28-12-2020, 10:39 PM
EPISODE 42
(కథనం త్వరగా అయిపోగొట్టలి అనే నెపం తో కొంచెం స్పీడ్ గా వెళ్తున్నా కాబట్టి కాస్త స్టోరీ ని adjust chesukondi)
బిందు కట్టు కట్టి వెళ్ళాక నొప్పి కొంచెం తగ్గింది. కానీ మేడం బిందూ ఇద్దరూ నాతో మాట్లాడ నందుకు బాధ ఇంకా పెరిగింది. పైగా నా వల్ల మేడం బిందు కూడా మాట్లాడుకోకపోవడం ఇంకా చాలా బాధను పెంచింది. నేనింత చేసినా కూడా మేడం నాకే సపోర్ట్ గా ఉండడం నేను ఎదో పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యం లా అనిపించింది. మనసులోనే మేడం కు థాంక్స్ చెప్పుకుంటూ బిందు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల మెల్లిగా నిద్ర లోకి జారుకున్నా గతం లో జరిగినవి అన్నీ గుర్తు చేసుకుంటూ..
బిందు ఇంటి నుండి భరత్ ఏడుస్తూ వెళ్ళాక మేడం బిందు ఇంట్లోనే రాత్రి వరకు ఉండిపోయింది. మేడం అలా బిందు నుండి భరత్ ను కాపాడి నందుకు బిందు మేడం ను తిడుతూ గాయాలు తగిలిన దగ్గర ఆయింట్ రాసి మేడం ముఖం లోకి చూసి సిగ్గు ఉండాలి వాడిని కాపాడి నందుకు వాడేం నాకు దొరకక పొడనుకున్నవా, చంపుతా చూడు వాన్ని అంటూ కోపంగా చెప్పి మేడం కు ఇంజెక్షన్ చేసి పడుకో బెట్టింది. మేడం పరిస్థితి రకరకాలుగా ఉంది.
భరత్ ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు తను. వొళ్ళంతా వాడు పెట్టిన గాట్లకు నొప్పి పెడుతున్నా తన మనసులో పెట్టే బాధ కంటే ఇది పెద్దగా అనిపించలేదు తనకు. బిందు మేడం ఇంటికి ఫోన్ చేసి ఇవ్వాళ రాదు కాస్త పని ఉంది అని చెప్పేసి మేడం ను రాత్రంతా తన ఇంట్లోనే పడుకో బెట్టుకుంది.
అర్థరాత్రి బిందు కు ఎదో అలికిడి వినిపిస్తే లేచింది. మేడం తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. అదీ చూసిన బిందు వెంటనే తనను కదిపి తన కంట్లో నీళ్లను తుడుస్తూ ఏడవకు అని అంటూ లేచి కూర్చుని మేడం తలను తన వొడిలో పెట్టుకుని ఓదా ర్చింది.
మేడం బిందు వంక చూసి ఇంకా ఎక్కువ ఏడ్వసాగింది. బిందు భరత్ ని మనసులో తిట్టుకుంటూ మేడం ను గట్టిగా తన వొడిలో పెట్టుకునే కౌగిలించుకుంది. అలా కౌగిలించు కునీ ఎడ్వకే తల్లీ నాకు ఏడుపు వస్తుంది అంటూ తనని ఎలాగోలా బుజ్జగించి నిద్ర పుచ్చింది. కాసేపటికి మేడం నిద్ర లోకి జారుకోగానే బిందు తన వొడిలో ఉన్న మేడం తలను నిమురుతూ అలాగే ఉండిపోయింది..
అలా నిమురుతూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు మేడం కదలిక ఇవ్వగానే వెంటనే మేలుకుని టైం చూసింది.
