఫలంగా చెల్లించవలసిన మూల్యం కోసం ఒక రాజ్యం రాజ్యమే అంతమైపోవడానికి సిద్దంగా ఉంది. యువరాజు హతమయ్యాడు. ఆధ్యాత్మిక మార్గదర్శకులైన వసుదేవులు చెడుని సహాయంగా తీసుకుంటూ, తమపై తిరుగులేని నమ్మకం కలిగి ఉన్న శివని మోసం చేశారు. మెలుహ రాజ్య పరిపూర్ణత కూడా జనన ప్రాంతమైన మైకాలో దాగిన భయంకరమైన రహస్యాలతో పెద్ద చుక్కుముడిలా తయారైంది. శివకి తెలియకుండా, మహా మేధావి ఎవరో వెనకాల ఉండి, ఈ తోలు బొమ్మలాటకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ప్రయాణంలో శివ ప్రాచీన అఖండ భారతావని అంతా పర్యటించాడు. అడుగడుగునా ప్రాణాంతకమైన మర్మాలు దాగిన ప్రాంతంలో శివ సత్యాన్వేషణ జరుపుతున్నాడు. అన్ని చోట్లా తనకు అర్ధమైన గొప్ప సత్యం ఒకటే.... కనిపించే ప్రతీది అలా మాత్రమే ఉండదు.....! భయంకరమైన యుద్దాలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో సంధి బలపడింది.
శివ త్రయంలోని మొదటి భాగమైతే ఆ తర్వాత వెలువడుతున్న ఈ రెండవ భాగంలో నమ్మలేని రహస్యాలు అనేకం బహిర్గతమవుతాయి.
>>>డౌన్లోడ్<<<
3) వాయుపుత్ర శపథం
చెడు విజృంభించింది
ఇక దేవుడే నిలువరించాలి దాన్ని!
శివ తన బలగాన్ని సమీకరించాడు. నాగా రాజధాని పంచవటీ చేరుకున్నాడు. చివరికి అసలు చెడు బయటబడింది. ఏ పేరు వింటే యోధానుయోధులు సైతం గడగడ వణుకుతారో.... ఆ నీలకంఠ... తన అసలు శత్రువుపై ధర్మయుద్ధానికి సిద్దమయ్యాడు!
ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన యుద్ద పరంపరలు భారతదేశాన్ని చిగురుటాకులా వణికించాయి. ఈ యుద్ధాలు భారత దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు జరిగిన కుట్రలు! ఈ యుద్దాల్లో లక్షలాదిమంది మరణించారు. కానీ శివ వైఫల్యం చెందకూడదు! నిరశావహమైన పరిస్థితుల్లో ఉన్న శివ ఎంతో దైర్య సాహసాలతో, ఇప్పటిదాకా తనకు ఎలాంటి సహాయమూ అందించనివారి దగ్గరకు వెళ్తాడు: వారే వాయుపుత్రులు!
మరి శివ విజయం సాధిస్తాడా? చెడుతో పోరాటం చేస్తున్న క్రమంలో శివగానీ, భారతదేశంగానీ, శివ అత్మగానీ ఎంతటి భారీమూల్యాలు చెల్లించుకోవలసిన వచ్చింది?
ఆసక్తికరంగా అన్వేషిస్తున్న మీ ప్రశ్నలకి బెస్ట్ సెల్లింగ్ శివ త్రయం ముగింపు భాగమైన ఈ మూడవ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి!
