11-12-2018, 10:06 AM
(This post was last modified: 07-08-2019, 03:09 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ ః 22
అక్కడ పార్కింగ్ లో తన కారు ఉండటం చూసి దాని దగ్గరకు వెళ్ళి చేతులతో తడుముతూ ముందు వైపుకు వచ్చి తన కారు నెంబర్ ప్లేట్ వైపు చూసి అది తనదే అని నిర్ధారణకు వచ్చి…మళ్ళీ విల్లా లోపలికి వెళ్ళి తను పడుకునే బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
అక్కడ బెడ్ మీద తన బ్యాగ్, లాప్ టాప్ అన్నీ ఉండే సరికి ఇక తను తన కాలానికి వచ్చేసినట్టు రాముకి పూర్తిగా అర్ధం అయింది.
ఇప్పుడు రాము మనసులో తన కాలానికి వచ్చేసినందుకు ఆనందపడాలో లేక తన భార్యా పిల్లల్ని పోగొట్టుకున్నందుకు బాధ పడాలో అర్ధం కాక అలాగే బెడ్ మీద కూలబడిపోయాడు.
అలా కూర్చున్న రాముకి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా వెంటనే బెడ్ మీద నుండి లేచి ఇంతకు ముందు తనకు రేణుక లెటర్ దొరికిన బుక్ షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి అక్కడ చూసాడు.
ఆ బుక్ షెల్ఫ్ లో ఒక ఫోటో ఆల్బం, దానితో పాటు లెటర్ కనిపించింది.
రాము ఆ ఆల్బం తీసుకుని కింద పెట్టి లెటర్ తెరిచి చూసాడు….ఆ లెటర్ తన భార్య రేణుక రాసింది….
ఆ లెటర్ లో…..
డియర్ హబ్బీ రాము…..
నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నువ్వు నీ కాలానికి తిరిగి వెళ్ళావని అర్ధమవుతున్నది.
నీకు సంబంధించి కొన్ని నిముషాలు మాత్రమే….కాని నాకు సంబందించి నా జీవితం యాభై ఏళ్ళు గడిచిపోయాయి.
నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను బ్రతికి ఉంటానో లేదో కూడా తెలియదు.
నువ్వు అలా ఊహించని విధంగా మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళేసరికి నీకు ఏం చెప్పటానికి నాకు అవకాశం దొరకలేదు.
నువ్వు వెళ్ళిపోయిన తరువాత నాకు ఒక్క విషయం అర్ధమయింది….ఏదైనా విలువైన వస్తువైనా, బంధం అయినా అది పోగొట్టుకున్న తరువాత కాని దాని విలువ అర్ధం కాదు.
నిన్ను పోగొట్టుకున్న తరువాత నేను పేరుకే బ్రతికి ఉన్నాను…జీవితాన్ని మాత్రం నీతోనే వదిలేసాను…తినడం, తాగడం, నిద్ర పోవడం, నవ్వడం ఏడవడం అన్నీ మర్చిపోయాను.
నువ్వు లేని ఆ విల్లాలో ఇక నాకు ఉండబుద్ధి కాలేదు.
అక్కడే ఉంటే ప్రతి క్షణం నీ ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ విల్లాలో మనం గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటున్నప్పుడల్లా నువ్వు లేవన్న విషయం గుర్తుకొచ్చి నాకు ఏడుపు ఆగడం లేదు.
అందుకనే ఆ విల్లాని అమ్మేసి పిల్లలను తీసుకుని ముంబై వచ్చేసాను.
కాని ఎప్పటికైనా నువ్వు ఆ విల్లాకు వస్తావన్న ఆశతో విల్లాని కొన్న అతన్ని రిక్వెస్ట్ చేసి మనకు సంబంధించిన ఫోటోలు అన్నీ అప్పటి మన బెడ్ రూమ్ లో పెడుతున్నాను.
కొద్దిరోజుల తరువాత నాకు నీ ప్రతిరూపాలైన మన పిల్లల కోసం అయినా బ్రతకాలనిపించింది.
మన పిల్లలతో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
అది కూడా వాళ్ళల్లో నిన్ను చూసుకుంటూ సంతోషపడుతున్నాను.
నువ్వు వెళ్ళిపోయిన కొన్ని ఏళ్ళ తరువాత మన పిల్లలు ముగ్గురూ పెద్దవాళ్ళయ్యారు.
ముగ్గురూ ఒకరికొకరు ప్రాణంగా కలిసి మెలిసి ఉన్నారు.
తరువాత ముగ్గురికీ ఒకరి తరువాత ఒకరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి.
ప్రతి పెళ్ళిలోనూ నువ్వు నా పక్కన లేవన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉన్నది.
మన ముగ్గురి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తరువాత కొత్త కోడళ్ళతో, కొత్త అల్లుడితో ఇల్లంతా సందడిగా ఉన్నది.
తరువాత మన రెండో అబ్బాయి కి మొదటగా మగ పిల్లాడు పుట్టాడు.
నీకు మొట్ట మొదటి మనవడు….వాడి పేరు శివ రామ్ కుమార్….నీ పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నాను.
