23-12-2020, 01:40 AM
(This post was last modified: 12-03-2021, 12:23 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
చొప్పదంటు ప్రశ్నలు
by మహీధర నళినీమోహన్
తుమ్ములు ఎందుకు వస్తాయి ?
గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడుతాయి ?
మేఘాలు ఎందుకు ఉరుముతాయి ?
ఆవులు ఎందుకు నెమరు వేస్తాయి ?
చీరండలు ఎందుకు అరుస్తాయి ?
చలికాలంలో తెల్లారకట్ట నోట్లోంచి ఆవిరి ఎందుకు వస్తుంది ?
సాలీడు గూడు దేనితో ఆల్లుతుంది ?
సాయంత్రం సూర్యుడు ఎర్రగా ఎందుకుంటాడు ?
జంతువులకీ భాషలున్నాయా ?
స్తంభం కనిపిస్తే కుక్క ఉచ్చ పోస్తుంది ఎందుకు ?
ఈ విధంగా చురుకైన పిల్లలు పుంఖాను పుంఖంగా చేసే ప్రశ్నలకి సరియైన సమాధానాలు ఏరగని పెద్దలు “ఇల్లాంటి చొప్పదంటు ప్రశ్నలు వెయ్యకపోతే బళ్ళో చెప్పిన పాఠాలు వల్లించుకో కూడదుట్రా ? భడవకొనా ?" అని కసిరి వాళ్ళ ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేస్తూ వుంటారు ? ప్రశ్న వేయడానికి భయపడే స్థితికి తెస్తారు ఆటువంటి పిల్లల్ని అవి చొప్పదంటు ప్రశ్నలు మాత్రం కావు. వీటికి సమాధానాల కోసం హేమా హేమీల్లాంటి సైంటిస్టులు తరతరాలుగా నానా క్రమ పడుతున్నారు. కొన్నిటికి జవాబులు దొరికే కొన్ని ప్రశ్నలు ఇంకా దురవగాహంగానే మిగిలిపోయాయి.
డౌన్లోడ్ — చొప్పదంటు ప్రశ్నలు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK