Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మిక చింతన
#49
[Image: images?q=tbn:ANd9GcRnNueaVH23hVTh5s5mPMW...A&usqp=CAU]
గురు పాదాల విలువ
భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి  ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరకి, హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్‌ వచ్చి, హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు.

ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా చెప్పాడు.

“హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప.”

“ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది? ".

“పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలనాశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు, అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బావుండేదనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ళ నించి గంగా యమునలు ప్రవహిస్తూంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమౌతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది?" అడిగాడా అమెరికన్‌ సీరియస్‌గా.

స్వామీజీ చిన్నగా నవ్వి .....

“అలా నదివద్దకి వెళ్ళి మాట్లాడుకుందాం పద.”

ఇద్దరూ నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు నదిలోకి గాలాన్ని విసిరి చేపలు పడుతున్నారు.

నీళ్ళల్లో నిలబడి గాలానికి ఎర్రలను గుచ్చి దూరంగా విసురుతున్నారు.
గాలానికి చేపలు పడ్డాక, వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు.

“ఆ గాలానికి ఏ చేపలు పడుతున్నాయి?  వారి పాదాల వద్ద ఉన్నవా?   లేక   దూరంగా వున్న చేపలా?” ప్రశ్నించాడు స్వామీజీ.

“దూరంగా ఉన్నవే” చెప్పాడు అమెరికన్‌ వినమ్రంగా.

“భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని గాలం మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు.

గురు పాదాలను ఆశ్రయించకుండా, వాటికి దూరంగా వుండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూంటారు." వివరంగా చెప్పారు స్వామిజీ.

గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్ధ్యములు ఎవ్వరికీ లేవు.

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః||.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 09-03-2021, 11:16 PM



Users browsing this thread: 9 Guest(s)