22-03-2019, 12:44 AM
ఆలీ ఖాన్ గ్యాంగ్ ఢిల్లీ బయల్దేరిన విషయం హైదరాబాదులో ఉన్న ఏజెంట్ కి కూడా తెలిసింది వాడు వెంటనే అనూష కి ఫోన్ చేసి " పై పోర్షన్లో అలిగాను ఉన్నాడో లేదో చూడు"అన్నాడు అనూష "నీకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఉంది "అని అడిగింది .దానికి ఏజెంట్ "వాడు రైలులో ఢిల్లీ వెళ్తున్నాడు అని తెలిసింది" అన్నాడు దానికి అనూష "తెలిసినప్పుడు మళ్లీ ఎందుకు చెకింగ్" అంది ఏజెంట్ "రాత్రి నీ అకౌంట్ లో 20000 వేశాను వాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు డబ్బులు నీకు ఇవ్వటం వేస్ట్ "అన్నాడు అనూష "మీరు " వాళ్లని ఫాలో చేస్తున్నారా" అంది ఏజెంట్ "అది నీకు అనవసరం" అన్నాడు అనూష నవ్వుతూ "నేను వాళ్లని ఫాలో చేస్తున్నాను" అంది ఏజెంట్ అదిరిపడ్డాడు "ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు "అని అడిగాడు అనూష "వాళ్లు ట్రావెల్ చేస్తున్న అదే రైలులో వాళ్ల భోగి వెనకాల బోగీలో ఉన్నాను "అంది ఏజెంట్ కి ఒక విషయం యం అర్థమైంది అనూష అంంత అమాయకమైన గృహిణి కాదు అతను ఈ విషయం పై ఆఫీసర్లకు తెలియజేశాడు. ఇప్పుడు అనూష అతని పరిధి దాటిపోయింది.