22-10-2020, 01:28 AM
టైం చూసాను 9:10 అయింది. లాప్టాప్ క్లోజ్ చేసి ఫోన్ ఆన్ చేశాను. మా పెళ్లి ఫోటో చూస్తుంటే, మా పెళ్ళిజరిగి అప్పుడే ఆరేళ్ళు అయిపోయాయా అనిపించింది. మా పెళ్లిఅయిన నాలుగేళ్లకు మాకు బాబు పుట్టాడు. ఇప్పుడు వాడి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బాబు పుట్టిన తరువాత తను జాబ్ మానేసింది. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళాము బాబు ని తీస్కుని. అప్పుడే చూసాను నజీర్ ని. మా పక్కింట్లోనే ఉంటాడు. వాళ్ళ కుటుంబం చాలా పేదరికం అనుభవిస్తుంది. నజీర్ రిక్షా నడిపి కుటుంబాన్ని పోషించే వాడు. రోజుకి 200 సంపాదన వస్తుందని అందులో రిక్షా ఓనర్ కి 75 రూపాయలు ఇవ్వాలని మిగిలిన దానితో కుటుంబాన్ని పోషించాలని మా అమ్మ చెప్పింది.
చిన్నప్పటి నుండి నేను చూసిన కుటుంబం. అందులో వాళ్ళ నాన్న నాకు బాగా పరిచయం. సైకిల్ మెకానిక్ షాపులో పనిచేసావాడు. బాషా అన్న సైకిల్ కి గాలి కొట్టు అంటే వెంటనే కొట్టెవాడు. చాలా మంచి మనిషి. మాకు ఎలాగో ఒక పని మనిషి కావాలి. ముఖ్య0 గా బయటకి వెళ్లి సామాన్లు తేవడానికి చాలా అవసరం. ఒక పనిమనిషి ని పెట్టుకోవాలని అనుకుంటున్నామని అమ్మ కి చెప్తే, అమ్మే చెప్పింది నజీర్ గురించి. ** వరకు చదివి ఆపేసాడంట. కొన్ని సంవత్సరాలనుండి కాళీ గా ఉండి, ఇప్పుడు రిక్షా నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పింది. వయస్సు 19 లేదా 20 ఏళ్ళు ఉండొచ్చు. అమ్మ సురేఖ ని కూడా అడిగి సరే అంటే కనుక్కుంటా అని చెప్పింది.