29-10-2020, 01:00 AM
వారిరువురు చెరువు కట్ట చేరుకునే సమయానికి ఒక ముసలి రైతు వారికోసమని ఎదురు చూస్తున్నాడు. ఆ ముసలోడు రాజుగానికి దూరపు బందువు.పెద రామరాజుకి దగ్గర చుట్టము. ఆయన పేరు చెబితే ఆ చెరువులో దూకి చావడానికైనా సిద్దమా ముసలి. అంటే ఈత రాదని కాదు. వానికా చెరువు పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసు. ఆ చెరువు మద్యలోని బాబయ్య మర్మం కూడా తెలుసు. ఇప్పుడక్కడ జరుగుతున్నదీ తెలుసు. కానీ ముసలాడు ఏమి చేయలేని వయస్సాయనది. అదృష్టవశాత్తూ వీరికి దొరికాడు.
"ఎట్లుంది యవ్వారం తాతా?" అని అడిగాడు శేషుగాడు ముసలాడి పక్కన కూర్చుంటూ.
"ముదిరి పాకాన పడింది. వేటగాడు గుట్టు పట్టేశాడు. కానీ జింకల చుట్టూ నక్కలు కాపలా వున్నాయి. వాటికి ఆపుగా తోడోల్లు, వాటి పైన పులులు వుండాయి. అన్నింటిని తప్పించుకుని వచ్చేసినాడు. ఈ నక్కల దగ్గర అల్లరైపోయేలా వుంది. ఆ బాబయ్య గుట్టు పట్టేస్తే ఏ అల్లరీ వుండదు. అయినా బయట సాయం కొంత అవసరమయ్యేలా వుందిరా అప్పయ్యా" అన్నడా ముసలాడు.
ఈ ట్రస్టు కట్టడాలకు మొదటి రాయి మోసిన కూలీల్లో వాడొకడు. ఎక్కడ ఏ రహస్యం దాగుందో కట్టడానికి పథకం వేసిన వాడికంటే కట్టిన వాడికే ఎక్కువ
తెలుసు. రత్నగాన్ని దగ్గరకు పిలిచి చెవిలో ఎదో వూదాడు.