తెల్లవారుజామున ఐదు అవుతూ ఉండగా మేడం లేవడం చూసి ఇంకాసేపు పడుకో అని చెప్పింది. తన ముఖం బాగా వాచిపోయింది. అలా చెప్పి తనను పడుకో బెట్టి తన కార్యక్రమాలు అన్నీ చేసుకుంది. తొమ్మిది అవుతూ ఉండగా తనని లేపి కాఫీ ఇచ్చి తనను చూసింది. తను ఇంకా ఎదో ధ్యాస లోనే ఉంది. కానీ నిన్నటితో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటర్ గానే కనిపించింది బిందు కు. తను కాస్త కుదుట పడడం బిందు కు సంతోషాన్ని ఇచ్చింది. ఆ తరువాత బిందు వేడి నీళ్ళతో మేడం కు దగ్గర ఉండి స్నానం చేయించి తన బట్టలు మేడం కు కట్టి టిఫిన్ తినిపించి మళ్ళీ పడుకో బెట్టింది. మేడం ఇంకా పూర్తిగా కుడుటపడలేదు అని గ్రహించిన బిందు క్లినిక్ కు సెలవు పెట్టి సంధ్య ఇంటికి కాల్ చేసి ఇవ్వాళ్ళ కూడా రాలేదు అన్నయ్యా అని సంధ్య భర్త కు చెప్పింది.
మేడం మధ్యాహ్నం మూడు వరకు పడుకునే ఉంది. అలా ఇంకో రోజు వరకు తన దగ్గరే పెట్టుకుని మేడం ను చిన్న పిల్లలా చూసుకుంది బిందు. మేడం మూడో రోజు కాస్త కుదుట పడగానే తన ఇంటి గురించిన ఆలోచన వచ్చింది.
ఇంట్లో నేను రాలేదని కంగారు పడుతుంటారు అని హడావిడిగా బిందు తో చెప్పి బయలుదేరుతూ ఉంటే బిందు నేను ఫోన్ చేసి చెప్పాలే అని సర్ది చెప్పి తనకి ఇంకాసేపు రెస్ట్ అవసరం అని ఆరోజు సాయంత్రం వరకు పెట్టుకుని తానే స్వయంగా ఇంటి దగ్గర డ్రాప్ చేసింది..
మూడు రోజుల క్రితం ఇంట్లో పరిస్థితి...
మేడం భరత్ ఇద్దరూ కనిపించక పోవడం తో భరత్ అమ్మ వెళ్ళి సిద్దు నాన్న ను అడిగింది. సిద్దు నాన్న నాక్కూడా తెలీదు వాళ్ళే వస్తారు లే ఎదో పని మీద వెళ్ళారేమో అని అనగానే భరత్ అమ్మ సరే అనుకుంది. కానీ రాత్రి వరకు వాళ్ళ జాడే లేకపోయే సరికి సిద్దు కు ఏమైనా తెలుసేమో అని సిద్దు రూం లోకి వెళ్ళింది.
అక్కడ సిద్దు హారిక తో మాట్లాడుతూ ఇప్పుడు అమ్మ ఆంటీ ఇంట్లోనే ఉండడం మంచిది లే మళ్ళీ తనని అలా చూసి నాన్న ఏమంటాడో అని అంటూ ఉండగా భరత్ అమ్మ రావడం చూసి వెంటనే నేను మళ్ళీ చేస్తా హారిక అని ఫోన్ పెట్టేసాడు.
భరత్ అమ్మ సిద్దు తో మీ అమ్మ, భరత్ గాడు ఎక్కడ రా కనిపించడం లేదు పొద్దున నుండి అని అంది. సిద్దు కు భరత్ పేరు వినగానే సర్రున కాళింది. కానీ ఎంతైనా అత్త కాబట్టి కాస్త నెమ్మదించి కాస్త చిరాకుగానే తెలీదు అత్తా అమ్మ అయితే బిందు ఆంటీ ఇంటికి వెళ్ళింది పని మీద ఇవ్వాళ రాకపోవచ్చు ఇక వాడైతే ఏమో నాకు తెలీదు అని అన్నాడు.
భరత్ వాళ్ళ అమ్మ ఫోనీ ఫోన్ అయినా చెయ్ సిద్దు అని అంది. సిద్దు కొంచెం చిరాకుగా అబ్బా అత్తా నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ చేస్తాలే అని విసుక్కున్నాడు. భరత్ అమ్మ సరే అంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది. రాత్రి పది అవుతూ ఉండగా భరత్ అమ్మ సిద్దు నాన్న కు భోజనం పెడుతూ వాడు ఇంకా రాలేదు అన్నయ్యా ఎక్కడున్నాడో అని అంది. సిద్దు నాన్నా వాడే కాదు ఈ సంద్య కూడా ఏమైందో ఏమో అంటూ ఉండగా కాల్ వచ్చింది బిందు నుండి సిద్దు నాన్నకు. ఎత్తి మాట్లాడగానే బిందు తను ఇవ్వాళ్ళ రాత్రి రాలేదు అని చెప్పడం సిద్దు నాన్న సరే అనడం ఆ విశయం భరత్ అమ్మకు చెప్పడం జరిగిపోయాయి. కానీ భరత్ అమ్మ భరత్ ఎక్కడున్నాడో అని అంది. అప్పుడే సిద్దు రావడం తో సిద్దు నాన్న ఎరా నీ బావ ఎక్కడ అని అనగానే సిద్దు గాడికి కింద నుండి ఒక్కసారిగా మండిపోయింది. కానీ అదుపు చేసుకుంటూ వాడు ఎక్కడికో వెళ్ళాడు వాడి నంబర్ కూడా తగలట్లేదు రెండు రోజులు వాడి ఫ్రెండ్ ఇంట్లో పని ఉంది అని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా విన్నా బహుశా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని చిరాకుగా నే చెప్పేసి తినేసి వెళ్ళిపోయాడు..
సిటీ లో ఉంటున్నాడు కదా ఇలా ఫ్రెండ్స్ తో తిరగడం మామూలే అని సిద్దు నాన్న ఇంకా భరత్ అమ్మ ఇద్దరూ కామ్ అయిపోయారు..
బిందు కార్ దిగి మేడం ఇంటి తలుపు తీసింది. అలా ఆ రోజు పొద్దున వెళ్లిన మేడం మళ్ళీ మూడో రోజు రాత్రి ఇంట్లోకి అడుగు పెట్టింది. బిందు జాగ్రత్తలు చెప్పేసి వెళ్లిపోయింది. మేడం తన వొంటి మీది గాయాలు కనిపించ కుండా కొంగు వొళ్ళంతా కప్పేసుకుని ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు తన పరిస్థితి శారీరకంగా కాస్త మెరుగు గా ఉంది కానీ మానసికంగా ఇంకా అంత కుదుట పడలేదు. ఇంట్లోకి వస్తున్న మేడం ను చూడగానే సిద్దు అమ్మ దగ్గరకు వెళ్ళాడు. కానీ మేడం సిద్దు ను పట్టించు కోకుండా తన గది లోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద సిద్దు నాన్న కు టాబ్లెట్స్ తీసి ఇస్తు కనపడింది భరత్ అమ్మ. మేడం రావడం చూసిన సిద్దు నాన్న ఏంటే ఇన్నాళ్లకు గుర్తు వచ్చిందా ఇల్లు అన్నాడు. భరత్ అమ్మ మేడం దగ్గరకు వెళ్తూ ఏంటే మొహం అంతా అదోలా అయ్యింది అంటూ బుజం చుట్టూ కప్పుకున్న పైట ను చూస్తూ ఎంటి ఇలా కప్పుకున్నావు అంటూ తీయబోయింది. కానీ అంతలోనే మేడం వొదిన నాకు చలి జ్వరం లాగుంది పొద్దున మాట్లాడదాం లే అంటూ ముభావంగా వెళ్ళి సిద్దు నాన్న పక్కలో బెడ్ షీట్ కప్పేసుకునీ అటు వైపుకు తిరిగి పడుకుంది.
అలా పడుకున్న మేడం ను చూసి సిద్దు నాన్న భరత్ అమ్మ అర్దం కానట్లుగా చూసి లైట్ తీసుకున్నారు. భరత్ అమ్మ వెళ్తూ వెళ్తూ ఈ పుత్ర రత్నం ఎప్పుడు వస్తాడో ఇంటికి ఇప్పటికే మూడు రోజులు అయ్యింది అని అనుకుంటూ బయటకు వెళ్ళింది.
ఆ మాటలు విన్న మేడం ఒక్కసారిగా కళ్ళు తెరిచి భరత్ ఇంటికి రాలేదా మూడు రోజులు మరీ ఎక్కుడకు పొయాడని ? వాళ్ళ ఫ్రెండ్ వినయ్ వాళ్ళింటికి వెళ్ళాడా లేక ఇంకేదైనా నా అని అనుకుంటూ ఉండగా సిద్దు నాన్న అవునే భరత్ గాడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా అన్నాడు.
మేడం అలాగే పడుకుని చిన్న స్వరం తో ఫోన్ చేయలేదా అంది. సిద్దు నాన్న చేశాం కానీ తగలలేదు, సిద్దు గాడు భరత్ గాడు ఫోన్ లో ఎవరితోనో ఫ్రెండ్ తో రెండు రోజులు మీ ఇంట్లో ఉండాలా సరే చుస్తా లే అంటూ అనడం విన్నాడంట, కానీ ఎంత అంటే మాత్రం ఒక్క మాట అయినా చెప్పాలి కదా, కనీసం ఫోన్లో అయినా,, ఏంటో ఈ కాలం పిల్లలు స్వేచ్ఛ ఎక్కువైపోయింది అని అంటూ పడుకున్నాడు. కానీ మేడం కు సిద్దు చెప్పిన మాటలు నిజం అని అనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఊరికి అయితే వెళ్ళి ఉండడు మరీ ఎక్కడకు వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ రేపు ఆ వినయ్ కు కాల్ చేయిద్ద్దాం పిరికి వెధవ అక్కడ దాక్కుని ఉంటాడు అని అనుకుంటూ నిద్ర లోకి జారుకుంది..
బైక్ మీద భరత్ ను మేఘా శైలు ఇద్దరూ కలిసి అక్కడే దగ్గర లో ఉన్న మెడికల్ కాంప్ కు తీసుకు వెళ్లారు. ఆ మెడికల్ క్యాంప్ లో రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాక మూడో రోజు కళ్ళు తెరిచాడు భరత్.. లేచిన వెంటనే మేడం పట్ల చేసిన దాన్ని తలుచు కుంటు నిద్ర మత్తు లోనే కళ్ళు మూసుకుని మేడం కు క్షమాపణ చెప్తూ ఉండగా మేడం కూతురు మేఘా (స్వీటీ) తన చేతిని పట్టుకోవడం ఆ స్పర్శ మేడం స్పర్శ ఒకేలా ఉండడం భరత్ ఆ స్పర్శ ను మేడం స్పర్శ లా అనుభవించడం..
ఆ తరువాత మెలుకువ లోనే కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు మేఘా శైలు మాట్లాడుకోవడం, మేఘా తనని లవ్ చేస్తుంది అని తెలుసుకోవడం, తనకు మళ్ళీ కొత్త ప్రాబ్లెమ్ రాకూడదు అని పైగా తను మేడమ్ లాగే ఉండడం తో తనకు తన స్టోరీ చెప్పెద్దం అనుకోవడం, అలా అనుకుని మేడం గురించి మేడం పట్ల చేసిన దారుణం గురించి మేడం కూతురికే చెప్పేయడం ఆ తరువాత తను మేడం కూతురే అని తెలుసుకోవడం ఇవ్వన్నీ వరుసగా జరిగిపోయాయి..
మేడం కూతురికే మేడం గురించి చెప్పానే అని అనుకుంటూ ఉండగా తను అక్కడ నుండి వెళ్లిపోవడం తో ఎం చేయాలో తెలియలేదు. ఆ తరువాత డాక్టర్ నా డిటైల్స్ అడగగానే ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్దం కాలేదు ఇక తప్పక సిద్దు నాన్న డిటైల్స్ ఇచ్చేయడం, వాళ్ళు మరుసటి రోజు (నాలుగవ రోజు) సిద్దు నాన్న కు కాల్ చేయడం జరిగిపోయాయ్..
ఏమే త్వరగా రా, భరత్ గాడికి మూడు రోజుల క్రితం ఆక్సిడెంట్ అయ్యిందట ఇప్పుడు మెడికల్ క్యాంప్ లో ఉన్నాడంట అంటూ పిలుపు వినగానే పడుకున్న నేను ఒక్కసారిగా లేచి పరుగు లాంటి నడకతో హాల్ లోకి వెళ్ళాను..
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..