09-11-2018, 09:12 PM
41.1
వాళ్ళు వెళ్ళిన తరువాత , సర్పంచ్ వాళ్ళు కుడా వెళ్లి పోయారు, నేను పెద్దాయన మాత్రమే మిగిలాము.
"మేము గుడిలోకి వెళ్లి నప్పుడు పూజారి మీ వంశస్తుల గురించి చెప్పారు, మీ వంశస్తులు ఒకప్పుడు రాజుల దగ్గర పాలే గాల్లగా పనిచేసారంట , మీరు సర్పంచ్ కాకుండా ఇంకా మీ వంశంలో వాళ్ళు ఎవరూ వున్నారు. "
"మా ముత్తాత కు ముగ్గురు కొడుకులు వాళ్ళకు నేను పెద్దాయన కొడుకుని , సర్పంచేమో రెండో అయన కొడుకు , ఇంకా మూడో ఆయన కొడుకేమో మన ఓబులేసు అంగడి వుంది చూడు ఆయన ఇంటికి ఎదురుగ్గా ఓ ఇల్లు వుంది చూడు ఆ ఇంటాయన గంగి రెడ్డి , గంగిరెడ్డి వాళ్ళ నాయన వున్నా పొలాలన్నీ పోగేట్టాసాడు , అందుకే పాపం గంగి రెడ్డి వాళ్ళు పొలాలు కవులకు చేసుకుంటూ బతుకు తున్నాడు."
"వాళ్ళేనా ఇంకెవరు లేరా మీ వంశస్తులు "
"మిగిలిన వాళ్ళు అందరు బందువులే గాని మా వంశస్తులు కాదు"
"మన పొలం పక్కన గుట్టల్లో ఎదో నిధి వుందని చెప్పేడు , మరి మీ వాళ్ళు ఎవరూ ప్రయత్నించ లేదా దానిని గూర్చి "
"ఆ ఎం నిదో ఏమో ఎప్పుడో మా పెద్దలు ప్రయత్నించారంట కాని దాని ఆనవాళ్ళు కుడా దొరక లేదు వారికి"
"నేను అలా తోట లోకి వెళ్లి వస్తా పెద్దయా, ఇంటి దగ్గరే ఉంటే బోరుగా ఉంటుంది " అంటూ తోట వైపు వెళ్లాను , ఇప్పటికి మూడు రాగి రేకులు దొరికాయి , కాని ఏముందో అందులో తెలియదు చుస్తే ఓ పని అయిపోతుంది అనుకుంటూ పొలంలో కొట్టంలోకి వెళ్లి నా దగ్గర మున్న ముక్కలు బయటకు తీసాను.
చూస్తుంటే అవి నాలుగు ముక్కలు అనిపిస్తుంది , వాటిని ఓపెన్ చేసి చుస్తే ఒక్కొకటి త్రిభుజాకారంలో వున్నాయి వాటి మీద ఏవో గీతాలు వున్నాయి అక్కడక్కడ ఎదో లిపి నాకు అర్తం కాలేదు. ఇది sanskrit కుడా కాదు , ఇంకా నాలుగో రేకు ఎవరి దగ్గర వుందో ఎలా కనుక్కోవడం. అని ఆలోచిస్తుంటే ఎవరో గేటు తీసినట్లు అనిపిచ్చింది ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ రాగి రేకులను జేబులో తోసేసాను. ఎవరో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడు తున్నట్లు అనిపించింది. ఓ వాయిస్ రాజి ది , ఇంకోటి వాళ్ళ అత్తది ఇద్దరూ ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి అనుకుంటూ వుండగా , కొట్టం లోకి వచ్చారు.