16-03-2021, 02:24 PM
అవసరాల రామకృష్ణారావు
అవసరాల రామకృష్ణారావుగారు (డిసెంబర్ 21, 1931 - నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. వీరి రచనల్లో కాస్త వ్యంగ్య ధోరణి కనపడుతుంది.
ఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించేవారు. తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు. విశాఖపట్నంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశారు. తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు.
2011, నవంబర్ 28 న హైదరాబాదులో స్వర్గస్థులయారు.
అవసరాల రామకృష్ణారావు గారి
కొన్ని రచనలు
అయిదురకాల ఆత్మహత్యలు
ఇందులో...
పత్రికా కథల సంకలనాలు
వీటిల్లో అవసరాల రామకృష్ణారావు గారు జ్యోతి, ఇండియా టుడే, యువ, అనామిక వంటి వివిధ వార పత్రికలకి వ్రాసిన కథలను స్కాన్ చేసి సంగ్రహం చెయ్యడం జరిగినది.
అవసరాల రామకృష్ణారావు కథలు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1997 లో అవసరాల రామకృష్ణారావు గారు పలు పత్రికలకు రాసిన 19 చిన్న కథలను ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది.
>>>డౌన్లోడ్<<<
గణిత విశారద
నక్షత్రాలెన్ని ?
ఇసుక రేణువులన్ని
ఇసుక రెణువులెన్ని?
సముద్ర తరంగాలన్ని
సముద్ర తరంగాలెన్ని?
తల వెంట్రుకలన్ని
తల వెంట్రుకలెన్ని ?
నక్షత్రాలన్ని
నక్షత్రాలెన్ని ?
ఇసుక రెణువులెన్ని?
ఈ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా ఉన్నాయి కదూ !
"ఓ సంచిలో కొన్ని రూపాయలు కొన్ని పావలాలు ఉన్నాయి . రూపాయి పావలాలుగాను, పావలాలు రూపాయలుగా మారిపోతే పదిహేను రూపాయల విలువ తగ్గుతుంది .
సంచిలో మొదటున్న ఏ నాణేలు ఎన్నెన్ని ?"
ఈ పుస్తకంలో ఇటువంటి ప్రశ్నలెన్నో, ఒక చక్కని కథలో రచయిత ఎన్నో చిక్కు లెక్కలు ఇమిడ్చారు.
చదవండి.
గణిత విశారదలు కండి.
>>>డౌన్లోడ్<<<
కథానికలు
రామకృష్ణారావుగారి కలం నుంచి జాలువారిన రెెెండు చిట్టి కథానికలు. చదువుకోండి మరి!
కేటు డూప్లికేటు
'భగవంతుని సృష్టిలో అందరూ తెలివైన వాళ్లే ఉండరు. వాళ్ళని నువ్వు మోసం చేస్తే నిన్ను మోసం చేసేవాడు తయారుకావచ్చు. అయినా వంచన చేసే బతుకూ, ఏం బతుకదీ!'
>>>డౌన్లోడ్<<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK