Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనం చదివిన పుస్తకాలు - మనం రాసే సమీక్షలు
#8
తప్పుచేద్దాం రండి.. సమీక్ష

[Image: a62bbc5b-a46b-49e6-8d1a-04c18d2f4994.jpg]



యండమూరి వీరేంద్రనాథ్ రచనల్లో 'బెస్ట్' ఏదీ అంటే చెప్పటం చాలా కష్టం... ఏవైనా రెండే ఎంచుకోమంటే నేను మొదటగా[b] "తప్పుచేద్దాం రండి"
తర్వాత  "అంతర్ముఖం" ఎంచుకుంటాను...

"తప్పు చేద్దాం రండి" అద్భుతమైన రచన...
యండమూరి ముందు నవలలు రాసాడు... తర్వాత "విజయానికి అయిదు మెట్లు" రాయడం ద్వారా వ్యక్తిత్వ వికాస రచనల్లో అడుగు పెట్టాడు...

"తప్పు చేద్దాం రండి" ఈ రెండు కోవల్లోకీ వస్తుంది...
ఒక వైపు ఉత్కంఠ భరితంగా ఒక కథను చెబుతూనే అందులోని పాత్రల ద్వారా వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెబుతాడు రచయిత... మొదటిసారి చదివినప్పుడు కలిపి చదివినా రెండో సారి చదివేప్పుడు కథ ని గానీ , వ్యక్తిత్వ వికాసం అంశాలు గానీ ఏదో ఒక్కటే చదువుకునే వీలుగా రెండింటినీ రెండు రంగుల్లో ముద్రించారు...

కథ విషయానికి వస్తే ఒక సామాన్యుడు దేవుడి అవసరం లేకుండా ఎవరైనా జీవించ వచ్చని దేవుడితోనే ఛాలెంజ్ చేస్తాడు...  తనకు దేవుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడతాడు... తన ప్రతినిధిగా ఒక సామాన్యురాలిని ఎంచుకొని తాను రాసిన పుస్తకాన్ని ఆమెకు ఇస్తాడు...  
ప్రియుడి చేతిలో మోసపోయిన  అమాయక పేద అనాధ అయిన ఆ అమ్మాయి అతని ప్రభావంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతుంది...

దేవుడు కూడా తన ప్రతినిధిగా  ఒక పరమ భక్తుణ్ణి ఎంచుకుంటాడు... అతని జీవితమంతా  ఎన్ని బాధలు ఎదురైనా దేవుని మీద విశ్వాసం సడలదు..

చివర్లో దేవుణ్ణి ఛాలెంజ్ చేసిన వ్యక్తి, దేవుడు  తమ ప్రతినిధులు సాక్షులు గా చేసుకొని తమ తమ వాదనలు వినిపిస్తారు... ఎవరి వాదన నెగ్గుతుంది అనేది  వేరేవిషయం కానీ పుస్తకం చదువుతున్నంతసేపు మనం ఇంకో లోకంలో ఉంటాం...

పుస్తకంలో ఎన్నో ఉదాహరణలు, చిన్న కథలు ఆసక్తిగా ఉంటాయి...  " మంత్రి కొడుకు- బిచ్చకత్తె" కథ ఈ పుస్తకానికే హైలెట్...

ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం "తప్పుచేద్దాం రండి"

- లక్ష్మి
[/b]
[+] 2 users Like Lakshmi's post
Like Reply


Messages In This Thread
RE: మనం చదివిన పుస్తకాలు - మనం రాసే సమీక్షలు - by Lakshmi - 28-03-2019, 01:15 PM



Users browsing this thread: 4 Guest(s)