విచిత్రం ఏంటంటే వాడిలో నీ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దాంతో నాకు వాడిని చూసినప్పుడల్లా నిన్నే చూసినట్టు, మాట్లాడినట్టు అనిపిస్తున్నది. తరువాత మన పెద్ద అబ్బాయికి ఇద్దరు మగపిల్లలు వినయ్, హర్ష….ఒక కూతురు ప్రియ పుట్టారు.
మన అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు.
ఇల్లంతా మనవళ్లతో మనవరాలితో చాలా సందడిగా, సంతోషంగా ఉన్నది.
ప్రతి ఫంక్షన్ లో నువ్వు లేని లోటు మా అందరికీ బాగా తెలుస్తున్నది.
అందుకని నేను ప్రతి ఫంక్షన్ ఫోటోస్ ని ఒక ఆల్చంలా చేసి ఇక్కడ బుక్ షెల్ఫ్ లో పెడుతున్నాను.
ఇప్పుడు నువ్వు నీ కాలంలోకి వచ్చిన తరువాత నీకు అక్కడ ఒబరాయ్ విల్లాలో నా కేకలు ఎప్పటికీ వినిపించవు.
ఎందుకంటే ఆ కేకలను, అరుపులను నువ్వు సంతోషంలోకి మార్చేసావు.
నువ్వు ఈ ఫోటో ఆల్బం, లెటర్ చూసిన వెంటనే వీలైనంత తొందరగా మా దగ్గరకు వస్తావని ఆశిస్తున్నాను.
నువ్వు నీ కాలానికి వచ్చి నన్ను కలిసేసరికి నీ వయసులో మార్పు లేకపోయినా నాకు మాత్రం దాదాపు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి.
అందుకని నేను కన్ను మూసేలోపు నిన్ను ఒక్కసారన్నా చూసి పోవాలనుకుంటున్నాను.
నా కోరిక తీరుతుందని ఆశిస్తూ…..
ప్రేమతో….
నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ….నీ కోసం నువ్వు వస్తావని ఎదురుచూస్తూ ఉండే….
నీ భార్య……
రేణుక…….
ఆ లెటర్ చదివిన తరువాత రాము దాన్ని మడిచి బ్యాగ్ లో పెట్టుకుని ఫోటో ఆల్బం తీసుకుని ఫోటోలు చూస్తున్నాడు.
అందులో తన ఇద్దరు కొడుకుల పెళ్ళి ఫోటోలు, కూతురి పెళ్ళి ఫోటోలు.
తరువాత మనవళ్ళు మనవరాలు పుట్టినప్పటి ఫోటోలు వాళ్ళ బారసాలలు…..అన్నీ ఫోటోలు ఉన్నాయి.
వాటిని చూస్తున్న రాము మనసు ఆనందంతో నిండిపోతున్నది…..తన కొడుకులను, కోడళ్ళను అందరినీ ఎంత తొందరగా చూద్దామా అని రాము మనసు ఆరాటపడిపోతున్నది.
ఆ ఫోటోలు, లెటర్ చదివిన తరువాత రాము మనసు చాలా ఉత్సాహంగా ఉన్నది.
గోడ మీద తగిలించి ఉన్న తామిద్దరి (రాము, రేణుక) ఫోటో వైపు కొద్దిసేపు కన్నార్పకుండా అలాగే చూసాడు రాము.
బెడ్ మీద నుండి లేచి గబగబ స్నానం చేసి రెడీ అయ్యి ఫోన్ తీసుకుని రంగకి ఫోన్ చేసాడు.
రాము : హలో….రంగా…..
రంగ : హా….చెప్పండయ్యా….మీ ఫోన్ కోసమే చూస్తున్నా…..మీరు బాగానే ఉన్నారు కదయ్యా…..
రాము : బాగానే ఉన్నాను రంగా….ఇక ఇక్కడ మొత్తం సెట్ అయిపోయింది…..
రంగ : ఎలా అయ్యా…..ఏం జరిగింది….
రంగాకి జరిగింది చెప్పి….
రాము : అంతా మనం అనుకున్నట్టే జరిగింది….
రంగ : నిజంగానా బాబూ….
రాము : అవును రంగ…..నేను ఆమె దగ్గరకు వెళ్తున్నాను….నువ్వు, అనసూయ వచ్చి విల్లాని కొంచెం శుభ్రం చేయండి….
రంగ : అయ్యా…..ప్రమాదం ఏమీ లేదుకదా….
రాము : రంగా….ఇదివరకు నిన్ను విల్లా వైపు వెళ్ళొద్దన్న వాడిని…..ఇప్పుడు భయం లేదంటున్నా కదా…..
రంగ : సరె….నా పెళ్ళాన్ని తీసుకుని ఒక గంటలో వచ్చేస్తానయ్యా….
రాము : నేను సుమిత్ర గారి ఇంటికి వెళ్తున్నాను…..నువ్వు వచ్చి ఈ లోపు మొత్తం క్లీనింగ్ చేయించు….మనుషులు ఎవరైనా హెల్ప్ కావాలంటే తెచ్చుకో……