>>>డౌన్లోడ్<<<
రామచంద్ర గ్రంథమాల
ఇక్ష్వాకు కుల తిలక
>>>డౌన్లోడ్<<<
సీత
మిథిల యోధ
>>>డౌన్లోడ్<<<
ఇక్ష్వాకు కుల తిలక
అయోధ్య విభేదాలతో బలహీనపడింది. ఒక భయంకర యుద్ధం వినాశనం మిగిల్చింది. ఈ నష్టం చాలా విస్తారమైనది. లంకనేలే రాక్షస రాజు రావణుడు పరాజితులైన తన పాలనను రుద్దలేదు. తన వర్తకాన్ని రుద్దాడు. ఈ సామ్రాజ్యంలోంచి సంపదను దోచుకున్నాడు. సప్తసింధులో పేదరికం, నిస్పృహ, అవినీతి పెచ్చు పెరిగాయి. ఈ పంకిలం నుంచి వాళ్ళను ఉద్దరించే నాయకుడి కోసం తహతహ లాడుతున్నారు. ఆ నాయకుడు తమ మధ్యే ఉన్నాడన్న విషయం వారు గ్రహించారు. అతను వాళ్లకు బాగా తెలిసినవాడే. మానసిక అశాంతి, హింస, వెలి అనుభవించిన రాకుమారుడు. వారు నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన రాకుమారుడు. ఆ రాకుమారుడి పేరు రాముడు. అతని దేశ ప్రజలు అతన్ని బాధించినా సరే, అతను తన దేశాన్ని ప్రేమిస్తాడు, చట్టం కోసం నిలబడతాడు, అతని సేన అతని భార్య సీత, తమ్ముళ్ళు, తను. సంక్షోభమనే చీకటిపై పోరు.
రాముడు తన పట్ల జనం చూపిన వెక్కిరింతను అధిగమించ గలుగుతాడా? ఈ పోరాటంలో సీత మీద అతని ప్రేమ నిలబడ గలుగుతుందా? తన బాల్యాన్ని ధ్వంసం చేసిన రావణున్ని ఓడించ గలుగుతాడా? విష్ణువు నిర్వహించవలసిన అవతార కర్తవ్యాన్ని నిర్వహించ గలుగుతాడా? అమీశ్ వినూత్న సృజనతో ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభించండి. అదే రామచంద్ర గ్రంథమాల.
>>>డౌన్లోడ్<<<
సీత
మిథిల యోధ
ఆమె మనకు అవసరమైన యోధురాలు,
మనం నిరీక్షించిన దేవత, ఆమె ధర్మాన్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది,
భారతదేశం, 3400 బి.సి.
భారతదేశం విభేదాలు, విద్వేషం, పేదరికంతో అల్లాడుతోంది. ప్రజలు పాలకులను ద్వేషిస్తున్నారు. స్వార్థపరులైన, అవినీతిపరులైన ఉన్నతవర్గాల వారిని అసహ్యించుకుంటున్నారు. చిన్న చిదుగు అంటుకుంటే సంక్షోభమే. విదేశీయులు ఈ విభేదాలను ఉపయోగించుకుంటున్నారు. లంక రాక్షసరాజు రావణుడు రోజురోజుకీ శక్తిమంతుడవుతూ దురదృష్టవంతమైన సప్తసింధులో తన కోరలను లోతుగా దింపుతున్నాడు.
పవిత్ర భారతభూమికి రక్షకులుగా ఉన్న రెండు శక్తివంతమైన తెగలు ఇంక ఉపేక్షించి చాలు అనుకున్నాయి. రక్షకుడు అవసరం అని భావించాయి. అవి అన్వేషణ ఆరంభించాయి. ఎవరో పసిబిడ్డను పొలంలో అనాథగా వదిలి వేశారు. తోడేళ్ళ బారు నుంచి ఒక రాబందు ఆమెను కాపాడింది. అందరూ విస్మరించిన, శక్తిహీనమైన మిథిల రాజ్యపాలకుడు ఆమెను దత్తత తీసుకున్నాడు. ఈ బిడ్డ ఏదో సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. కాని వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆమె సామాన్య బాలిక కాదు. ఆమె సీత.
అమీష్ తాజా నవలతో మీ పౌరాణిక యాత్రను కొనసాగించండి: దత్తత తీసుకున్న అమ్మాయి చేసే ఉత్కంఠభరిత సాహసాలు చూడండి. ప్రధానమంత్రి అయింది. తరువాత దేవత అయింది. రామచంద్ర గ్రంథమాలలో ఇది రెండో పుస్తకం. మిమ్మల్ని వెనక్కి తీసుకెళుతుంది. ఎంత వెనక్కి అంటే ఆరంభానికి ముందేం జరిగిందో తెలుసుకొనేటంతగా. అమీష్ పౌరాణిక కల్పన గతాన్ని శోధించి భవిష్యతు అవకాశాలను ఒడిసిపడుతుంది.
- దీపక్ చోప్రా
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK